మన దేశంలో బ్రాయిలర్‌, లేయర్‌ కోళ్ళ పరిశ్రమ అతిపెద్ద పరిశ్రమ. వీటి తరువాత బాతుల పెంపకం, టర్కీ కోళ్ల పెంపకం వంటి చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో టర్కీ కోళ్ళను ఇంటి దగ్గర పాములు వంటి వాటి నుండి రక్షణ పొందటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతమంది మాంసం కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే దీని మాంసం పలుచగా ఉంటుంది. మామూలు కోళ్ళలాగే పోషణ ఉంటుంది. వ్యాదులు తక్కువ. పిల్లలు అమ్ముకుంటే మార్కెట్‌లో 100 నుండి 200 వరకు ధర పలుకుతాయి. టర్కీ కోల్ళ పెంపకం చేసే రైతులకు క్లుప్తముగా వివరాలు ఇవ్వడం జరిగింది.

భారత దేశంలో టర్కీ కోళ్ళ జాతులు

టర్కీ కోళ్ళ రకాలు ఇవీ:

1. బోర్డ్‌ బ్రెస్టెడ్‌ బ్రాంజ్‌ :

నిజానికి ఈ రకం టర్కీ కోళ్ళ ఈకలు కంచు(బ్రాంజ్‌) రంగులో కాక, నల్ల రంగులో ఉంటాయి. ఆడ కోళ్ళకు రొమ్ము వద్ద తెల్ల మొనలున్న నల్లని ఈకలుంటాయి. కేవలం 12 వారాల వయసుకే అది ఆడకోడి అని గుర్తించడానికి ఇవి తోడ్పడతాయి.

2. బోర్డ్‌ బ్రెస్టెడ్‌ వైట్‌ :

ఈ రకం బోర్డ్‌ బ్రెస్టెడ్బ్రాంజ్‌ కోడి మరియు సాంకర్యం వల్ల తెల్ల ఈకల వైట్‌ హాలండ్‌ కోడి, కలిగే సంకరజాతి టర్కీ కోడి ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి కనుక, భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఈ తెల్ల ఈకల కోళ్ళు బాగా అనువుగా ఉంటాయనిపిస్తుంది. ఇంతే కాకుండా, ఈకలు తీసి, డ్రెస్సింగ్‌ చేసిన కోడి శుభ్రంగా, చూడడానికి ఇంపుగా ఉంటుంది.

3. తెల్లని చిన్న రకం బెల్ట్‌ స్విల్లె :

రంగులో, ఆకారపు తీరులో ఇది , బోర్డ్‌ బ్రెస్టెడ్‌ వైట్‌ రకం కోడిని బాగా పోలిఉంటుంది. అయితే, సైజులో చిన్నదిగా ఉంటుంది. బరువైన రకాలతో పోలిస్తే, గుడ్లు పెట్టగలగడంలో, గుడ్ల ఉత్పత్తిలో, పొదగడంలో ఇవి మేలనిపిస్తాయి. అయితే, పొదిగిన తరువాత మొదటి 4 వారాలలోపు తన పిల్లల ఆలన పాలన చూసుకునే (బ్రూడింగ్‌) విషయంలో మాత్రం ఈ రకం కోళ్ళు మెరుగు కాదనిపిస్తాయి.

4. నందనం టర్కీ 1 :

నందనం టర్కీ 1 అనేది, దేశవాళీ నల్లకోడి, మరియు విదేశీ రకానికి చెందిన తెల్లని చిన్నరకం బెల్ట్‌ స్విల్లె కోడి సాంకర్యంవల్ల పుట్టే సంకరజాతి కోడి. తమిళనాడు వాతావరణ పరిస్థితులకు ఇది అనువుగా ఉంటుంది.

టర్కీ కోళ్ళ పెంపకంలో ఆర్ధికాంశాలు

పుంజుపెట్ట నిష్పత్తి 1:5

గుడ్డు సగటు బరువు 65 గ్రా.

అప్పుడే పుట్టిన కోడిపిల్ల సగటు బరువు 50 గ్రా.

జత కలవడానికి శారీరక ఎదుగుదల 30 వారాలు

వయసు (మెచ్యూరిటి)

సగటు గుడ్ల సంఖ్య 80 - 100

పొదగడానికి పట్టే సమయం 28 రోజులు

20 వారాలకు సగటు బరువు

పుంజు 7 - 8 కిలోలు

పెట్ట 4.5-5.0 కిలోలు

గుడ్లు పెట్టే వ్యవధి 24 వారాలు

అమ్మదగిన (మార్కెట్‌ చేయదగిన) వయసు

పుంజు 14 - 15 వారాలు

పెట్ట 17 - 18 వారాలు

అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) బరువు

పుంజు 7.5 కిలోలు

పెట్ట 5.5 కిలోలు

ఆహార సామర్ధ్యం 2.7 - 2.8

అమ్మదగిన వయసు వరకు సగటున తినే దాణా

పుంజు 24-26 కిలోలు

పెట్ట 17-19 కిలోలు

మొదటి 4 వారాలలోపు చనిపోయే కోడిపిల్లల శాతం 3 - 4 శాతం

టర్కీ కోళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులు :

పొదగడం

టర్కీ జాతి కోళ్ళు పొదగడానికి పట్టే కాలం 28 రోజులు. పొదగడం రెండు రకాలు.

ఎ) ప్రకతి సహజంగా, కోడిపెట్ట పొదగడం.

టర్కీలు పొదిగే విషయంలో పేరుపొందినవి. పొదిగే పెట్ట ఒకేసారి 10 - 15 గుడ్లను పొదుగుతుంది. గుడ్ల పొదుగుదల 60 - 80 శాతం వరకు ఉండి, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, గుడ్డు ఆకారం, గుడ్డు పై పెంకు బాగా ఉండి, శుభ్రంగా ఉండే గుడ్లను మాత్రమే పొదగడానికి ఉంచాలి.

బి) కత్రిమంగా పొదగడం

గుడ్లను ఇంక్యుబేటర్లలో ఉంచి యాంత్రికంగా పొదగడాన్ని, కత్రిమంగా పొదగడం అంటారు. ఇంక్యుబేటర్‌ లోని సెట్టర్హాచర్‌లో ఉండవలసిన ఉష్ణోగ్రత, గాలిలో తేమ వివరాలు.

ఉష్ణోగ్రత (ఫారన్‌ హీట్‌ డిగ్రీలు) గాలిలో తేమ (శాతం)

సెట్టర్‌ - 99.5 61-63

హాచర్‌ - 99.5 85 - 90

రోజూ ప్రతి గంటకొకసారి గుడ్లను పై భాగం కిందికి, కిందిభాగం పైకి తిప్పాలి. తడిలేకుండా చూడడానికి, గుడ్లు పగలకుండా నివారించడానికి, ఎక్కువ శాతం గుడ్ల నుంచి పిల్లలు రావడానికి వీలుగా తరచుగా గుడ్లను సేకరించాలి.

బ్రూడింగ్‌ :

పుట్టిన దగ్గర నుంచి 4 వారాలపాటు తగినంత వేడిసోకే ప్రత్యేకమైన ఏర్పాటుతో కోడిపిల్లలను పెంచడాన్ని బ్రూడింగ్‌ అంటారు. టర్కీ కోళ్ళ విషయంలో బ్రూడింగ్‌ 0- 4 వారాలపాటు ఉంటుంది. అయితే, శీతా కాలంలో, ఇది మరికొంత పెరిగి, 5 - 6 వారాల వరకు ఉంటుంది. దేశవాళీ కోడిపిల్లలతో పోలిస్తే, టర్కీ పిల్లలకు కూర్చోడానికి రెట్టింపు స్థలం అవసరమవుతుందనే విషయం మరచిపోకూడదు. టర్కీ పిల్లలను మొదటి రోజున పలుచటి ఎరుపు రంగు (ఇన్ప్రా రెడ్‌) బల్బు కాంతిలో, లేదా గ్యాస్‌ బ్రూడర్‌ ద్వారా, లేదా సాంప్రదాయిక బ్రూడింగ్‌ పద్ధతులలో బ్రూడింగ్‌ చేయవలసి ఉంటుంది.

బ్రూడింగ్‌ విషయంలో పాటించవలసిన అంశాలు....

0 - 4 వారాల పాటు ఒక్కొక్క టర్కీ కోడిపిల్లకు 1.5 చదరపు అడుగుల స్థలం (నేల) అవసరమవుతుంది

టర్కీ పిల్లలను తేవడానికి కనీసం రెండురోజులు ముందే, బ్రూడర్‌ గదిని సిద్ధం చేసుకోవాలి

నేలను తగినంత వేడిగా ఉంచడానికి నేలపైన చల్లే పదార్ధాన్ని (లిట్టర్‌ మెటీరియల్‌) 2 మీటర్ల వ్యాసంలో గుండ్రగా చల్లాలి

వేడి సోకే ఏర్పాటు నుంచి పిల్లలు దూరంగా పోకుండా నివారించడానికి, కనీసం ఒక అడుగు ఎత్తున చుట్టూ కంచె ఉండాలి

950 ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రతతో ప్రారంభించి, వారానికి 50 డిగ్రీల వంతున 4 వారాల వరకు తగ్గిస్తూ పోవాలి

నీరు పెట్టడానికి ఎక్కువ లోతులేని పాత్రలు వాడాలి

మొదటి నాలుగు వారాలలో సగటున 6 - 10 శాతం టర్కీ పిల్లలు చనిపోతాయి. పుట్టిన కొద్దిరోజులపాటు కోడిపిల్లలు తినడానికి, తాగడానికి సాధారణంగా ఇష్టపడవు. ఆ లేత వయసులో వాటి కంటి చూపు సరిగా ఉండకపోవడం, అవి కొంత బెదురుతూ ఉండడం ఇందుకు కారణం. అందువల్ల వాటిని బలవంతంగా తినిపించాలి.

బలవంతంగా తినిపించడం

బొత్తిగా ఆహారం తీసుకోకపోవడమనేది లేత వయసులో కోడిపిల్లలు చనిపోవడానికి ఒక ప్రధాన కారణం. అందువల్ల, వాటికి ఆహారం, నీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. బలవంతంగా ఆహారం అందించడంలో మొదటి 15 రోజుల వరకు, లీటరు నీటికి 100 మి.లీ. పాలు పట్టాలి. 10 పిల్లలకు ఒకటి వంతున ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. వాటి పోషణకు అవసరమైన మాంసకత్తులను సమకూర్చడానికి, శక్తిని కలిగించడానికి ఇవి ఉపయోగపడతాయి.

ఆహారం ఉన్న గిన్నెను వేళ్లతో నెమ్మదిగా తడుతూ, టర్కీ పిల్లలను దాణా వద్దకు రప్పించవచ్చు. దాణా పాత్రలో, నీటి పాత్రలలో రంగు రంగుల గోళీలు వేసికూడా వాటిని ఆకర్షించవచ్చు. టర్కీలు ఆకుకూరలంటే ఎక్కువగా ఇష్టపడతాయి. అందువల్ల కత్తిరించిన ఆకులను కలిపిన దాణాను పెట్టడంవల్ల, అవి మరింత ఆహారం తీసుకునేలా చేయవచ్చు. మొదటి రెండు రోజులపాటు కోడిగుడ్లను ఉంచే రంగు రంగుల ట్రేలను కూడా ఆహార పాత్రలుగా ఉపయోగించవచ్చు.

నేలను కప్పే (లిట్టర్‌) పదార్ధాలు :

సాధారణంగా, రంపపుపొట్టు, వరి పొట్టు(ఊక), మెత్తటి కలప పీచు వంటి వాటిని బ్రూడింగ్‌లో నేలను కప్పడానికి (లిట్టర్‌) వాడుతారు. వీటిని మొదట్లో 2 అంగుళాల మందంగా వేసి, రోజులు గడిచే కొద్దీ మందం పెంచుతూ 3-4 అంగుళాల మదం వరకు ఉంచచ్చు. ఈ పదార్ధాలు గట్టిపడిపోకుండా వాటిని తరచు పైకి కిందికి మార్చుతుండాలి.

పెంపకం పద్ధతులు :

టర్కీలను ఆరు బయట (ఫ్రీ రేంజ్‌) పెంచవచ్చు లేదా, గదిలో (ఇంటెన్సివ్‌ సిస్టం)లో పెంచవచ్చు

ఆరుబయట పెంపకం :

ఉపయోగాలు :

దాణా ఖర్చు సగం తగ్గుతుంది

పెట్టుబడి తక్కువ

ఖర్చు ఆదాయం నిష్పత్తి ఎక్కువ

ఆరు బయలు పద్ధతి కింద, చుట్టూ కంచె వేసిన ఒక ఎకరా పొలంలో, 200 - 250 పెద్ద టర్కీలను పెంచవచ్చు. రాత్రి సమయంలో ఒక్కొక్క టర్కీకి 3 - 4 చదరపు అడుగుల వంతున అవి తలదాచుకోవడానికి వసతి కల్పించాలి. అవి చెత్తా చెదారం తినేటప్పుడు, శత్రు జంతువులు నుంచి వాటిని కాపాడాలి. నీడ మరియు చల్లగా ఉండడానికి చెట్లు నాటితే మంచిది. పరాన్న జీవుల వల్ల వ్యాధులు సోకకుండా, వాటిని అప్పుడప్పుడు ఒకచోటి నుంచి మరో చోటికి మార్చుతుండడం అవసరం.

ఆరుబయట పద్ధతిలో దాణా :

టర్కీలు భూమిలోని పురుగులను, చెత్తా చెదారాన్ని బాగా తింటాయి. ఈ రకంగా, అవి వానపాములను, సూక్ష్మజీవులను, నత్తలను, చెద పురుగులను, వంటింటి వ్యర్ధ పదార్ధాలను తినగలుగుతాయి. ఇవి అన్నీ మంచి మాంసకత్తులు. ఇందువల్ల, దాణా ఖర్చు సగం కలిసి వస్తుంది. ఇవే కాకుండా, జనుము, స్టైలో, ఇతర పప్పుధాన్యపు జాతి మొక్కలను కూడా వీటికి ఆహారంగా వేయవచ్చు. టర్కీలకు వచ్చే కాళ్ళ బలహీనతను, కుంటు పడడాన్ని కాల్షియం (సున్నం) వాడకంతో అరికట్టవచ్చు. ఆల్చిప్పల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, వారానికి ఒక్కొక్క టర్కీకి 250 గ్రా. ఆల్చిప్పల వంతున ఇవ్వవలసి ఉంటుంది. తిండి ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా 10 శాతం ఆహారాన్ని కూరగాయల వ్యర్ధాల రూపంలో ఇవ్వవచ్చు.

ఆరోగ్య సంరక్షణ :

ఆరుబయలు పెంపకంలో టర్కీలకు ఆరోగ్యపరంగా, పొట్టలో ఏలికపాముల బెడద, బయట ఎర్రనల్లివంటి పురుగుల బెడద ఉంటుంది. అందువల్ల టర్కీలు ఆరోగ్యంగా పెరగాలంటే, నెలకొకసారి నులిపురుగుల మందు (డివార్మింగ్‌, డిప్పింగ్‌) వాడడం తప్పనిసరి.

షెడ్‌లో పెంపకం (ఇంటెన్సివ్‌ ఫార్మింగ్‌) :

ప్రయోజనాలు :

గుడ్లుపెట్టే సామర్ధ్యం పెరుగుతుంది

మెరుగైన యాజమాన్యం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ

గదిలో పెంచడం :

గదిలో (షెడ్డులో) పెంచడం వల్ల టర్కీలకు, ఎండ, వాన, గాలి మరియు శత్రు జీవులనుంచి రక్షణ లభిస్తుంది మరియు సౌకర్యంగా కూడా ఉంటుంది.

మన దేశంలోని ఉష్ణ ప్రాంతాలలో, టర్కీల షెడ్‌ తూర్పు - పడమరలుగా (పొడవు) ఉండడం అవసరం.

రెండు షెడ్ల మధ్య కనీసం 20 మీటర్ల దూరం ఉండాలి. బీ టర్కీ పిల్లల షెడ్‌, పెద్దటర్కీల షెడ్‌నుంచి కనీసం 50-100 మీటర్ల దూరంలో ఉండాలి.

షెడ్‌ వెడల్పు 9 మీటర్లు మించరాదు.

గది ఎత్తు నేలనుంచి 2.6-3.3 మీటర్ల వరకు ఉండవచ్చు.

వాననీరు షెడ్‌లోకి చిందకుండా, పైకప్పు గోడలపైన 1 మీటరు దిగువ వరకు ఉండేలా శ్రద్ధవహించాలి.

షెడ్ల నేల (ఫ్లోరింగ్‌) మన్నికగా, సురక్షితంగా ఉంటూనే, చౌకగా ఉండేలా చూడాలి. తేమపీల్చని కాంక్రీటు అయితే మేలు.

మందంగా లిట్టర్‌ పరచిన నేలపైన టర్కీలను పెంచడానికి సంబంధించిన సాధారణ యాజమాన్య పద్ధతులు, దేశవాళీ కోడిపిల్ల పెంపకంలో అనుసరించే మాదిరిగానే ఉంటాయి. అయితే, టర్కీలు సాధారణ కోడిపిల్లల కంటె పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి, అవి తిరుగాడే నేల విస్తీర్ణం, నీటి పాత్రలు, దాణా పాత్రల సైజు వాటికి అనువుగా ఉండేలాశ్రద్ధవహించాలి.

టర్కీలను పట్టడం :

ఏ వయసు టర్కీలైన, వాటిని కర్రతో అదిలించి ఒకచోట నుంచి మరొక చోటికి తేలికగా పంపవచ్చు. టర్కీలను పట్టడానికి చీకటిగది అయితే మేలు. టర్కీని రెండుకాళ్లు పట్టుకుని పైకి ఎత్తాలి, ఇలా ఎత్తినందు వల్ల వాటికి నొప్పి ఉండదు అయితే, కూతకు వచ్చిన (మెచ్యూర్డ్‌) టర్కీని 3 - 4 నిమిషాలను మించి అలా తలకిందులుగా వేలాడేలా ఉంచకూడదు.

టర్కీలకు అవసరమైన తిరుగాడే నేల, నీటి పాత్ర, దాణా పాత్ర పరిమాణాలు :

టర్కీ వయసు నేల విస్తీర్ణం దాణా పాత్ర నీటిపాత్ర

(చ.అ) పొడవు (సెం.) పొడవు (సెం.)

0-4 వారాలు 1.25 2.5 1.5

5-16 వారాలు 2.5 5.0 2.5

16-29 వారాలు 4.0 6.5 2.5

టర్కీ బ్రీడర్‌ 5.0 7.5 2.5

టర్కీలు సహజంగా బెదురు స్వభావం కలవి. అందువల్ల అవి ఎప్పుడూ బెదిరిపోతుంటాయి. కాబట్టి, టర్కీలను పెంచే షెడ్‌లోకి ఇతరుల రాకపోకలను వీలున్నంత పరిమితం చేయాలి.

ముక్కు కత్తిరించడం :

వాటి ఈకలు పీకుకోకుండా, తోటి టర్కీ పిల్లలను చంపకుండా నివారించడానికి టర్కీ కోడిపిల్లల ముక్కు కత్తిరించడం అవసరం. పుట్టిన మొదటి రోజునైనా, 3 - 5 వారాల వయసులోనైనా సరే టర్కీల ముక్కు కత్తిరించవచ్చు. ముక్కు రంధ్రాలనుంచి ముక్కు పొడవులో సగం కత్తిరించవచ్చు.

ముక్కు కండను తొలగించడం (డి స్నూడింగ్‌) :

టర్కీల ముక్కు మొదట్లో ముందుకు పొడుచుకు వచ్చినట్లుండే మాంసపు ముద్దను స్నూడ్‌ లేదా ద్యూబిల్‌ అంటారు. ఆ కండను పీక్కోవడం వల్లనో, పోట్లాట వల్లనో తలకు గాయం కాకుండా నివారించడానికి ఆ కండను తొలగించాలి. పుట్టిన మొదటిరోజున ఆ కండను వేలితో నొక్కి తొలగించవచ్చు 3 వారాల వయసులో తలకు దగ్గరగా పదునైన కత్తెరతో దానిని కత్తిరించవచ్చు.

కాలి బొటన వేలి మొన అదిమివేయడం :

పుట్టిన మొదటిరోజున టర్కీ కాలి బొటనవేలి మొనను గోరుతో సహా, కాలి చివరివేలు సందులోకి నొక్కివేయాలి.

దాణా :

దాణా రెండురకాలుగా ఇవ్వవచ్చు. ఒకటి : దంచి ఇవ్వడం, రెండు : గుళికల రూపంలో ఇవ్వడం.

దేశవాళీ కోడిపిల్లలతో పోల్చిచూస్తే, టర్కీలకు మాంసకత్తులు, విటమిన్లు, ఖనిజలవణాలు, శక్తిని ఇచ్చే పదార్ధాలు మరింతగా అవసరమవుతాయి

శక్తిని ఇచ్చే పదార్ధాలు, మాంసకత్తులు అవసరమయ్యే పరిమాణం పుంజుకు ఒకరకంగా, పెట్టకు మరొక రకంగా ఉంటుంది అందువల్ల, వాటిని వేరువేరుగా పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చు

దాణా పాత్రలోనే దాణాను వేయాలి నేలమీద వేయకూడదు

ఒకరకమైన దాణాకు బదులు మరొక రకమైన దాణా ఇవ్వవలసివస్తే, ఆ మార్పు క్రమేణా జరగాలి

టర్కీలకు శుభ్రమైన నీరు తెంపులేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి

ఎండాకాలంలో మరిన్ని నీటిపాత్రలు పెట్టాలి

ఎండాకాలంలో పగటిపూట ఎండ తక్కువగా ఉండే వేళలలో దాణా మేపాలి

కాళ్లు చచ్చుబడిపోకుండా, ఒక్కొక్క టర్కీకి రోజుకు 30 - 40 గ్రా. వంతున ఆల్చిప్పల పొడిని వేయాలి

మొక్కలు, గడ్డి మేపడం :

షెడ్లలో పెంచే పద్ధతిలో, టర్కీకి మొత్తం దాణాలో 50 శాతం మొక్కలను, ఆకులను దంచి ఇవ్వవచ్చు. ఏ వయసులో టర్కీకైనా, తాజా జనుము మొక్క మంచి బలవర్ధక ఆహారం. ఇంతే కాకుండా స్టైలో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం వల్ల దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి పద్ధతులు :

సహజంగా జతకూడడం :

కోడి పుంజు జతకోసం ఆరాటపడే తీరును కూతకు రావడం (స్ట్రట్‌) అంటారు. ఆ సమయంలో అది తన రెక్కలను విచ్చుకుని, ప్రత్యేకమైన రీతిలో అరుస్తుంది. సహజంగా జతకూడే విషయంలో పుంజు, పెట్ట నిష్పత్తి మధ్య రకం టర్కీలైతే 1:5, పెద్దరకం టర్కీలయితే 1:3. జతకూడిన పెద్ద ఆడటర్కీ సగటున ఒక్కొక్కటి 40-50 గుడ్లు పెడుతుంది. ఏడాది వయసు నిండిన మగ టర్కీలలో లైంగిక శక్తి సన్నగిల్లుతుంది, అందువల్ల వీటిని వీలున్నంత వరకు జతకూడడానికి ఉపయోగించకూడదు. ఎదిగిన మగ టర్కీలలో, ఏదో ఒక ఆడ టర్కీపట్ల మక్కువ పెంచుకునే స్వభావం ఉంటుంది. అందువల్ల మగ టర్కీలను ప్రతి 15 రోజులకొకసారి మారుస్తుండాలి.

కత్రిమ గర్భధారణ :

కత్రిమ గర్భధారణవల్ల కలిగే ప్రయోజనమేమిటంటే, టర్కీలలో మొత్తం సీజనంతా బాగా ఎక్కువగా పునరుత్పత్తి సామర్ధ్యం ఉంటుంది.

ఎదిగిన టర్కీ పుంజు నుంచి వీర్య సేకరణ :

వీర్య సేకరణకు టర్కీ పుంజు వయసు 32-36 వారాలు ఉండాలి

వీర్య సేకరణకు కనీసం 15 రోజుల ముందునుంచి టర్కీ పుంజును విడిగా, ఒంటరిగా ఉంచాలి

పుంజును ఒక క్రమపద్ధతిలో పట్టుకోవాలి, వీర్యసేకరణకు పట్టే సమయం 2 నిమిషాలు

టర్కీలు పట్టుకోబోతే చికాకుపడతాయి, అందువల్ల ఒకే వ్యక్తి ఎక్కువ వీర్యాన్ని సేకరించడానికి ఉపయోగించాలి.

వీర్యపు పరిమాణం సగటున 0.15-0.30 మి. లీ.

సేకరించిన వీర్యాన్ని గంటలోగా ఉపయోగించాలి

వారానికి మూడుసార్లు, లేదా రోజు విడిచి రోజు వీర్యాన్ని సేకరించాలి

పెట్టలకు కత్రిమంగా వీర్యాన్ని ఎక్కించడం :

టర్కీ పెట్ట గుడ్ల ఉత్పత్తి 8-10 శాతానికి చేరుకున్నప్పుడు కత్రిమ గర్భధారణ జరపాలి

పెట్టకు ప్రతి మూడు వారాలకొకసారి0.025-0.030 మి.లీ. వీర్యాన్ని (పలుచన చేయని)

ఎక్కించాలి

సీజన్‌లో 12 వారాల తరువాత, ప్రతి 15 రోజులకొకసారి వీర్యం ఎక్కించడం మంచిది

సాయంత్రం 5 - 6 గంటల మధ్య పెట్టకు వీర్యం ఎక్కించాలి

16 వారాల బ్రీడింగ్‌ సీజన్లో, 80-85 శాతం గర్భం నిలుస్తుంది

టర్కీలకు వచ్చే సాధారణ వ్యాధులు :

అరిజోనోసిస్‌

కారణం : సాల్మోనెల్లాఅరిజోనా

వ్యాధి లక్షణం : వ్యాధిసోకిన టర్కీలు గగ్గోలుగా ఉంటాయి. వాటి చూపు మందగిస్తుంది, గుడ్డితనం కూడా రావచ్చు. వ్యాధి సోకే వయస్సు 3-4 వారాల మధ్య ఉంటుంది.

నివారణ : వ్యాధి సోకిన పుంజును (జత కలవడానికి ఉపయోగించే) హాచరీనుంచి తొలగించాలి, హాచరీలో క్రిములను పోగొట్టే పొగ వేయడం, శుభ్రంగా ఉంచడం

నీలి దువ్వెన (బ్లూ కూంబ్‌) వ్యాధి

కారణం : కొరోనా వైరస్‌

వ్యాధి లక్షణం : ముడుచుకుని ఉండడం, బరువు తగ్గడం, నురగగా లేదా నీళ్ళగా రెట్ట వేయడం తల, చర్మం నల్లబడడం

నివారణ : టర్కీలను పెంచే షెడ్‌లో టర్కీల సంఖ్య తగ్గించాలి, అంటు వ్యాధులు రాకుండా షెడ్‌ను శుభ్రపరచాలి టర్కీలకు విశ్రాంతి ఇవ్వాలి

ఊపిరి తిత్తుల వ్యాధి

కారణం : మైకోప్లాస్మాగలిసెప్టికం

వ్యాధి లక్షణం : దగ్గు, గురక, తుమ్ములు, ముక్కునుంచి కారడం

నివారణ : మైకోప్లాస్మా సోకని కోళ్ళను ఎంపికచేసుకుని పెంచుకోవాలి

ఎరిసిపెలస్‌

కారణం : ఎరిసిపిలోథ్రిక్స్రూసియోపాథిడే

వ్యాధి లక్షణం : ఉన్నట్టుండి పడిపోవడం, బరువు తగ్గడం., ముక్కు మొదట్లో పెరిగిన కండ ఉబ్బడం, ముఖం రంగు మారడం

నివారణ : టీకాలు వేయించాలి

కలరా (కోళ్ళకు వచ్చే కలరా) వ్యాధి

కారణం : పాశ్చురెల్లామల్టోసిడా

వ్యాధి లక్షణం : ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులో రెట్టవేయడం, ఉన్నట్టుండి చనిపోవడం.

నివారణ : పారిశుద్ధ్యం, చనిపోయిన కోళ్ళ తొలగింపు

ఫౌల్‌ పాక్స్‌ (కోళ్ళకు సోకే మశూచి)

కారణం : పాక్స్‌ వైరస్‌

వ్యాధి లక్షణం : పుంజు తలపైన వుండే ఎర్రని తురాయి పై సన్న పసుపు పచ్చని గుల్లలు రావడం, గొంతు కింద తిత్తిలాగా రావడం.

నివారణ : టీకాలు వేయించాలి

హెమరేజిక్‌ ఎంటెరిటిస్‌ (రక్త స్రావం)

కారణం : వైరస్‌

వ్యాధి లక్షణం : ఒకటి లేదా మరిన్ని కోళ్ళు చావడం

నివారణ : టీకాలు వేయించాలి

ఇన్‌ఫెక్టియస్సినోవిటిస్‌

కారణం : మైకోప్లాస్మాగలిసెప్టికం

వ్యాధి లక్షణం : పాదాలు సాగడం, కుంటి తనం, రొమ్ముపైన గుల్లలు రావడం.

నివారణ : జబ్బు సోకని కోళ్ళను కొనుగోలు చేయాలి.

ఇన్‌ఫెక్టియస్సైనసైటిస్‌

కారణం : సూక్ష్మ క్రిములు

వ్యాధి లక్షణం : ముక్కు నుంచి కారడం, ముక్కు ఉబ్బడం, దగ్గు

నివారణ : జబ్బు సోకని హాచరీల నుంచి టర్కీలను కొనుగోలు చేయాలి.

మైకోటాక్సికాసిస్‌

కారణం : బూజు, శిలీంధ్ర కారకాలు

వ్యాధి లక్షణం : రక్త స్రావం, పాలిపోవడం , కాలేయం , మూత్ర పిండాలు ఉబ్బడం

నివారణ : పాడైపోయిన దాణా ఇవ్వకూడదు.

న్యూ కాజిల్డిసీజ్‌

కారణం : పారామైక్సో వైరస్‌

వ్యాధి లక్షణం : రొప్పడం, మెడ మెలి తిరిగి పోవడం, పక్షవాతం, మెత్తని పెంకు కలిగిన గుడ్లు పెట్టడం

నివారణ : టీకాలు వేయించాలి.

పారా టైఫాయిడ్‌

కారణం : సల్మనెల్లాపుల్లోరం

వ్యాధి లక్షణం : విరేచనాలు, వాంతులు

నివారణ : వ్యాధి సోకకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం

టర్కీ కొరైజ

కారణం : బోర్డ్‌టెల్లా అవియం

వ్యాధి లక్షణం : గుండె దడ, ముక్కు నుంచి ఎక్కువగా కారడం

నివారణ : టీకాలు వేయించాలి

కోక్కిడియాసిస్‌

కారణం : కోక్కిడియా

వ్యాధి లక్షణం : రక్త విరేచనాలు, బరువు పడిపోవడం

నివారణ : షెడ్‌లో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా చూడడం, లిట్టర్సరిగా ఉండేలా చూడడం

టర్కీ జననేంద్రియ వ్యాధి

కారణం : మైకోప్లాస్మామెలీగ్రిస్‌

వ్యాధి లక్షణం : లైంగిక శక్తి, పొదిగే సామర్ధ్యం క్షీణించడం

నివారణ : పారిశుద్ధ్యం ఖచ్చితంగా పాటించాలి

టీకాలు వేయించవలసిన తీరు :

పుట్టిన మొదటిరోజు : ఎన్‌డి - బి1 స్ట్రైన్‌

4వ, 5వ వారాలు : ఫౌల్‌ పాక్స్‌

6వ వారం : ఎన్‌డి - (ఆర్‌2 బి)

8-10 వారాలు : కలరా టీకాలు

టర్కీల మార్కెటింగ్‌ :

16 వారాలకు ఎదిగిన టర్కీ పుంజు బరువు 7.26 కిలోలు, టర్కీ పెట్ట బరువు 5.53 కిలోలు వుండాలి. టర్కీల మార్కెటింగ్‌కు ఈ బరువులుఅనువైనవి.

టర్కీ గుడ్డు :

టర్కీలు 30 వ వారం నుంచి గుడ్లుపెట్టడం మొదలుపెడతాయి. మొదటి గుడ్డు పెట్టిన రోజు నుంచి 24 వారాలపాటు అది గుడ్లు పెడుతుంటుంది

తగిన దాణా ఇస్తూ, కత్రిమ కాంతి ప్రసారంలో పెంచితే, టర్కీకోళ్ళు ఏడాదికి 60-100 గుడ్ల వరకు కూడా పెడతాయి

దాదాపు 70 శాతం గుడ్లు మధ్యాహ్న సమయంలోనే పెడతాయి

టర్కీ కోడి గుడ్లు, రంగుగా ఉంటాయి, ఒక్కొక్కటి 85 గ్రా. వరకు తూగుతాయి

గుడ్డు ఒక చివర గమనించ దగినంతగా మొనతేలి, గట్టి పెంకుతో ఉంటుంది

టర్కీ గుడ్డులో మాంసకత్తులు, లిపిడ్‌ (కొవ్వు పదార్ధాలు), పిండిపదార్ధాలు, ఖనిజ లవణాల దామాషా క్రమంగా 13.1 శాతం, 11.8 శాతం, 1.7 శాతం , 0.8 శాతం ఉంటుంది. ఒక గ్రాము పచ్చసొనలో కొలెస్టొరాల్‌15.67 - 23.97 మి. గ్రా. ఉంటుంది.

టర్కీ మాంసం :

టర్కీ మాంసం చాలా పలుచగా ఉంటుంది, అందువల్ల వినియోగదారులు టర్కీ మాంసాన్ని ఇష్టపడతారు. 100 గ్రా. మాంసంలో మాంసకత్తులు, కొవ్వుపదార్ధాలు, శక్తి విలువ 24శాతం, 6.6 శాతం, 162 కేలరీలు. టర్కీ మాంసంలో పొటాషియం, కాల్షియం (సున్నం), మెగ్నీషియం ఇనుము, సెలెనియం, జింక్‌, సోడియం మొదలైన ఖనిజ లవణాలు వుంటాయి. శరీరానికి తప్పనిసరిగా కావలసిన యామినో ఆ మ్లా లు, నియాసిన్‌, బి6, బి12 వంటి విటమిన్లు టర్కీ మాంసంలో పుష్కలంగా ఉంటాయి. అసంతప్త (అన్‌ శాచ్యురేటెడ్‌) ఫాటీ ఆమ్లాలు, శరీరానికి తప్పనిసరిగా కావలసిన ఫాటీ ఆమ్లాలు, ఎక్కువగా ఉండడమేకాక, కొలెస్టొరాల్‌ తక్కువగా ఉండడం మరొక విశేషం. 24 వారాల వయసులో 10-20 కిలోల బరువున్న టర్కీ పుంజును విక్రయించడం వల్ల, దాని పెంపకానికి అయిన 300-450 రూపాయల ఖర్చు పోను, 500-600 రూపాయల ఆదాయం వస్తుందని మార్కెట్‌ అధ్యయనం తెలియజేస్తున్నది. ఇదే విధంగా, 24 వారాల వయసున్న టర్కీపెట్ట అమ్మకం వల్ల 300-450 రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇంతేకాక టర్కీలను కేవలం చెత్తాచెదారం తిని, లేదా మొత్తం దాణాలో కొంత చెత్తాచెదారం అందించి పెంచవచ్చు.