సాధారణంగా బయటి వాయుకాలుష్యం వల్ల మానవాళికి ముప్పు వాటిల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. కాని ఇంటిలోని వాయు కాలుష్యం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయన్నది చాలా మందికి తెలియని విషయం. సాధారణంగా చాలా మంది 90 శాతం సమయాన్ని ఇంటిలో గాని, ఆఫీసుల్లో గాని గడపడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం ఉండడం మానవాళికి ఎంతైనా అవసరం ఉంది. ఈ విధంగా ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణాన్ని పెంపొందించడంలో మొక్కల పాత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అలంకరణ మొక్కలను ఇంటిలో గాని, ఆఫీసుల్లోగాని పెంచడం ద్వారా అవి ఇంటి లోపలి గాలిలోని అనేక రసాయనిక పదార్థాలను తీసివేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించడంలోనూ తోడ్పడతాయని అనేక పరిశోధనల్లో రుజువుకావడం జరిగింది.

ఇంటిలో లేదా ఆఫీసుల్లో వాతావరణంలో కింద తెలిపిన రసాయనిక పదార్థాలను గుర్తించడం జరిగింది. డ్రైక్లోరో ఇథలీన్‌, ఫార్మాల్డిహైడ్‌, బెంజీన్‌, జైలీన్‌, అమ్మోనియం ఈ రసాయనిక పదార్థాలు మనం నివశిస్తున్న ఇంటిలోపల గాలిలో ఉన్నట్లయితే మనుషుల్లో తలనొప్పి, వాంతులు, కళ్ళలో దురద, గుండె కొట్టుకునే రేటు పెరగడం, ముక్కు దురద, దగ్గు మరియు గుండె సమస్యలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మన ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించుటకు కింద తెలిపిన అలంకరణ మొక్కలను పెంచుకోవడం మంచిది.

సాధారణ నామం :

1. పొట్టి డేట్‌ పామ్‌, 2. బాస్‌టన్‌ ఫెర్న్‌, 3. కిమ్‌బర్లే క్వీన్‌ఫెర్న్‌, 4. స్పైడర్‌ ప్లాంట్‌, 5. చైనీస్‌ ఎవర్‌గ్రీన్‌, 6. బాంబు పామ్‌, 7. వీపింగ్‌ ఫిగ్‌, 8. డెవిల్స్‌ ఐవీ, 9. ప్లెమింగో లిల్లీ, 10. లిలీట్రుర్‌, 11. బ్రాడ్‌లీఫ్‌ లెడీపామ్‌, 12. బార్బ్‌టాన్‌ డైసీ, 13. ఇంగ్లీష్‌ ఐవీ, 14. కార్న్‌ స్టాక్‌ డ్రనీసా, 15. వారిగేడెడ్‌ స్నేక్‌ప్లాంట్‌, 16. రెడ్‌ ఎడ్జెడ్‌ డ్రసీసా, 17. పీస్‌లిల్లీ, 18. ఫ్లోరిస్ట్‌ చామంతి.

సాధారణ నామం శాస్త్రీయ నామం చర్య
డార్ఫ్‌ డేట్‌ పామ్‌ ఫోనిక్స్‌ రాబెలెని గాలిలోనిఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ రసాయనాలను తీసివేయును.
బాస్‌టన్‌ ఫెర్నా నైప్రోలెపిస్‌ ఎక్సెల్లా గాలిలోని ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ రసాయనాలను తీసివేయును.
కిమ్‌ బర్లే క్వీన్‌ఫెర్న్‌ నైప్రోలెపిస్‌ ఆబ్లిడెరెట ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ రసాయనాలను తీసివేయును.
స్పైడర్‌ ప్లాంట్‌ క్లోరోఫైటమ్‌ కామోసమ్‌ ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ రసాయనాలను తీసివేయును.
చైనీస్‌ ఎవర్‌గ్రీస్‌ అగ్లోనీమా మోడస్టమ్‌ ఫార్మాల్డిహైడ్‌ను బెంజీన్‌ శాతాన్ని తగ్గించవచ్చు.
బాంబుపామ్‌ చామడోరియా సీఫ్రిజి ఫార్మాల్డిహైడ్‌ను, జైలీన్‌లను తగ్గించును
వీపింగ్‌ ఫిగ్‌ ఫైకస్‌ బెంజామినా ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌లను తగ్గించవచ్చు.
డెవిల్స్‌ ఐవీ ఎపిప్రెమమ్‌ ఆయురియం ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ బెంజీన్‌లను తగ్గించవచ్చు.?
ప్లెమింగో లిలీ ఆంధూరియం ఆంద్రీయానమ్‌ ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ అమ్మోనియంలను తగ్గించవచ్చు.
లిలీట్రుర్‌ లిలీయోప్‌ స్పికెటా ట్రైక్లోరో ఇథైలీన్‌, జైలీన్‌, అమ్మోనియాను తగ్గించును.
బ్రాడ్‌లీఫ్‌ లెడీపామ్‌ రోపిస్‌ ఎక్స్‌ల్సా ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ అమ్మోనియంలను తగ్గించవచ్చు.
బార్బ్‌టాన్‌ డైసీ డైక్లోరో ఇథలీన్‌, ఫార్మాల్డిహైడ్‌, జైలాన్‌లను తగ్గించవచ్చు.
ఇంగ్లీష్‌ ఐవీ హెడెరా హెలిక్స్‌ ఫార్మాల్డిహైడ్‌ను జైలీన్‌ అమ్మోనియంలను తగ్గించవచ్చు.
కార్న్‌ స్టాక్‌ డ్రసీనా డ్రసీనా ఫ్రాగ్రన్స్‌ డ్రైక్లోరో ఇథలీన్‌ బెంజీన్‌ ఫార్మాల్డిహైడ్‌ను తగ్గించును
వారిగేటెడ్‌ స్నేక్‌ప్లాంట్‌ సాన్సవేరియా డ్రైఫేసియేటా డ్రైక్లోరో ఇథలీన్‌ బెంజీన్‌ ఫార్మాల్డిహైడ్‌ను తగ్గించును.
ప్రనీనా పీస్‌లిలీ ఫార్మాల్డిహైడ్‌ను తగ్గించును స్పాతోఫైలమ్‌ డ్రైక్లోరో ఇథలీన్‌ ఫార్మాల్డిహైడ్‌, బెంజీన్‌, అమ్మోనియా జైలీన్‌లను తగ్గించును
ఫ్లోరిస్ట్‌ క్రైసాంథిమమ్‌ క్రైసాంధిమమ్‌, మోరిఫోలియమ్‌ డ్రైక్లోరో ఇథలీన్‌ ఫార్మాల్డిహైడ్‌, బెంజీన్‌, అమ్మోనియా జైలీన్‌లను

డా|| కె. వెంకట సుబ్బయ్య, ఉద్యాన శాస్త్రవేత్త, డా|| ఆర్‌. వి. యస్‌.కె. రెడ్డి, విస్తరణ సంచాలకులు, డా|| కరుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్‌,

జి. శాలిరాజు, శాస్త్రవేత్త కీటక విభాగం, డా|| ఎ. దేవి వరప్రసాద్‌ రెడ్డి, డా|| టి. విజయ నిర్మల మరియు డా|| వి. దీప్తి, కృషీ విజ్ఞాన కేంద్రం,

డా|| వై.యస్‌.ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమగోదావరి, ఫోన్‌ : 9490588603