ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20,401 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో సొర, పొట్ల, కాకర, బీర, దోస ముఖ్యమైనవి. ఇవి దాహార్తిని తీరుస్తాయి. శరీరంలోని విషరసాయనాలను బయటకు పంపిస్తాయి. విటమిన్లు ఎ,బి,సిలను పుష్కలరగా కలిగి ఉంటాయి. ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్‌ అందిస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. వ్యాధికారకాలను కూడా నిరోధిస్తాయి.

సేంద్రియ పద్ధతిలో పందిరి (తీగ) కూరగాయల సాగు :

ఉదా : (సొర, పొట్ల, కాకార, బీర, దోస)

వాతావరణం :

వేడి వాతావరణం అనుకూలమైనది.

నేలలు :

నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలమైనవి.

విత్తే సమయం :

సొర, దోస, కాకర :

జూన్‌-జులై చివరి వరకు మరియు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు

పొట్ల :

జూన్‌-జులై మరియు డిసెంబరు-జనవరి చివరి వరకు

బీర :

జూన్‌ నుండి ఆగస్టు మొదటి పక్షాన మరియు డిసెంబరు రెండవ పక్షాన నుండి ఫిబ్రవరి చివరి వరకు.

దొండ :

జూన్‌-జులై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్రప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు.

విత్తనం మరియు విత్తే పద్ధతి :

భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవడానికి 2 మీ. దూరంలో కాలువలు ఏర్పాటు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలమంతటా నీటిపారుదల కొరకు బోదెలను చేయాలి. అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1-2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15I10 సెం.మీ. కొలతలు గల పాలిథీన్‌ సంచుల్లో విత్తుకుని 15-20 రోజులు పెరిగిన తరువాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి.

విత్తన శుద్ధి :

విత్తనాలను బీజామృతం, బీజరక్ష, పంచగవ్య, ఎ.ఇ.మం.తో శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత 100 గ్రా. విత్తనానికి 2 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తాలి.

పోషక యాజమాన్యం :

ముందుగా డభోల్కర్‌ పద్ధతిలో పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి.

నేల తయారీ సమయంలో ఎకరానికి 30 గ్రా. కొమ్ము సిలికాని 40 లీ. నీటిలో కలిపి భూమిపై చల్లాలి. 200 మి.లీ. ఎ.ఇ.యం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై పిచికారి చేయాలి.

నేల తయారీ సమయంలో ఎకరానికి 20 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి.

ఎకరానికి 2 టన్నుల బయోడైనమిక్‌ కంపోస్టు, నాడెప్‌ కంపోస్టు, ఘనజీవామృతం, ఇ.మం. బొకాషి వేయాలి.

ఎకరానికి 2 టన్నుల వర్మికంపోస్టు వేయాలి.

ఎకరానికి 500 కిలోల వేప పిండి వేయాలి.

ఎకరానికి 10 కిలోల అజోస్పైరిల్లం 10 కిలోల ఫాస్పోబాక్టీరియా, 10 కిలోల మైకోరైజా వేయాలి.

నాటిన 45, 60, 75 రోజున ఎకరానికి 2 కిలోల కౌప్యాట్‌ పిట్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

దోసలో అధిక దిగుబడులు పొందడానికి సుమారు 10 కిలోల వేరుశెనగ చెక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఈ ద్రావణాన్ని ఒక్కొక్క కుదురు చుట్టూ 200 మి.లీ. చొప్పునన పోయాలి.

పంట పెరుగుదల క్రమబద్దీకరణ ద్రావణాలు :

విత్తిన నెల రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 3 శాతం పంచగవ్యం పిచికారి చేయాలి.

విత్తిన నెల రోజుల నుండి 15 రోజుల వ్యవధిలో ఎకరానికి 200 లీ. జీవామృతం సాగు నీరు ద్వారా అందించాలి.

పొట్లలో పూతరాలుడు నివారించేందుకు 25 గ్రా. ఇంగువను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

విత్తిన నెల రోజుల నుండి 15 రోజుల వ్యవధిలో 10 శాతం వర్మివాష్‌ పిచికారి చేయాలి.

విత్తిన 65వ రోజున 1 గ్రా. కొమ్ము నిలికా 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కలుపు నివారణ - అంతర కృషి :

కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2-3 తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. లేనిఎడల పండు చివర చిన్న రాయిని పురికొసతో కట్టాలి. లేనియెడలు కాయలు మెలితిరుగుతాయి. సొర, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్ళపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్‌ ధర లభిస్తుంది.

నీటి యాజమాన్యం :

గింజ విత్తేముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత గింజలు మొలకెత్తే వరకు 3-4 రోజులకొకసారి నీరు పెట్టాలి. ఈ తరువాత పాదు చుట్టూ 3-5 సెం.మీ. మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి.

మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు నాలుగైదు రోజులకొకసారి నీరు ఇవ్వాలి.

పందిరి జాతి కూరగాయలు :

సొర :

అర్క బహార్‌, పి.మస్‌, పి.మల్‌ ఈ రెండూ వేసవి పంటకు కూడా అనుకూలం. పూసా సమ్మర్‌, ప్రాలిఫిక్‌రాండ్‌, పూసానవీన్‌

విత్తన మోతాదు :

1.2-1.6 కిలోలు ఎకరానికి

రెండు వరుసల మధ్య దూరం :

(వేసవి) 2.5- (ఖరీఫ్‌) 3.0 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 0.75- (ఖరీఫ్‌) 0.90 మీటర్లు

కాకర :

పూసాదోమాసమి, కోయంబత్తూర్‌, గ్రీన్‌లాంగ్‌, కోవైట్‌లాంగ్‌, అర్క హరిత, పూసా నిశేష, డి.కె-1, ప్రియ, మహికోలాంగ్‌

విత్తన మోతాదు :

1.8-2.4 కిలోలు ఎకరానికి

రెండు వరుసల మధ్య దూరం :

(వేసవి) 1.5-(ఖరీఫ్‌) 2.5 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 0.5- (ఖరీఫ్‌) 0.75 మీటర్లు

బీర :

జగిత్యాల లాంగ్‌, జైపూర్‌ లాంగ్‌, పూసా సస్‌దర్‌ (వేసవికి అనుకూలం) అర్క సుజాత, అర్క సుమీత్‌

విత్తన మోతాదు :

0.6-0.8 కిలోలు ఎకరానికి

రెండు వరుసల మధ్య దూరం :

(వేసవి) 2.0 -(ఖరీఫ్‌) 2.5 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 0.5- (ఖరీఫ్‌) 0.5 మీటర్లు

కూరదోస :

ఆర్‌.ఎస్‌.ఎస్‌, ఎం-1, ఆర్‌.ఎస్‌.ఎస్‌, ఎం-3

విత్తన మోతాదు :

1.0-1.4 కిలోలు ఎకరానికి

రెండు వరుసల మధ్య దూరం :

(వేసవి) 1.0 -(ఖరీఫ్‌) 1.5 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 0.5- (ఖరీఫ్‌) 0.75 మీటర్లు

పచ్చిదోస :

ఆర్‌.ఎస్‌.ఎస్‌, ఎం-1, 2, జపనీలాంగ్‌, గ్రీన్‌ స్ట్రెయిట్‌ ఎయిట్‌, పోయిన్‌ నెట్టి, పూసబీర, కో-1

విత్తన మోతాదు :

1.0-1.4 కిలోలు ఎకరానికి

రెండు వరుసల మధ్య దూరం :

(వేసవి) 1.5 -(ఖరీఫ్‌) 2.5 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 0.5- (ఖరీఫ్‌) 0.75 మీటర్లు

పొట్ల :

స్వేత, కో-1, కో-2, పి.కె.యం-1

విత్తన మోతాదు :

0.6-0.8 కిలోలు ఎకరానికి

రెండు వరుసల మధ్య దూరం :

2.0 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 1.00- (ఖరీఫ్‌) 1.50 మీటర్లు

దొండ :

దేశవాళీరకాలు, చిన్నటి దొండ, నేలదొండ

రెండు వరుసల మధ్య దూరం :

2.0 మీటర్లు

వరుసల్లో రెండు మొక్కల మధ్య దూరం :

(వేసవి) 1.0- (ఖరీఫ్‌) 1.5 మీటర్లు.ల

బి. రాంబాబు, టీచింగ్‌ అసోసియేట్‌, ఏకలవ్య ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటి, వికారాబాద్‌, ఫోన్‌ : 8008866517, 6281068261