దేశ వ్యవసాయ ముఖ చిత్రంలో అద్భుత ఆవి'్కరణలకు చోటు లభిస్తున్నందున రోజు రోజుకూ వ్యవసాయ ప్రాధాన్యాన్ని ప్రభుత్వాలు గుర్తించి తమ విధానాల్లో మార్పులు కనబరుస్తున్న నేపద్యంలో వినూత్న పద్ధతుల ద్వారా ఈ రంగాన్ని ముందుకు నడిపించడానికి నోవా అగ్రిటెక్‌ కంపెనీ అడుగులు వేస్తుందని అందుకు అనుగుణంగా దేశ వ్యవసాయ పటంలో తనదైన ముద్రను ప్రదర్శించనున్నదని నోవా అగ్రిటెక్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏటుకూరి కిరణ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు.

ఒక నమ్మకం, ఒక విశ్వాసం, విశ్వసనీయత ఆధారంగా చిన్న కంపెనీగా ప్రారంభమై, నేడు జాతీయస్తాయికి ఎదిగిన నేపధ్యంలో మరింత బాధ్యత, విశ్వసనీయతకు దేశ రైతాంగ సేవలో పునీతమయ్యే కార్యక్రమాలను చేపడుతున్నట్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన డీలర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలిపారు. ఘనంగా జరిగిన ఈ సమావేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అనేక మంది అధీకృత డీలర్లు, కంపెనీ మార్కెటింగ్‌ అధికారులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కంపెనీ ఉత్తరాది రాష్ట్ర బాధ్యుడు దినేష్‌ యాదవ్‌ అధ్యక్షత వహించారు. మారుతున్న వ్యవసాయ పద్ధతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అందించే నాణ్యతతో కూడిన ప్రామాణిక ఉత్పాదనలను రైతులకు అందిస్తూ నోవా అగ్రిటెక్‌ కంపెనీ నూతన సస్య విప్లవంలో దేశ వ్యాప్తంగా భాగం పంచుకుంటున్నట్లు కిరణ్‌ తెలిపారు. రాబోయే నాలుగైదేళ్ళలో విశ్వవ్యాప్తంగా నోవా అగ్రిటెక్‌ సేవలను విస్తరించనున్నట్లు వివరించారు.

హైదరాబాద్‌ నగరంలో ఒక చిన్న ప్రాంగణంలో ప్రారంభమై, కఠోర పరిశ్రమ, అంకిత భావం, యాజమాన్య సిబ్బంది కృషి వల్ల నేడు దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో నోవా అగ్రిటెక్‌ కంపెనీ తన సేవలను కొనసాగిస్తుందని, సమీప భవిష్యత్‌లో 20 రాష్ట్రాల వరకు సేవలను విస్తరించనున్నదని సంస్థ ఉపాధ్యక్షులు సయ్యద్‌ ఫాజిల్‌ అహ్మద్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ నవీకరణ సంస్థగా నోవా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారిన సందర్భంలో ఇండోర్‌ నుండి కార్యకలాపాలను ప్రారంభించారు. అదేవిధంగా నోవా కిసాన్‌ సేవ కార్యక్రమాలను జాతీయ స్థాయిలో రైతులకు అంకితం చేశారు. వినూత్న ఉత్పత్తిగా జాతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఓం-కె అనే జీవ సమృద్ధ ఎరువును విడుదల చేశారు.

దేశం మొత్తం సేంద్రియ వ్యవసాయానికి స్వాగతం పలుకుతున్న ప్రస్తుత పరిస్థితులకు ముందే నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఈ దిశగా ఉత్పాదకాలను తయారుచేసి రైతుల సేవలో ముందడుగులో ఉందని కంపెనీ టెక్నికల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ యెనిగళ్ళ అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఫిబ్రవరి 27న జరిగిన డీలర్ల సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా ప్రసంగించారు.

పటష్టమైన అభివృద్ధి - పరిశోధనా వ్యవస్థ అనుబంధంగా కలిగి, చీడపీడలు, తెగుళ్ళను నివారించి రైతులు తమ పంటను కాపాడే ప్రక్రియలో అనుసరించాల్సిన సస్య యాజమాన్య పద్ధతులను రైతులకు వివరిస్తూ, స్థితిగతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పాదనలను ప్రామాణికంగా ప్రవేశపెడుతూ కంపెనీ జాతీయ స్థాయిలో ముందుకు అడుగిడుతుందని వివరించారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకుండా విద్యావంతులైన, వ్యవసాయ నిపుణుల సేవలతో నోవా కిసాన్‌ సేవా కేంద్రాన్ని నడిపిస్తూ, 3 లక్షల మంది రైతుల గణాంకాలను నిక్షిప్తం చేసిన సంస్థగా బహుళజాతి సంస్థలకు ధీటుగా తమ కంపెనీ ముందుకు వెళుతుందని ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న నోవా కుటుంబ సభ్యులైన డీలర్లు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

నోవా గ్రూపు సంస్థలు ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో తమ సేవలను కొనసాగిస్తున్నాయిని, వచ్చే కొద్ది సంవత్సరాల్లో దేశం అంతటా ఈ కంపెనీ విస్తరించనున్నదని కంపెనీ ఉపాధ్యక్షులు సయ్యద్‌ ఫాజిల్‌ అహ్మద్‌ వెల్లడించారు. కంపెనీ మహారాష్ట్ర వాణిజ్య బాధ్యులు అనూజ్‌ కుమార్‌ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నోవా అగ్రిటెక్‌ కంపెనీ నూతన అభివృద్ధి సేవలను ఆవిష్కరించారు. నోవా కిసాన్‌ సేవాకేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దానితో పాటు జీవ సమృద్ధి ఎరువుగా ప్రాచుర్యం పొందిన ఓం-కెను విడుదల చేశారు. నోవా అగ్రిసైన్స్‌స్‌ నూతన ఉత్పాదకాలను కూడా లాంఛనంగా ప్రారంభించారు.

- అగ్రిక్లినిక్‌ డెస్క్‌