ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్‌కు ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షలకు పైగా హెక్టార్ల వైశాల్యంలో ఒక ప్రధాన పంటగా మిరపసాగు జరుగుతుంది. ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు. 9-10 లక్షల హెక్టార్లలో ఎండు మిరప మనదేశంలో సాలీన పండుతుంది. ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగిఉండటమేకాకుండా వంటకాలకు తినుబండారాలకు ఎరుపు రంగును కలిగిస్తుంది. అంతేకాకుండా శ్రేష్టమైన విటమిన్‌, ఔషధ గుణాలు కలిగి ఉండే పదార్థాలకు ఒక మూల హేతువుగా ఉంటుంది. మిరపలో ఉండే ఘాటైన క్యాప్సిసిన్‌ అనే మూల పదార్థం కెరోటినాయిడ్‌ అనే ఒక ధాతువు వల్ల సహజ సిద్ధమైన ఛాయ, రంగు రావడానికి హేతువుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరాకితో పాటు వందకోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో ప్రతి ఇంటా మిరప వినియోగం వల్ల రోజు రోజుకూ దీని ప్రాశస్త్యం పెరుగుతోంది. అంతేకాకుండా భారత్‌తో పాటు, మిరప పండించే దేశాల్లో ఈ పంట, దాని అనుబంధ ఉత్పత్తుల వల్ల కోట్లాది మందికి ఉపాధి కారకంగా మారింది. దేశానికి విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని సంపాదించిపెట్టడంతోపాటు అంతర్జాతీయంగా ఈ పంట అతిపెద్ద వాణిజ్య, ఉపాధి సాధనంగా రూపుదిద్దుకున్నది. 2006-07 లెక్కల ప్రకారం అప్పటికి దేశంలో 10 లక్షల టన్నుల పంట దిగుబడి జరుగగా అందులో 80,775 లక్షల రూపాయల విలువైన 1,48,500 టన్నుల మిరపను ఎగుమతి చేశారు.

సహజ సిద్ధమైన రంగుతో ఉన్న మన మిరప ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకి విపరీతంగా ఉండడంతో మిరపసాగులో భారత్‌ గణనీయమైన ప్రగతిని పొందుతూనే వస్తుంది. దేశీయ వినియోగం పెరగడంతోపాటు, శాంతి భద్రతలను కాపాడడంలో ప్రధాన బాధ్యత వహించే భాష్పవాయువు వినియోగానికి మిరప నుండి తీసిన ఓలే రెజిన్‌ ఉత్పత్తి, వినియోగం ఎక్కువ కావడం, కొన్ని బహుళజాతి కంపెనీలు కారంను బ్రాండింగ్‌ చేసుకొని మార్కెటింగ్‌కు సిద్ధపడడం వంటి కారణాల వల్ల మిరప పంటకు వైభవం పెరగడమే గాని తగ్గడం లేదు.

ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడిని కోరుకునే ఈ మిరప పంట సాగు వల్ల రైతులు నష్టపోవడం కూడా జరుగుతుంది. సరైన నీటి యాజమాన్యం, సస్యయాజమాన్య లోపాలతోపాటు కోత అనంతర చర్యలు ముఖ్యంగా మెరుగైన నిల్వ పద్ధతులను వినియోగించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా చీడపీడలను తెగుళ్ళను నివారించడానికి వినియోగించే క్రిమి సంహారక మందులు, రసాయనాల వల్ల అఫ్టోటాక్సిన్‌ అనే బూజు పంటపై వ్యాపించి నష్టం కలుగ చేస్తుంది.

అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) నిబంధనల మేరకు రసాయన అవశేష రహిత ఆహారపదార్థాలను మాత్రమే దిగుమతులకు ప్రోత్సహిస్తున్న దేశాలు ఈ ఆంక్షలను పరిపూర్ణంగా పాటించడంతో రైతాంగం తగినంత మెలకువతో మిరప పంటను పండించడం, కోత అనంతర చర్యలను సమర్థవంతంగా అమలుచేయడం కొరకు ఈ వ్యాసం ఉద్దేంచబడినది. ప్రపంచంలో మనదేశంతో పాటు మిరప ఎగుమతిలో చైనా, పాకిస్థాన్‌, మోరాకో, మెక్సికో, టర్కి తదితర దేశాలున్నాయి. అనేక దశాబ్దాలుగా మన దేశం నుండే ఎగుమతుల్లో హెచ్చు తగ్గులున్నప్పటికీ అమెరికా, శ్రీలంక, కెనడా, ఇంగ్లాండ్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, జర్మనీ దేశాలకు మన ఎగుమతులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

మిరప కాయలుగానూ, తొడిమలేని మిరప గానూ, పచ్చి మిరప గానూ, మిరప పొడిగానూ, అదే సమయంలో ఉప ఉత్పత్తి అయిన ఓలోరెజిన్‌గానూ ఈ ఎగుమతులు జరుగుతున్నాయి. మిరప పంటలో రైతులకు కరదీపికగాను, అభ్యుదయ రైతుల అనుభవాల వేదికగానూ, సమగ్రమైన విజ్ఞానాన్ని అందించేందుకు మేము చేస్తున్న కృషిలో భాగంగా నారు తయారీ కాలం నుండి ఎగుమతుల వరకు అన్ని అంశాల్లో పాటించవలసిన పద్ధతులను వివరించడం జరుగుతుంది.

నాణ్యమైన మిరప నారు ఉత్పత్తి - సూచనలు

మిరప పంట దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రీడ్‌ మిరప విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. నారుమడిని పెంచే ముందు మనం సాగు చేసే విస్తీర్ణానికి అనుగుణంగా నారుమడిని తయారు చేసుకోవాలి.

, మిరప పంట సాగులో అతి ముఖ్యమైనది విత్తన ఎంపిక. రైతులు మిరపను పచ్చి మిరపకు సాగు చేయాలా లేదా ఎండు మిరపకు సాగు చేయాలా నిర్ణయించుకొన్న తరువాత రకాన్ని ఎంపిక చేసుకోవాలి.

, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే చీడపీడలను నివారించడానికి తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. సంకర రకాలను సాగు చేసేటపుడు కంపెనీ వారే శిలీంధ్ర నాశినితో శుద్ధ్దిచేసి ఉంచుతున్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ మందును ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

, రైతులు నారుమడి స్థలాన్ని ఎన్నుకొనేటపుడు ఎప్పుడూ వేసే స్థలాన్ని గాక మార్చి కొత్త ప్రాంతాన్ని ఎన్నుకోవాలి. దీనివల్ల భూమినుంచి వ్యాపించే శిలీంధ్రాల బెడద తక్కువగా ఉంటుంది. నారుమళ్ళను ఎటువంటి పరిస్థితుల్లోను నీడలోగాని ఇతరత్రా చెట్ల నీడలోగాని పెంచకూడదు.

, నారుమడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కిదున్ని ఎత్తైన నారుమళ్ళను తయారు చేసుకోవాలి. ఒక ఎకరా నేల సాగు చేసేందుకు కావలసిన నారు మొక్కలు పెంచడానికి 10 మీ. పొడవు 1 మీ. వెడల్పుగల నాలుగు మడులు అవసరమవుతాయి. మడికి మడికి మధ్య నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. నారుమడిలో రసాయనిక ఎరువులు వేయకుండా తగినంత వానపాముల ఎరువును వేపపిండిని వేసుకొని కలియ దున్నుకోవాలి.

, విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రొనిల్‌ గుళికలు వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చేపురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు.

, ఎత్తైన నారుమళ్ళలో 8-10 సెం.మీ. దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి. అందులో ఒక్కొక్క విత్తనాన్ని పలుచగా విత్తుకోవాలి. దీనివల్ల అన్ని మొక్కలు దృఢంగా సమానంగా పెరుగుతాయి. నాటిన తరువాత నారుమడిలో విత్తనం కనబడకుండా వానపాముల ఎరువుతో కప్పాలి. హైబ్రీడ్‌ విత్తనం 100 గ్రా. ఒక ఎకరానికి సరిపోతుంది.

, విత్తిన వెంటనే నారుమడిని వరి చెత్తతో కప్పాలి. దీనివల్ల తేమ సంరక్షింపబడి మొలకశాతం పెరుగుతుంది. కలుపును కూడా అరికట్టవచ్చు.

, విత్తిన వెంటనే మరియు వారం రోజుల వరకు రోజుకు రెండుసార్లు నీటిని చిలకరించాలి. వారం తరువాత రోజుకు ఒక తడినిస్తే సరిపోతుంది.

, విత్తనం మొలకెత్తిన వెంటనే నారుమడిపై కప్పిన వరి చెత్తను తీసివేయాలి.

, విత్తిన 15 రోజుల తర్వాత కలుపు మొక్కలను ఏరివేయాలి.

, నారుమళ్ళలో సాధారణంగా ఆశించే మాగుడు తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా నోవా వారి సంజీవని 3 గ్రా. / లీటరు నీటికి కలిపి 13వ రోజు మరియు 20వ రోజు నారుమడిని తడపాలి.

, నారుమళ్ళలో గుళికలు వేసిన 25-30 రోజుల తర్వాత ఒకసారి ఒక పురుగు మందును, ఒక శిలీంధ్రనాశిని మందును కలిపి చల్లుకుంటే మంచిది.

, 5 లేదా 6 వారాల వయసు ఉన్న నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటుంది.

, నారుమడిలో పైపాటుగా రసాయనిక ఎరువులు వేయవద్దు.

మిరపను సాగు చేసే రైతులు పైన సూచించిన చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఆరోగ్యమైన నారు పొంది ప్రధాన పొలంలో ఖర్చుతగ్గి మంచి దిగుబడులు పొందడానికి దోహదపడుతుంది.

ప్లాస్టిక్‌ ట్రేలలో మిరప నారు పెంపకం - సూచనలు :

సాంప్రదాయ పద్ధతిలో మిరప నారుమడి పెంపకాన్ని మనం పైన తెలుసుకున్నాం. ప్లాస్టిక్‌ ట్రేల పద్ధతిలో నారు పెంపకం వల్ల ఏర్పడే ఇబ్బందులను అధిగమించి, మెరుగైన, నాణ్యమైన నారు, అత్యధిక మొలక శాతం కలిగి వేరు వ్యవస్థ బలపడడానికి దోహదం చేస్తుంది. నారు సమయంలోనే అత్యధికంగా చీడ పీడలను తట్టుకునే శక్తి కలిగి ఉండడంతో పంట దిగుబడులు బాగా లభించే అవకాశం ఉంది. నర్సరీ ట్రేలలో నారు దూర ప్రాంతాలకు కూడా సులభంగా తరలించే అవకాశం ఉంటుంది.

, ముందుగా మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన, చీడ పీడలను తట్టుకునే రకమై ఉండాలి.

, ఒక వేళ విత్తనం శుద్ధి చేయబడినది కానట్లయితే దాన్ని 2-3 గ్రా. / 1 కి. విత్తనానికి థైరాం లేదా కాప్టాన్‌తో శుద్ధి చేసుకోవాలి.

, నర్సరీ ట్రేలు శుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తపడాలి. వీలైతే ట్రేలను 1శాతం క్లోరైడ్‌ బ్లీచ్‌ కలిపిన నీటితో శుభ్రపరచుకోవాలి.

, మిరప పంటకు అనువైన ట్రే 98-110 రంధ్రాలు కలవి ఎంపిక చేసుకోవాలి.

, నారు పెంపకానికి ఉపయోగపడే మాధ్యమంగా కోకోపిట్‌, వర్మిక్యులైట్‌ని 4 : 1 నిష్పత్తిలో కలుపుకొని ట్రేల రంధ్రాలలో ఖాళీ లేకుండా నింపుకోవాలి.

, ఆ మాధ్యమం యొక్క ఉదజని సూచిక (పి.హెచ్‌) 5.5-6.5 మధ్య ఉండేలా జాగ్రత్తపడినట్లయితే సూక్ష్మపోషక లోపాలను నివారించుకోవచ్చు.

, మాధ్యమంలో మట్టి లేకుండా చూసుకున్నట్లయితే మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికట్టవచ్చు.

, ప్రతి రంధ్రంలో మధ్య భాగాన 0.5-1సెం.మీ లోతులో ఒక్కొక్క విత్తనాన్ని మాత్రమే నాటుకొని అదే మాధ్యమంతో కప్పివేయాలి.

, ప్రతి రంధ్రం పూర్తిగా తడిచేటట్లుగా నీటి తడిని ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే వేరు వ్యవస్థ కింది వరకు వృద్ధి చెందుతుంది.

, ఆకుకు సంబంధించిన తెగుళ్ళను నివారించడానికి మధ్యాహ్నం పూట నీటి తడులు ఇవ్వకూడదు.

, నీటిలో కరిగే ఎరువులను 50-75 గ్రా. / 100 లీ. మించకుండా వాడినట్లయితే స్థూల, సూక్ష్మలోపాలు లేకుండా నివారించవచ్చు. అయితే అతిగా రసాయనిక ఎరువులు వాడటం కూడా మంచిది కాదు. మధ్య మధ్యలో చీడ పీడలు ఆశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

, నోవా వారి తారక్‌ 2.5 గ్రా. / లీ. నీటికి లేదా ఎన్‌-కౌంటర్‌ ప్లస్‌ 1 మి.లీ / లీ. నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే నారును తెగుళ్ళు, రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడవచ్చు. నారుకు పురుగు ఆశించినట్లయితే నోవా వారి టర్మినేటర్‌ 2.5 మి.లీ / లీ. నీటికి లేదా కాస్మో ప్లస్‌ 1 మి.లీ / లీ. నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

, మిరప నారు పొలంలో నాటుటకు 4-5 రోజుల ముందు నీటి తడులు ఆపి వేయాలి. షేడ్‌నెట్‌లో కనుక నారు పెంచినట్లయితే పొలంలో నాటుటకు రెండు రోజుల ముందు నారు ఉన్న ట్రేలను షేడ్‌నెట్‌ బయట ఉంచుకోవాలి. అలా ఉంచినట్లయితే నారు బయట వాతావరణానికి అలవాటు పడుతుంది.

, 40-45 రోజుల మిరప నారును సాయంత్రం సమయంలో మాత్రమే పొలంలో నాటినట్లయితే ఎండ ఉధృతికి వాడిపోకుండా ఉంటాయి.

, నారు నాటుటకు ముందు పొలానికి నీటి తడులు ఇవ్వాలి.

ఎరువులు :

సేంద్రియ, రసాయన ఎరువులను సమన్వయంతో వాడితే, భూసారం క్షీణించకుండా అధికోత్పత్తి సాధించవచ్చు. అందుకని సేంద్రియపు ఎరువులు, రసాయనిక ఎరువులు సమీకృతంగా వాడాలి.

సేంద్రియ ఎరువులో పశువుల ఎరువు అతి ముఖ్యమైనది. ఈ ఎరువు ప్రతి సంవత్సరం ఎకరానికి 10 టన్నులు వేయాలి. ఇదేగాక కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, పచ్చిరొట్ట మొదలగు సేంద్రియపు ఎరువులను వాడవచ్చు. సేంద్రియపు ఎరువు అందుబాటులో లేనప్పుడు పచ్చిరొట్ట పైరును పెంచి, పూత దశలో మట్టిలో కలియదున్నాలి. జనుము, పిల్లిపెసర, అలసంద, పెసర, పచ్చిరొట్ట పైరుకు అనుకూలంగా ఉంటాయి. వీటితోపాటుగా ఎకరానికి ఒక క్వింటాలు వేప పిండిని వేయడం ద్వారా మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తిని సాధించడమే కాక వేరు పురుగులను కూడా నివారించవచ్చు.

ఎరువుల వాడకంలో ఖచ్చితమైన పద్ధతి అనుసరించాలి. భూసార పరీక్షల వల్ల వివిధ పోషక పదార్ధాలను ఏ మేరకు వాడాలో తెలుసుకోవచ్చు. అందువల్ల ఎరువుల వాడకంలో దుబారాను నివారించవచ్చు. భూసార పరీక్షలు అందుబాటులో లేనప్పుడు మిరపకు సూచించిన మోతాదుల్లోనే ఎరువులు వాడాలి.

ఎరువుల యాజమాన్యం

సేంద్రియ ఎరువులు :

రసాయన అవశేషరహిత మిరప ఉత్పత్తి కొరకు సేంద్రీయ ఎరువులను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించడం అవసరం. రసాయన ఎరువుల మోతాదు అత్యధికంగా ఉండడంతో మన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడంలో ఏర్పడుతున్న అనర్థాల నుండి కాపాడేందుకు వర్మికంపోస్టుతో పాటు పశువుల ఎరువును వీలైతే పలుచోట్ల వినియోగిస్తున్నట్లుగా నేరుగా పశువుల మూత్రాన్ని పంట చేలపై మళ్ళించేందుకు డ్రిప్‌తో అనుసంధానం చేయడం వల్ల పూత, పిందె దశలో చెట్టు సూర్య రశ్మిని పత్ర హరితంగా వినియోగించుకోవడంలో ఎంతో దోహదకారిగా ఉంటుంది. అంతే కాకుండా సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూభౌతిక లక్షణాలు మెరుగౌతాయి. సూక్ష్మధాతులోపాలు తగ్గుతాయి. భూమిలో మైక్రోఫ్లోరా వృద్ధి చెందడంవల్ల ఆ తరువాత తక్కువ స్థాయిలో వినియోగించిన రసాయనిక ఎరువులు సద్వినియోగపడుతాయి. సాధ్యమైనంత మేరకు సేంద్రియ మిరప సాగుకు రైతులు పూనుకున్న నాడు అత్యధిక దిగుబడులతో పాటు నాణ్యమైన నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా మిరప పంటపై లాభాలను ఆర్జించవచ్చు.

నీటి ఆధారపు పైరుకు కావలసిన రసాయనాలు :

నత్రజని 300 + భాస్వరం 60 + పొటాష్‌ 120కి/హె (యూరియా 650 + సింగిల్‌ పాస్ఫేట్‌ 375 + మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 200 కిలోలు / హెక్టారుకు)

ఆఖరి దుక్కిలో నత్రజని 75 + భాస్వరం 60 + పొటాష్‌ 30 కిలోలు / హెక్టారుకు (యూరియా 162.5 + సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ 375 + మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 50 కిలోలు / హెక్టారుకు)

నీటి ఆధారపు పైరుకు సిఫారసు చేసిన మొత్తం భాస్వరం, నాలుగోవంతు నత్రజని (అనగా 162.5 కిలోల యూరియా) మరియు నాలుగో వంతు పొటాష్‌ (అంటే 50.0 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగిలిన నత్రజని, పొటాష్‌ ఎరువులను మూడు దఫాలుగా, నాటిన నెల తర్వాత నుండి మూడు వారాల వ్యవధిలో వేయాలి.

సేంద్రియ వ్యవసాయ బాట పట్టిన రైతులకు మంచి ఆదర్శవంతమైన, సానుకూల ఉత్పత్తుల దిగుబడికి నోవా వారి వండర్‌ గుళికలు ఇటీవల కాలంలో అద్భుత ఫలితాలను ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మంచి ఫలితాల కొరకు ఎకరానికి 1.5-3 కిలోల వరకు వండర్‌ సి.డబ్ల్యు.డి.జి గుళికలు ఎరువులతో కలిపి వేయాలి. భాస్వరం పైరు తొలిదశలో అత్యవసరం. ఈ దశలో తీసుకున్న భాస్వరమే పంట దిగుబడిని నిర్ధారిస్తుంది. నేలలో భాస్వరం ఎరువు నష్టపోదు. అందువల్ల వేయాల్సిన మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో గాని, నాట్లు వేసే సమయంలోగాని వేయాలి.

అంతర కృషి :

కలుపు బెడద విపరీతంగా ఉన్న పంటల్లో ప్రధానమైనది మిరప సాగు, దీన్ని నివారించడానికి రైతు పడరాని పాట్లు పడుతుండడాన్ని మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో కలుపు నివారణకు, పోషకాల సద్వినియోగానికి, డ్రిప్‌తో అనుసంధానించబడిన మల్చింగ్‌ షీటును మడులపై పరచి మిరప సాగును చాలా ప్రాంతాలలో చేపట్టారు. నీటి తడులను పదే పదే ఇచ్చే అవసరం లేకుండా మొక్క వేర్లకు తగినంతగా తేమను అందజేయడంలోనూ, కాండం ఎదుగుదలకు, తగిన పూత, పిందె అభివృద్ధికి తగిన వాతావరణాన్ని సజీవంగా ఉంచేందుకు, అల్ట్రావైలెట్‌ కిరణాల నుండి పంటను కాపాడేందుకు మల్చిని వినియోగిస్తున్నారు. మొక్కలకు సమీపంలోనూ, సాళ్ళ మధ్య కలుపు రాకుండా ఉండేందుకు ఈ ప్లాస్టిక్‌ మల్చిషీటు ఉపయోగపడుతుంది.

అయితే వీటిపై పెద్ద అవగాహన లేని వారు ఇంకా సాంప్రదాయ పద్ధతిలో అంతర కృషి జరుపుతూనే ఉన్నారు. నాటిన నెల రోజుల వరకు సాధారణంగా అంతర కృషి అవసరం లేదు. తడిపెట్టిన తరువాత ఆరుదల మీద ప్లానెట్‌ జూనియర్‌తోగాని, గొర్రుతోగాని, పండ్ల దంతితో గాని, దంతి లేక తేలిక నాగలితో గాని ఎడసేద్యం చేయాలి. నేల గట్టి పడు ప్రాంతాల్లో తేలిక నాగలి ఉపయోగించాలి. ఎడ సేద్యం చేయడం వల్ల కలుపు మొక్కలు నివారించబడి నేల గుల్లబారడమే గాక మొక్కల మొదళ్ళకు మట్టి నెట్టబడుతుంది. సాలులో మొక్కల మధ్య ఉండే కలుపును చేతితో ఎప్పటికప్పుడు తీయించాలి.

సూక్ష్మ పోషక లోపాలు :

ఎరువుల వాడకంలో సమతుల్యత లోపించడం, సేంద్రీయ ఎరువులు వాడక పోవడం, అధిక మోతాదులో కాంప్లెక్సు ఎరువులు వాడటం వల్ల ఇటీవల కాలంలో జింకు మరియు బోరాన్‌ ధాతు లోపాలు ఎక్కువగా గమనించడం జరిగింది.

జింకు లోపం :

జింకుధాతు లోపం గల మొక్కలలో తగినంత ఎదుగుదల ఉండదు. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్కలు గిడసబారి వుంటాయి. ఆకుల మీద తుప్పురంగు మచ్చలు ఉండి క్రమేపి మొక్కలు ఎండిపోతాయి. దీని నివారణకు ఎకరానికి 10 కిలోల జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరు దుక్కిలో మిగిలిన ఎరువులతో కలపకుండా విడిగా వేయాలి. పంట కాలంలో జింకు ధాతు లోపం కనిపించిన వెంటనే (జింక్‌ 12 శాతం ఇడిటిఎ) అనే చిలేటెడ్‌ జింక్‌ (నోవా జింక్‌ జిందా)ను లీటరు నీటికి 1 గ్రా. చొప్పున కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

బోరాన్‌ లోపం :

ఇటీవల కాలంలో మిరపలో బోరాన్‌ లోపం అధికంగా గమనించడమైనది. ఈ లోపం వల్ల లేత ఆకులు చిన్నవిగా మారడం, మొక్కల ఎదుగుదల లేకపోవడం, పూత తగ్గడం, ఆకులు పడవ ఆకారంలో మారడం జరుగుతుంది. కాయల మీద పగుళ్ళు ఏర్పడతాయి. కొమ్మల చివర మొగ్గ పెరుగుదల ఆగిపోయి, పక్క కొమ్మలు పెరిగి మొక్క చివర గుబురుగా కనిపిస్తుంది. ఆకులు, కాయలు రూపాలు మారతాయి. దీని నివారణకు నీటిలో కరిగే బోరాన్‌ (నోవా బోరాన్‌) 1.5-2 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు వారం వ్యవధిలో పిచికారి చేసి ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.

ఇతర సూక్ష్మధాతు లోపాలు :

మిరప పైరులో సర్వసాధారణంగా పైన తెలిపిన సూక్ష్మధాతు లోపాలే కాకుండా, ఇనుము, మాంగనీస్‌ ధాతు లోపాలు కూడా ఉన్నందున పూత, పిందె నష్టపోకుండా పైరును కాపాడుకొని, అధిక దిగుబడులు పొందడానికి ఫార్ములా 6 (నోవా సిఎల్‌ఎక్స్‌) అనే ప్రత్యేక సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని, 200 గ్రా. ఎకరాకు మూడుసార్లు 40,70, 110 రోజుల దశలో పిచికారిచేయాలి. ఇందులో ఇనుము, మాంగనీస్‌, జింక్‌, మెగ్నీషియం మరియు బోరాన్‌ సూక్ష్మధాతువులు ఉన్నందున పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది.

నీటి యాజమాన్యం :

మిరపకు నీరు కట్టడంలో మెలకువలు అవసరం. నీరు ఎక్కువైతే పూత రాలిపోయి దిగుబడి తగ్గుతుంది. తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. బెట్ట పరిస్థితుల్లో కూడా పూత రాలిపోతుంది. కొత్త రెమ్మలు ఏర్పడవు. పైరుకు ఇవ్వాల్సిన తడుల సంఖ్య, తడుల వ్యవధి, నేలను బట్టి, మిరపను పెంచు కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. తేలిక నేలల్లో 10-15 రోజుల వ్యవధిలో తడి పెట్టవలసి ఉంటుంది. నల్లరేగడి నేలల్లో 3 వారాలకొకసారి తడి పెట్టవలసి ఉంటుంది. ఎండాకాలంలో వేసే మిరపకు 5-6 రోజులలో తడి పెట్టవలసి ఉంటుంది. నల్లరేగడి నేలలందు నీరును ఎక్కువగా పారించరాదు. 10 మీ. పొడవున అడ్డకాలువలు వేసుకొని కొద్దిగా నీరు పారించాలి. నాగలి సాలులో కూడా నీరు పారించవచ్చు. భూమిలో 40-60 శాతం తేమ ఉన్నప్పుడు నీరు కట్టడంవల్ల ఎక్కువ దిగుబడులు వస్తాయి.

వర్షాకాలంలో నల్ల రేగడి నేలలందు నీరు పెట్టిన వెంటనే వర్షం పడితే మొక్కలు ఉరక ఎత్తి తలలు వాలుస్తాయి. అధికంగా నీరుపెట్టి, నీరు పోని పరిస్థితుల్లో కూడా తలలు వాలుస్తాయి. అప్పుడు వేళ్ళు నేల నుండి నత్రజనిని గ్రహించలేవు. ఆకులపై 2 శాతం యూరియా (లీటరు నీటిలో 20 గ్రా. యూరియా) ను 2-3 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసినట్లయితే కోలుకుంటాయి.

చలికాలంలో రాత్రులందు కనిష్ఠ ఉష్ణోగ్రత 120 సెం. తగ్గినట్లయితే, తడులు పెట్టరాదు. తడి పెట్టవలసిన అవసరముంటే వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు అంటే పగలు 10 గం|| నుండి సాయంత్రం 4 గం||ల వరకు నీరు పెట్టాలి. ఇది ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు లాంటి చల్లటి ప్రాంతాలకు వర్తిస్తుంది.

ఆధునిక పరిజ్ఞానంలో భాగంగా బిందుసేద్యం అనుసరించడం ద్వారా నీరు, ఎరువులు ఆదా చేయడంతోపాటు నాణ్యమైన అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. దీనితో పాటు కలుపుని నియంత్రించుకొని తద్వారా పురుగులు, తెగుళ్ళను కొంత వరకు అదుపు చేయవచ్చు.

కలుపు :

, మిరప పంటలో వరుసల మధ్య, మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండటం వల్ల పైరు పెరిగి భూమిని పూర్తిగా కప్పేందుకు సాలు తోటలో 90 రోజులు, నాటిన పైరులో 60 రోజులు పైగా పడుతుంది.

, ఈ లోపు వరుసల మధ్య, మొక్కల మధ్యనున్న ఖాళీ స్థలంలో కలుపు మొలకెత్తి, తేమ, ఎరువులు, సూర్యరశ్మి మొదలగు అన్ని వనరులకు పైరు మొక్కలతో పోటీపడి మిరప పైరు పెరుగుదలను, దిగుబడిని 78-98 శాతం వరకు నష్టపరచడమే కాక, పంట నాణ్యతను కూడా గణనీయంగా తగ్గిస్తుందని వివిధ పరిశోధనల్లో తేలింది.

, అంతేకాక కొన్ని రకాల కలుపు మొక్కలు ప్రత్యేకించి రసం పీల్చే పురుగులైనపైముడత, నల్లి పురుగులకు తెగుళ్ళకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి దోహదపడతాయి.

, తద్వారా రైతులకు సస్యరక్షణ ఖర్చు పెరుగుతుంది. సాధారణంగా మిరపలో వచ్చే కలుపు మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు.

మిరపలో వచ్చే కలుపు రకాలు :

గడ్డిజాతి మొక్కలు : గరిక, నక్షత్ర గడ్డి, చప్పర గడ్డి, పుల్లర గడ్డి, కరిగడ్డి, ఊద, ఉర్రంకి మొదలైనవి.

తుంగజాతి మొక్కలు : తుంగ, రాకాసి తుంగ మొదలైనవి.

వెడల్పాటి ఆకు మొక్కలు : గలిజేరు, పేరంటకూర, పాయలాకు, నేల ఉసిరి, ఉత్తరేణి, చెంచలి కూర, కుక్కవావింట, అమృతకాడ, గరిటకమ్మ, గునుకు, తుత్తుర బెండ మొదలైనవి.

కలుపు మొక్కల విభజన అనేది వాటిని నిర్మూలించేందుకు ఏ విధానం ఆచరించాలో నిర్ణయించేందుకు ఉపయోగపడుతుంది.

కలుపు తీయాల్సిన సమయం :

, మిరప ప్రాథమిక దశలో పెరుగుదల నెమ్మదిగా ఉండటం వల్ల కలుపును ఏ మాత్రం తట్టుకోలేదు.

, కలుపు మొక్కల వల్ల మిరప పైరుకు నష్టం లేకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకు సాలు తోటలో అయితే విత్తినాక 90 రోజుల వరకు, నాటిన తోటలో అయితే నాటిన 60 రోజుల వరకు కలుపు లేకుండా చేయాలి. దీన్నే కీలక సమయం అంటారు.

, ఈ కీలక సమయంలో కలుపు నిర్మూలించుట వల్ల వచ్చే దిగుబడి, దాదాపు పూర్తి పంటకాలం అంతా కలుపును నిర్మూలించడం వల్ల వచ్చే దిగుబడి కొంచెం అటు ఇటుగా ఉండి కలుపు నిర్మూలన లాభదాయకంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

, అలాకాక కీలక సమయంలో కలుపు తీయక తరువాత కాలంలో కలుపు తీస్తే వచ్చే దిగుబడి, పూర్తిగా పంటకాలంలో కలుపు తీయని దానితో కొంచెం అటు ఇటుగా ఉండి బాగా నష్టదాయకంగా ఉంటుంది.

, రైతు సోదరులు మిరప పైరు విత్తిన / నాటిన మొదటి 2, 3 నెలలో తప్పనిసరిగా కలుపు నిర్మూలన చేయాలి.

కలుపు యాజమాన్యం :

మిరప నారుమడిలో కలుపు నివారణకు నారుమడి పోసిన వెంటనే లేదా 2,3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు లీటరు నీటికి 3 మి.లీ.ల పెండిమిథాలిన్‌ కలిపి నారుమడి తడిచేటట్లు పిచికారి చేసుకోవాలి.

మిరప తోట వేసే ముందు భూమిని బాగా తయారుచేసుకొన్న తరువాత, 1-2 రోజులు నాటేందుకు ముందు భూమిలో తేమ తగినంత ఉన్నట్లయితే 1 లీటరు ప్లూక్లోరాలిన్‌ లేదా 1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేయాలి. మిరప నాటిన వారం రోజుల తర్వాత భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా 2 లీటర్ల అలాక్లోర్‌ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పడకుండా సాళ్ళ మధ్యలో పిచికారి చేసి కలుపు నివారించుకోవచ్చు.

మిరప సాగుకు బెడదగా మారిన పురుగులు - తెగుళ్ళ నివారణ :

రసం పీల్చే పురుగులు :

మిరప పంటకు 50 శాతం వరకు నష్టం కలిగించేవి రసంపీల్చే పురుగులే. పంట అన్ని దశల్లోనూ సోకి పెనుబెడదగా పరిణమిస్తాయి. రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వినియోగించడం, సింథటిక్‌ ఫైరిత్రాయిడ్స్‌ను విచ్చల విడిగా వాడడం వల్ల నల్లి, పేనుబంక విస్తృతంగా పెరుగుతాయి.

తామర పురుగులు :

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుండి ఆఖరి కోత వరకు మిరపపైరును ఆశించి రసంపీల్చివేస్తాయి. దానితో ఆకుపై పైముడత వస్తుంది. ఈ పురుగులు పంటకాలం అంతటా మిరప పంటను ఎక్కువగా ఆశించి రసాన్ని పీల్చి తీవ్రమయిన ఆందోళన కలిగిస్తాయి. ఆకు ముడత పురుగులు అతి సూక్ష్మం గాను, సన్నగాను ఉంటాయి. స్థూల నేత్రంతో కూడా చూడవచ్చు. ఆకులపైన, పుష్పాలపైన పాకుతూ ఉంటాయి. చిన్నవి, పెద్దవి రెండూ కూడా పైరును పాడు చేస్తాయి. అవి ఆకు టిష్యూను నష్టపరచి, కారుతున్న రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులపై బొబ్బలు ఏర్పడి ఆకు అంచులు పైకి ముడుచుకుపోతాయి. మొక్కలకు తొలిదశలో తెగులు సోకినట్లయితే, అవి గిడసబారటం, పూత రాలటం, పూతలు కాయలుగా మారకపోవడం, దిగుబడికి తీవ్రమయిన నష్టం వాటిల్లడం జరుగుతుంది.

నివారణ :

భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు, ఎకరాకు 8 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు ఫిప్రొనిల్‌ (లీటరు నీటిలో 2 మి.లీ చొప్పున లేదా ఫాసాలోన్‌ (లీటరు నీటిలో 3 మి.లీ. చొప్పున) లేదా మోనోక్రోటోఫాస్‌ (లీటరు నీటిలో 1.5 మి.లీ. చొప్పున) లేదా నోవా వారి ఎన్‌-కౌంటర్‌ ప్లస్‌ 1 మి.లీ./లీటరు నీటికి లేదా పంచామృత్‌ 25 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో పై ముడత, కింది ముడత సమర్ధవంతంగా నివారించవచ్చు.

మిరప నల్లి లేదా తెల్లనల్లి :

వెనుక ముడత లేదా కింది ముడతగా వ్యవహరించే ఈ వ్యాధి కారకం ఈ నల్లి. ముదురు ఆకుల కాడలు పొడవుగా సాగి ముదురు ఆకు పచ్చరంగుతో పెళుసుగా ఉంటాయి. రసాన్ని పీల్చే ఈ పురుగుల ఉధృతి సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే అక్టోబరు - డిసెంబరు వరకు విత్తిన 40 రోజులకు నారుమడి దశలోనే ఈ తెగులు సోకుతుంది. సోకిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి. ఆకు అంచుల కిందకు ముడుచుకుపోయి తిరగవేసిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఆకుల కాడలు పొడవుగా సాగుతాయి. కొమ్మ చివరన లేత ఆకులు గుత్తులుగా ఉంటాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పూత పూయడం ఆగిపోయి దిగుబడి తగ్గిపోతుంది.

నివారణ :

అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో డైకోఫాల్‌ (లీటరు నీటిలో 5 మి.లీ. చొప్పున) లేదా నీళ్ళలో కరిగే గంధకం (లీటరు నీటిలో 3 గ్రాముల చొప్పున) లేదా నోవా వారి స్నైపర్‌ 25 మి.లీ./1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పేనుబంక :

డిసెంబరు - జనవరి మాసాల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మొక్కలు పునరుత్పాదక దశలో, అభివృద్ధి దశలో ఉన్నప్పుడు సోకుతుంది. లేత చిగుళ్ళకు, ఆకులకు, ఆకుల దిగువ ఉపరితలానికి ఈ తెగులు పాకుతుంది. ఈ పురుగులు మొక్కల రసాన్ని పీల్చి మొక్క బలాన్ని తగ్గిస్తుంది. ఈ పురుగు తేనెవంటి పదార్ధాన్ని విసర్జించడం వల్ల చీమలు కూడా చేరతాయి. బూజు తెగులు ఏర్పడుతుంది. ఈ బూజు తెగులు కారణంగా కాయలు నలుపు రంగులోకి మారి, నాణ్యత పడిపోయి, తక్కువ ధర పలుకుతాయి. పేనుబంక వల్ల ప్రత్యక్షంగాను, వెక్టార్స్‌గా వ్యవహరిస్తూ వైరస్‌ తెగుళ్ళను వ్యాపింపజేయడం వల్ల పరోక్షంగాను దిగుబడి కూడా తగ్గుతుంది.

నివారణ :

పేనుబంక నివారణకు ఎసిఫేట్‌ (లీటరు నీటిలో 1 గ్రాము చొప్పున) లేదా మోనోక్రోటోఫాస్‌ (లీటరు నీటిలో 1.5 మి.లీ. చొప్పున) లేదా మిథైల్‌ డెమటాన్‌ (లీటరు నీటిలో 2 మి.లీ. చొప్పున) (లేదా) నోవా వారి ఎన్‌-కౌంటర్‌ ప్లస్‌ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయ తొలుచు పురుగులు :

పొగాకు లద్దెపురుగు :

ఇది ప్రధాన కాయతొలుచు పురుగు, మిరప పంటను గరిష్ఠ స్థాయిలో నష్టపరుస్తుంది. లద్దె పురుగులు పాలిపోయిన ఆకుపచ్చటి రంగును ముదురు రంగు గీతలను కలిగి ఉంటాయి. 400-500 గుడ్ల సముదాయాలను పెట్టి, వాటిని గోధుమ రంగు రోమాలతో కప్పుతాయి. ఆడ పురుగు సుమారుగా 2000 గుడ్లను పెట్టవచ్చు. గుడ్లను 4-5 రోజులు పొదిగిన తరువాత, చిన్న రోమాలతో ముదురు రంగులో పిల్ల లద్దె పురుగులు వస్తాయి. పిల్ల పురుగులు అయిదు దశల్లో పూర్తిగా పెరుగుతాయి. పొదిగిన తరువాత, తొలిదశలో పురుగులు ఆకు ఉపరితలం దిగువన గుంపులుగా ఉండి, హరిత పదార్ధాన్ని గీకి తినుటవల్ల ఆకులు జల్లెడలా మారతాయి. రెండు మూడు దశల్లో తొడిమ వద్ద రంధ్రం చేసి కాయలలోకి దూరి మిరప విత్తనాలను తింటాయి. అట్టి కాయలు రాలిపోతాయి. లేదా ఆర బెట్టినప్పుడు తెలుపు రంగులోకి మారతాయి. పూర్తిగా పెరిగిన లద్దె పురుగులు కోశస్థ దశకుగాను నేలలోకి పోతాయి.

శనగ పచ్చ పురుగు :

తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి, ముందు రెక్కలపై బూడిద వర్ణంలో చారలతో కిడ్నీ ఆకారంలో నల్లని మచ్చ కలిగి ఉంటాయి. ఇవి గుడ్లను ఆకు చివరన లేదా అడుగు భాగాన పెడతాయి. ఈ గుడ్లు మొదట తెల్లగా కొంచెం ఆకుపచ్చగా ఉండి తరువాత గోధుమ రంగుకు మారతాయి. పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి క్రమేపి ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఇరువైపులా నిలువు చారలతో రోమాలు కలిగి ఉంటాయి. పిల్ల పురుగులు మొదటగా ఆకులను తింటూ ఆ తరువాత పూత దశలో పూల భాగాలను తింటాయి. పూర్తిగా ఎదిగిన పురుగులు కాపు దశలో కాయలను ఆశించి తలభాగాన్ని లోపలికి చొప్పించి, మిగిలిన శరీరాన్ని కాయ బయట ఉంచి నష్టపరుస్తాయి. నష్టపరిచిన కాయలు ఎండిన తరువాత తెలుపు రంగులోకి మారతాయి.

పచ్చ రబ్బరు పురుగు :

పెద్ద పురుగులు ముదురు గోధుమ వర్ణంలో మధ్య తరహా పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఆకుపై గుడ్లను గుంపులుగా పెట్టి, తెల్లని వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. పిల్ల పురుగులు ఆకు పచ్చని రంగు కలిగి ఉంటాయి. తొలిదశలో పిల్ల పురుగులు రెండు, మూడు ఆకులను దగ్గరగా చేరి సాలెగూడువలె ఏర్పరుచుకొని దానిలో దాగి ఉండి పత్రహరితాన్ని గీకి తిని, ఆకులను జల్లెడవలె మార్చివేస్తాయి. పెరిగిన పిల్ల పురుగులు గూడునుండి బయటకు వచ్చి, ఆకులను తింటూ, లేత చిగుళ్ళను నష్టపరుస్తాయి. కాయలు ఏర్పడిన తరువాత వాటిని నష్టపరుస్తాయి.

నివారణ :

గుడ్లను పొదగడాన్ని అరికట్టి, పచ్చ రబ్బరు పురుగులను నివారించడానికై అవసరాన్ని బట్టి లీటరు నీటిలో 1 గ్రాము చొప్పున థియోడికార్బ్‌ లేదా లీటరు నీటిలో 2.5 మి.లీ. చొప్పున క్లోరిఫైరిఫాస్‌ లేదా లీటరు నీటిలో 1 గ్రా. చొప్పున ఎసిఫేట్‌ మందును కలిపి పైరుపై చిలకరించాలి. లేదా నోవా వారి టెర్మినేటర్‌ 2.5 మి.లీ. / 1 లీటరు నీటికి లేదా మిత్ర్‌ 1 మి.లీ. / 1 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

మిరప పంటను ఆశించే పురుగులతో పాటు పలు రకాల తెగుళ్ళు కూడా పంట నష్టాన్ని కలిగిస్తాయి. శిలీంధ్రాలు, బాక్టీరియా, వైరస్‌లు సోకడం వల్ల పంటకు నష్టం కలుగుతుంది. నాణ్యమైన దిగుబడుల కొరకు రైతులు ఈ తెగుళ్ళను గుర్తించి, వాటి కారకాలను సరైన చర్యల ద్వారా నియంత్రించాలి.

నారుకుళ్ళు తెగులు :

భూమిలో ఉండే శిలీంధ్రం వల్ల ఈ తెగులు ఏర్పడుతుంది. ఇది నారు మళ్ళను ఆశించడం చాలా సాధారణం. విత్తనం వేసిన 2వ వారంలో మొదలై 5వ వారం వరకు ఈ తెగులు నారుమళ్ళలో కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల మొదళ్ళు మెత్తబడి గుంపులు గుంపులుగా చనిపోతాయి.

నివారణ :

మురుగు నీరు సక్రమంగా పోవడానికి వీలుగా తయారు చేసిన నారుమళ్ళలో విత్తనాలను విత్తాలి. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్‌తో విత్తనాలను శుద్ధి చేయాలి. నారుమడి ప్రాంతం ఒక్కొక్క సెంటుకు 650 గ్రా. చొప్పున మాత్రమే విత్తాలి. దట్టంగా విత్తినట్లయితే తెగులు ఎక్కువగా సోకుతుంది. విత్తిన 13వ రోజున, 20వ రోజున 10 లీటర్ల నీటిలో 30 గ్రా. చొప్పున కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌తో నేలను తడపాలి.

కొమ్మ ఎండు - కాయ కుళ్ళు తెగులు :

నీటి ఆధారంగా, వర్షాధారం మిరప పైర్లు రెండింటిలోను ఈ తెగులు సోకడం సాధారణం. ఇది విత్తనం ద్వారాను గాలి ద్వారాను కూడా సోకుతుంది. తోట పూతకు వచ్చే సమయంలో అక్టోబరు - నవంబరు మాసాల్లో ఈ తెగులు కనిపిస్తుంది. ఇది క్రమేణ చిగుళ్ళకు, కొమ్మలకు కూడా వ్యాపిస్తుంది. తెగులు సోకిన కొమ్మలు, బెరడు మొదట గోధుమ రంగులోకి మారి, ఆ తరువాత మెరిసే తెలుపు దనానికి మారతాయి. అనేక నల్లటి మచ్చలతో పొడుగాటి సన్నని చారలు ఏర్పడతాయి. రెమ్మలనుండి కాయలకు కూడా తెగులు సోకుతుంది. పక్వానికి వచ్చిన కాయలపై వృత్తాకారమైన, అండాకారమైన నల్లటి మచ్చలు వస్తాయి. తెగులు ఉధృతంగా సోకిన కాయలు సాధారణ ఎరుపు రంగుకు బదులుగా గడ్డిపరక రంగులోకి మారి, ముడతలు పడి ఎండిపోతాయి.

నివారణ :

తెగులు ప్రధానంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి విత్తనాన్ని ఫంగస్‌ తెగులు సోకని మిరప పైరు నుండి తీసుకోవాలి. ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్‌తో విత్తనాలను శుద్ధి చేయాలి. పొలంలో ఫంగస్‌ తెగులు సోకిన కొమ్మలను గమనించిన వెంటనే తొలగించి, తెగులు ఇంకా వ్యాప్తి చెందకుండా అరికట్టడానికై వాటిని కాల్చివేయాలి. ఫంగస్‌ తెగులు కనిపించిన వెంటనే, లీటరు నీటిలో 1.5 గ్రా. కాప్టాన్‌ 50 శాతం డబ్ల్యు.పి. లేదా 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందులను మార్చి మార్చి 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో పైరుమీద పిచికారి చేయాలి. లేదా నోవా వారి సంజీవని 3 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బాక్టీరియా ఆకు మచ్చ తెగులు :

ఆగష్టు నుండి నవంబరు వరకు వర్షాకాలంలో పైరుపై ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులు, కొమ్మలు, ఆకుపచ్చని కాయలపై ఈ తెగులు సోకుతుంది. ముందుగా చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆ తరువాత గ్రీజు వంటి పొర లేదా నల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం కలిగి ఉంటుంది. అనేక సందర్భాల్లో తెగులు సోకిన ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. కాడలకు తెగులు సోకినప్పుడు లేత కొమ్మలు, రెమ్మలు ఎండిపోతాయి.

నివారణ :

10 లీటర్ల నీటిలో 2 గ్రా. ప్లాంటామైసిన్‌ లేదా ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్‌ మందును 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌తో కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసి తెగులును సమర్ధవంతంగా నివారించుకోవచ్చు.

సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు :

అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఈ తెగులు సోకుతుంది. ఆకుల మీద చిన్నచిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా మధ్యభాగంలో తెల్లటి బూడిద రంగు మచ్చలు, ముదురు గోధుమ రంగు అంచులు ఏర్పడి కొన్నిసార్లు అవి కలిసిపోతాయి. తెగులు ఉధృతంగా ఉంటే, ఆకులు బాగా పండుబారి రాలిపోతాయి.

నివారణ :

ఒక లీటరు నీటిలో ఒక గ్రాము కార్భండిజమ్‌ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్‌ మందును కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

బూడిద తెగులు :

డిసెంబరు - ఫిబ్రవరిలో ఈ తెగులు సోకుతుంది. తెగులు సోకిన ఆకుల అడుగు భాగాన బూడిదవంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. అంతేకాకుండా, పూతరాలడం కూడా ఆగిపోతుంది.

నివారణ :

, నీటిలో కరిగే గంధకం పొడిని లీటరు నీటిలో 3 గ్రాములు కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

, లీటరు నీటిలో కెరథెన్‌ 48 ఇ.సి. 1 మి.లీ. కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

వైరస్‌ :

కుకుంబర్‌ మొసాయిక్‌ వైరస్‌, పొటాటో వైరస్‌ - యువర్స్‌ ఫెయిత్‌పుల్లి టుబాకో మొసాయిక్‌ వైరస్‌ మరియు లీఫ్‌ కర్ల్‌ వైరస్‌ మున్నగునవి...

ఈ వైరస్‌ తెగుళ్ళు విత్తనం ద్వారా మరియు రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. పంట ఏ దశలోనయినా వైరస్‌ కనిపించవచ్చు. మొసాయిక్‌ తెగులు లేత ఆకుల చారలపై ఏర్పడి, ఆ తరువాత లేత, ముదురు ఆకు పచ్చ రంగులో ఉధృతంగా మచ్చలు ఏర్పడి, ఆకులు ఉపరితలం అంతటా వ్యాపిస్తాయి. ఇతర ముఖ్యమైన లక్షణాల్లో ఆకులు కుచ్చులు కుచ్చులుగా ఏర్పడటం, ముడతలు పడటం, ఆకులు అంచులు చుట్టుకుపోవడం మొదలైనవి. మొక్కల ఎదుగుదల ఆగిపోయి, పూతపూయడం కూడా ఆగిపోతుంది.

యాజమాన్య పద్ధతులు :

, మొక్కలను శుభ్రపరిచే (ఫైటో శానిటేషన్‌) చర్యలను చేపట్టి, చేనులో కలుపు మొక్కలను లేకుండా చేయాలి.

, పొలంలో తెగులు లక్షణాలను గమనించిన వెంటనే, వైరస్‌ సోకిన మొక్కలను పెరికి, తదుపరి వ్యాప్తిని అరికట్టడానికై ధ్వంసం చేయాలి / కాల్చివేయాలి.

, పంటలో వైరస్‌ సోకిన వెక్టార్స్‌ లేకుండా చేయడానికై భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు, నాటిన 15వ రోజున, 45వ రోజున ఎరాకు 12 కిలోల చొప్పున 3 గ్రా. కార్బోఫ్యూరాన్‌ లేదా ఎకరాకు 8 కిలోల చొప్పున 0.3 గ్రా. ఫిసానిల్‌ మందును రెండుసార్లు వేయాలి. ప్రత్యామ్నాయంగా మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రాము లేదా ఫిప్రానిల్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి.

, జి 4, ఎల్‌.సి.ఎ. 334, ఎస్‌.సి.ఎ. 235 వంటి తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి.

, టి.ఎం.వి. కోసం విత్తన శుద్ధి చేసుకోవాలి.

, పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి.

, చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి పురుగు ఆశించకుండా నిరోధించడానికి మరియు రసం పీల్చే పురుగుల నివారణకుగాను బదనిక పురుగుల వృద్ధికి తోడ్పడటానికి మిరపతోట చుట్టూ 2 లేక 3 వరుసలు ఏపుగా ఎదిగే జొన్న / మొక్కజొన్న పైర్లను విధిగా వేయాలి.

, వైరస్‌ సోకిన పంటనుండి సేకరించిన విత్తనాల వాడకాన్ని నివారించాలి.

మిరప తోటలో సమీకృత యాజమాన్య పద్ధతులు :

, క్రిమికీటకాలు సోకడాన్ని తగ్గించే బీన్స్‌ (ఫ్రెంచ్‌ బీన్‌) తోను, తృణధాన్యాలతోను పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. నులి పురుగులను తగ్గించే బంతి మొక్కలను (మేరిగోల్డ్‌), ఉల్లి, వెల్లుల్లిలతో అంతర పంటల విధానాన్ని పాటించాలి.

, పొలాన్ని వేసవిలో లోతుగా దున్నినట్లయితే, భూమిలో దాగి ఉన్న పురుగులు, ఫేథోజోన్స్‌, నులి పురుగులు వెలుపలికి వచ్చి సూర్యరశ్మికి చనిపోతాయి. పక్షులు వీటిని ఏరుకుని తింటాయి.

, ఆఖరుసారి కోత కోసిన తరువాత పంట అవశేషాలను వెంటనే నాశనం చేయాలి.

, తెగుళ్ళను తట్టుకునే రకాలకు చెందిన ఆరోగ్యవంతమైన, ధృవీకృత విత్తనాలను వాడాలి.

, సిఫారసు చేసిన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి.

, పక్కపొలాల్లో మిరప పంటకు ముందు మోనోక్రాపింగ్‌ను పొలానాసిమీస్‌ పంటల సాగును నివారించాలి.

, చుట్టుప్రక్కల ఉన్న పొలాలనుంచి పురుగులను ఆశించకుండా నిరోధించడానికి మరియు సహజ శత్రువులైన బదనిక పురుగుల వృద్ధికి స్థావరాలను ఏర్పరచడానికి గాను 2-3 వరుసలు ఏపుగా ఎదిగే మొక్కజొన్న లేదా సజ్జ పైర్లను విధిగా వేయాలి.

, ప్రధాన క్షేత్రంలో పొగాకు లద్దె పురుగుకు ఆముదం మొక్కలు, శనగ పచ్చ పురుగుకు బంతి మొక్కలు వంటి ఆకర్షణ పంటలను పెంచాలి.

, ఆకు మచ్చ తెగులు, ఆకు కుళ్ళు తెగులు, ఎండు తెగులును నిరోధించడానికై కిలో విత్తనాల్లో 4 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడి వంటి ప్రత్యర్ధి ఫంగితో విత్తనాలను శుద్ధి చేయాలి. లేదా వరుసల్లో ఎకరాకు 50 గ్రా. పశువుల ఎరువుతో 2 గ్రా. ట్రైకోడెర్మా విరిడి మందును కలిపి భూమిలో ఉపయోగించాలి.

, సుమారు 15-21 రోజులపాటు నారుమళ్ళపై 60-100 గేజ్‌ మందం కలిగిన పారదర్శక పాలిథీన్‌ షీట్లను ఉపయోగిస్తూ నేలపై సూర్యరశ్మి ఉండేటట్లు చూడాలి. ఇందువల్ల కలుపు మొక్కల విత్తనాలు, నులి పురుగులు, విశ్రాంతి దశల్లో ఉండే కీటకాలు, చీడలు చనిపోవడానికి వీలవుతుంది.

, మిరపకాయ తొలుచు పురుగుల నివారణ కోసం వేప గింజల కషాయం (ఎన్‌.ఎస్‌.కె.ఇ. 5 శాతం) వేయాలి.

, గుడ్ల సమూహాలను, లార్వా స్థావరాలను, పెరిగే పిల్ల పురుగులను సేకరించి ధ్వంసం చేయాలి.

, నియతకాలిక విరామ సమయాల్లో తెగుళ్ళ సర్వే స్కౌటింగ్‌ పని చేపట్టాలి.

, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులకు సంబంధించిన తల్లి పురుగుల సాంద్రతలను పర్యవేక్షించడానికై ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను, దీపపు ఎరలను అమర్చుకోవాలి.

, వివిధ కీటకాలను, చీడలను ఏరుకొని తినేదాన్ని అధికం చేయడానికై హెక్టారుకు 50 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.

, శనగ పచ్చ పురుగు కోసం వారం రోజుల వ్యవధిలో ఆరుసార్లు పూత పూసే దశనుండి హెక్టారుకు 60,000 చొప్పున ఎగ్‌ పారాసిటాయిడ్స్‌ ట్రైకోడెర్మా చిలోనిస్‌ విడుదల చేయాలి.

, కాయతొలుచు గుడ్లు, చిన్న చిన్న పురుగులు, రసం పీల్చే చీడల సముదాయాన్ని నివారించడానికై క్రయిసోపెర్లా కార్నియాను విడుదల చేయాలి.

, శనగ పచ్చ పురుగు కోసం హెక్టారుకు 500 (ఎల్‌.ఇ.) చొప్పున హెచ్‌.ఎన్‌.సి. వైరస్‌ను, చిన్న పొగాకు లద్దె పురుగుల కోసం ఎస్‌.ఎన్‌.పి.వి.ని పిచికారి చేయాలి.

మల్చితో ఆధునిక మిరపసాగు :

అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన మిరపసాగులో ఇబ్బందులను అధిగమించేందుకు, మిరప, మిరప ఉత్పత్తుల నుండి అత్యధిక లాభాలను ఆర్జించేందుకు, మిరపను లాభసాటి వాణిజ్య సరళికి మళ్ళించడానికి నోవా అగ్రిటెక్‌ ప్రై. లిమిటెడ్‌ వినూత్న రీతిలో సేద్యాన్ని ప్రారంభించింది.

మల్చింగ్‌ షీటును వినియోగించుకోవడం వల్ల అదికూడా సూర్యరశ్మి నుండి ఆల్ట్రావైలెట్‌ కిరణాల ద్వారా జరిగే హానిని నివారించేందుకు వెనుక, ముందు, నలుపు, రజత వర్ణ మల్చింగ్‌ షీటును పరచారు.

నాట్లకు ముందు ఒక శాస్త్రీయ పద్ధతిలో విత్తనశుద్ధి జరపడం, పొలాన్ని బాగా కలియదున్ని పశువుల ఎరువును ధారాళంగా వినియోగించడం వల్ల నారుమళ్ళలో మొలక శాతం 90 శాతంగా నమోదైంది. దీనితో పొలానికి కావలసిన దానికంటే నారు అధికంగా లభించింది. నాణ్యమైన బయో ఉత్పత్తులు, ఎరువులు, పోషకాలను వినియోగించడంతో నారుమడిలో మొక్క శక్తి వంతమైన, తేజో వంతమైనదిగా రూపుదిద్దుకుంది.

మల్చితో సాగు విశిష్టతలు :

, డ్రిప్‌ వల్ల నీటి యాజమాన్యం, ఫెర్టిగేషన్‌ ద్వారా ఎరువుల యాజమాన్యాన్ని నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నీరు, ఎరువులు వృధాకాకుండా తగిన మోతాదులో మొక్క వినియోగించుకుని సత్వర ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుంది.

, మల్చిషీటు పరచడం ద్వారా భూమిలో తేమ సమతుల్యం కావడం, కలుపు బెడద నివారణ కావడం, సూర్యరశ్మి నుండి వచ్చే ఫలితాలను మొక్క సక్రమంగా సంగ్రహించుకోవడం జరుగుతుంది.

, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో వివిధ వాతావరణ పరిస్థితుల్లో వైవిధ్య భరితమైన ప్రక్రియల ద్వారా అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంది.

, ఎప్పటికప్పుడు మొక్క ఆరోగ్య స్థితిని గమనిస్తూ పోషక పదార్థాలను ఒక ప్రణాళిక ప్రకారం మొక్క ఎదుగుదలను గమనిస్తూ ఉండాలి.

, అధిక దిగుబడులు సాధించడంతో పాటు ఎగుమతి అర్హత కలిగిన రసాయన అవశేషాలు లేని దిగుబడుల సాధన ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారు.

సస్య యాజమాన్యంలో, నీటి యాజమాన్యంలో ఆధునిక, సాంకేతిక ప్రక్రియలను వినియోగించడం ద్వారా అత్యధిక దిగుబడులు సాధించే అవకాశాన్ని రైతులు కల్పించుకోవాలి.

నోవా అగ్రిటెక్‌ ప్రై. లిమిటెడ్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మల్చి షీటు పరచిన మిరప సాగు విజయవంతమైన అనంతరం అనేక జిల్లాల్లో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడుల సాధన కోసం రైతులు మల్చిషీటు పరచిన బెడ్లపై సాగును ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా మూడు రోజులపాటు మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ సమీపంలోని హుగ్గెళ్ళి ఆధునిక పరిశోధన - అభివృద్ధి కేంద్రంలో జరిగిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న రైతులు 300 మందిలో సుమారు 150 మంది ప్రస్తుతం మల్చిషీటుపై మిరప పంటను ధారాళంగా పండిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ తరహా సాగు కొనసాగుతున్నది.

వరంగల్‌ జిల్లాలోని భగీరద మ్యాక్స్‌ సొసైటీలోని రైతులు మల్చిపై మిరప పంటను వేసుకొని అనేక ప్రయోజనాలను పొందుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రఘోత్తమ రెడ్డి అనే రైతు వరంగల్‌ జిల్లాలోని గూడూరు సమీపంలో మల్చి పరచిన ఎత్తుమడులపై దేశవాళీ మిరపను పండించి గత సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించారు.

పంట కోత ముందు చేయవలసిన పని :

విత్తనాన్ని తీసుకున్నప్పుడే దాన్ని ఎంచుకోవడంలో బహు జాగ్రత్త తీసుకొని, చీడపీడల, వ్యాధుల బారిన పడని విత్తనాన్ని ఎంచుకోవాలి. పండుకాయ ముందు రాలిపోయే లేక చీడపీడల బారినపడి రాలిపోయే ప్రాంతాల్లో విత్తనాలను నిపుణుడైన వ్యక్తిచేత సిఫార్సు చేయబడి, అతని పర్యవేక్షణలో సరైన (ఫంగిసైడ్‌) ట్రీట్‌ చేయాలి. నారుమడిని కాస్త ఎత్తు కల్గిన ప్రదేశం గుర్తించి, దానికి నీరు పెట్టే వసతి, మురుగు నీరు మార్గాలు ఉండేటట్లు చూడాలి. ఒకవేళ పంట చీడపీడల వల్ల నాశనమయ్యే పరిస్థితి కలిగినప్పుడు రసాయన మందులు బదులుగా జీవ సంబంధిత, వృక్ష సంబంధిత పురుగుల మందులను (బయోపెస్టిసైడ్స్‌) వాడాలి.

బూజు సంబంధిత వ్యాధి వచ్చినప్పుడు వ్యవసాయ నిపుణులతో సంప్రదించి సరైన ఫంగిసైడ్‌ను ఉపయోగించాలి. మిరపను దిగుబడి చేసుకునే దేశాల్లో క్రిమిసంహారక మందుల వాడకాన్ని నిషేధించినప్పుడు దాన్ని మనం ఎప్పుడూ ఉపయోగించకూడదు. కొనుగోలు చేసే దేశాలు దిగుమతి చేసుకున్న సుగంధ ద్రవ్యాలతో క్రిమిసంహారక మందుల అవశేషాలను విధిగా పరీక్షచేసి చూస్తారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

పంటను సరైన సమయంలోనే కోయాలి. చెట్టు మీద ఉన్నప్పుడే, కాయలు బాగా ముదిరినప్పుడు చెట్టుపై పాక్షికంగా ఎండిపోయినప్పుడు మాత్రమే ఘాటుతనం, రంగు బాగా ఉంటాయి.

పంట కోత - గుర్తుంచు కోవలసిన విషయాలు :

పంట కోత కోసిన కాయలను కుప్పగా లేక ఒక రాసిగా నీడలో ఒకరోజు ఉంచాలి. ఎందుకంటే అవి ఒక క్రమ పద్ధతిలో (యూనిఫాంగా) ఎరుపు రంగును సంతరించుకుంటాయి. సరైన అనువైన ఉష్ణోగ్రత 220-250 సెం. ఉష్ణోగ్రత ఉండాలి. దీని తరువాత ఈ కాయలను చదునైన పరిశుభ్రమైన పొడిగా ఉన్న చాపలపైన లేక సిమెంటు / కాంక్రీటుతో చేసిన చదునైన అరుగులపై గానీ / డాబాపైన గానీ ఎండకు ఎండబట్టాలి. ఎండబెట్టిన స్థలం / చాపలుగానీ ఏ విధమైన బురద / పేడ మరకలతో ఉండకూడదు. కాయలు పలుచని వరుసల్లో ఆరబెట్టాలి. ఒక క్రమపద్ధతిలో ఎండడానికి వీలుగా, వాటిని తరచుగా తిరగ కలపాలి. అవి బూజుపట్టకుండా, రంగులో మార్పు రాకుండా నివారించడానికి కాయలను పలుచగా ఆరబెట్టాలి. వీటిని కుప్పగా పేర్చి, దానిపై గోనె సంచులు గాని, టర్పాలిన్‌ గుడ్డను గాని రాత్రి పూట కప్పి ఉంచాలి. ఈ కాయలను సరిగా ఆరబెట్టక పోయినట్లయితే అవి వాటి రంగును కోల్పోవడం, మెరుపు తగ్గిపోవడం జరుగుతుంది. ఆరబెట్టిన మిరపకాయలను తేమ పరిధి 12 శాతం కంటే తక్కువగా ఉండాలి. శుభ్రమైన ఒకే రంగు కొరకు సాంప్రదాయ సిద్ధంగా సూర్యరశ్మిలో ఎండబెట్టే పద్ధతికంటే మెరుగైన, ఆధునిక ఆరబెట్టే పద్ధతులు పాటించడం మంచిది.

నిలువ చేసే ముందు తీసుకోవాల్సిన చర్యలు :

బాగా ఆరిన, పొడిగా ఉన్న మిరపని ఇతర అన్య పదార్థాలను తొలగించిన పిదప శుభ్రమైన, పొడిగా ఉన్న గోనె సంచుల్లో నింపి, తేమ నుండి రక్షణ కల్పిస్తూ నిలువచేయాలి. నేల నుండి తేమ వాటిలోనికి చొచ్చుకొని రాకుండా ఉండడానికి అడుగున కర్ర చెక్కలు లాంటివి పరచాలి. గోనె సంచుల బస్తాలను వరుసగా పేర్చి ఉంచాలి. పేర్చిన బస్తాలను గోడ నుండి 50-60 సెం.మీ. దూరంలో ఉంటేటట్లు జాగ్రత్త వహించాలి.

వ్యవసాయదారునికి గిట్టుబాటు ధర వస్తే మిరపని ఆరబెట్టి, ఎండిన వెంటనే అమ్మివేయడం మంచిది. ఎక్కువకాలం నిలువ చేసినట్లయితే పాడైపోయే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఒకవేళ శీతల గిడ్డంగిలో నిలువచేసే వెసులుబాటు వాడుకలో ఉంటే ఈ ఉత్పత్తిని 8-10 నెలల వరకు నిల్వ చేయవచ్చు. క్రిమికీటకాదులు, పాకే జంతువులు (ఎలుక లాంటివి) మరే ఇతర జంతువులను ఉత్పత్తిని నిలువచేసిన పరిసరాల్లోనికి రానివ్వకుండా సమర్థవంతంగా నిరోధించాలి. నిలువచేసి ఉంచిన ఈ ఉత్పత్తిని అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టడం శ్రేయస్కరం. పంట దిగుబడికి వచ్చే సమయంలోనూ, అటు తరువాత తీసుకునే చర్యలు ప్రోసెసింగ్‌, ప్యాకింగ్‌ నిలువచేసే పద్ధతులు అలాగే రవాణా చేయడంలోనూ మంచి పద్ధతులను అవలంబిస్తూ, మేలైన జాగ్రత్త వహిస్తూ ఉంటే వినియోగదారునికి పూర్తిగా సంతృప్తిని కలుగచేసినట్లవుతుంది. కొనుగోలు చేసే దేశాల యొక్క నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా తయారు చేయడం, ఉత్పత్తిని సాధించడం, వినియోగదారునికి సంతృప్తిని కలిగించడం, సరసమైన ధరలను కొనసాగిస్తూ ఉండడం అనేవి ప్రధాన అంశాలు. ఈ అంశాల వల్ల అంతర్జాతీయ విఫణిలో మనం మనుగడ సాగించవచ్చు. అధికోత్పత్తి, నాణ్యతను కాపాడుకోవడం అన్నవి వ్యవసాయదారునికి రాబడిని పెంచడమే కాకుండా దేశానికి విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడతాయి.

ఎంతో వ్యయ ప్రయాసలతో పండించిన మిరప పంటను కోతకు ముందు, కోత అనంతరం జాగ్రత్తగా భద్రపరచి నాణ్యతను కాపాడుకునేందుకు ఈ కింది నాలుగు పద్ధతుల ద్వారా జాగ్రత్తగా ఎగుమతి చేసుకోవాలి.

1. మెకానికల్‌ డ్రైయర్ల ద్వారా పంటను ఎండబెట్టడం.

2. గ్రేడింగ్‌

3. ప్యాకింగ్‌

4. కోల్డుస్టోరేజిల్లో భద్రపరచుట

ఈ కార్యక్రమం అనంతరం పంటను స్వయంగా మార్కెటింగ్‌ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకోవాలి. ఒక ఒంటరి రైతు ఇంతటి బృహత్‌ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం మన వ్యవస్థలో లేదు. అందుకొరకు రైతాంగం పంట ఉత్పత్తి సంఘాలను కాని, పరస్పర సహకార పరపతి సంఘాలను గాని ఏర్పాటు చేసుకుంటే విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. దీనినే సమగ్ర ఉత్పత్తుల అమ్మకంగా భావించి తద్వారా మిరప నుండి ఎలా లాభాలను రాబట్టాలనే అంశం ఆధారంగా రైతే ఒక వాణిజ్య వేత్తగా రూపొంది మార్కెట్‌ సాధికారతను సంపాదించేందుకు ఈ కింది విధంగా కర్తవ్యాలను పూర్తి చేసుకుంటే మంచి లాభాలను సంపాదించవచ్చు.

1. మిరప ఎగుమతి

2. స్వంత బ్రాండును నిర్ణయించుకుని కారం అమ్మకం

3. క్యాప్సిసిన్‌-క్యాప్సాన్‌థిన్‌ అనే పదార్ధాన్ని (ఓలియోరెజిన్‌)ను తయారు చేయుట.

అన్ని కర్తవ్యాల అమలులో గుంటూరు, వరంగల్‌లో గల భారత సుగంధ ద్రవ్యాల సంస్థను భాగస్వామిగా చేసుకొని పురోగమించవచ్చు. మిరప రైతులు సమగ్ర మిరప పంటసాగు, వినియోగంలో వాణిజ్య దారుడిగా రూపొందేందుకు ఆధునిక ప్రక్రియల సాధనకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సుగంధ ద్రవ్యాల సంస్థ తమ కార్యాలయాల ద్వారా ఎల్లప్పుడూ సహకరించే వీలుంటుంది.

సంఘటిత శక్తితోనే సాధికారత :

, మిరప ఎగుమతులలో చాలా దేశాలు వారి స్వంత విధానాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాయి. ఈ నిబంధనల వైరుధ్యాల వల్ల వర్తకులు, దళారుల ప్రమేయం ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులు సంఘటితమై తామే ఒక చట్టబద్ధమైన పరస్పర సహాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల తమకు కావలసిన గిట్టుబాటు ధరలపై నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది.

, తాము ఆశించిన ధర పలకనప్పుడు గిడ్డంగుల్లో తామే నిల్వ చేసుకుని, అవసరమైతే వివిధ ఉప ఉత్పత్తులను బ్రాండింగ్‌ చేసుకొని స్వదేశీ మార్కెట్లో విడుదల చేసి మంచి ఫలితాలను సాధించవచ్చు. ఎగుమతి కూడా చేసుకోవచ్చు.

, ఆధునిక ప్యాకింగ్‌ విధానాలను అనుసరిస్తూ మిరప కాయలను 5-10 కేజీల ప్యాకెట్లలో బ్రాండింగ్‌ చేసి ఎగుమతిని సులభతరం చేసే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం తగిన సబ్సిడీని అందించాలి.

, ఎగుమతి ప్రక్రియలో కూడా చైనా, ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తున్న పద్ధతులను మనమూ పాటించాలి. ఒకేసారి కంటైనర్లలో 20 టన్నుల మిరపను ఎగుమతి చేయగలుగుతుంది. ఐతే కంటైనర్లను చిన్న ప్యాకింగ్‌లతో నింపడం ద్వారా రవాణా ఖర్చులను తగ్గించుకోగలుగుతుంది. అయితే మన రైతులు కంటైనర్లను 25-30 కేజీల ప్యాకింగ్‌తో నింపడంతో 15 టన్నులు మాత్రమే ఎగుమతి కావడం వల్ల రవాణా చార్జీలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల మనం ఇతర దేశాలతో పోటీని తట్టుకోలేక పోతున్నాము.

, ఎగుమతులకు అనుగుణంగా మిరప పంటను ఉత్పత్తి చేసే అవసరాన్ని గుర్తించి దానికి అనుగుణంగా పంట రకాలను వేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి.

, మిరపలో లభించే ఓలేరెజిన్‌ మందుల పరిశ్రమలకు మంచి ఉపయోగకారి. ప్రపంచ మార్కెట్‌లో ఈ తరహా ఉత్పత్తికి అత్యంత ఆదరణ ఉంది. నొప్పిని తగ్గించే మందులు, బామ్‌ల తయారీలో దీన్ని వినియోగిస్తారు. బాగా సహజ రంగున్న మిరప రకాలను అద్దకం పరిశ్రమలోనూ, మందుల తయారీలోనూ వినియోగిస్తారు.

, అంతే కాకుండా శాంతి భద్రతలు కాపాడేందుకు, బాష్పవాయువు గోళాల తయారీకి బాగా కారం కలిగిన భారతీయ మిరపకు విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది. మిరప నుండి సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే అన్ని పద్ధతులను ఆకళింపుచేసుకొని ఈ అతిపెద్ద వినియోగ వస్తువును దేశంలోనూ, విదేశాల్లోనూ మార్కెట్‌ చేసుకునేందుకు రైతులు ఒక దార్శనికతతో ముందుకు వెళ్ళాలి.

మిరప బోర్డును నెలకొల్పాలి :

భారత దేశంలో సుగంధ ద్రవ్యాలలో అత్యంత ప్రముఖమైనది, వినియోగం కలది, వేలాది మందికి ఉపాధికలిగించగలిగింది మిర్చి పంట మాత్రమే. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకరోజు కలిసి వస్తుందని రైతులు ఈ పంటను క్రమం తప్పకుండా సాగు చేస్తున్నారు. అవసరానికంటే ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు సహజంగా ధరలు తగ్గుముఖం పడతాయి. ఇది సహజమైన వాణిజ్య ప్రక్రియలో పరిణామం మాత్రమే. ఒక ఏడాది ధర బాగా పలికినప్పుడు మరో సీజన్‌లో ఆ పంటపై ఆదాయం వస్తుందనే ఆశతో విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతారు. ఈ పంటకు ఎగుమతి విలువ ఉన్నప్పటికీ అది అంతర్జాతీయ, జాతీయ వాణిజ్య సరళిపై ధరలు నిర్ణయం కావడంతో ఆ వాణిజ్యంలో రైతు పాత్ర సున్నాయే. ఈ నేపథó్యంలో గుంటూరు కేంద్రంగా మిరప బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్‌ ఉంది. ఢిల్లీ స్థాయిలో కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు, వాణిజ్య మంత్రిత్వశాఖపై కేరళ లాబీ పెత్తనం అధికం కావడం వల్ల మన రైతుల ఆశలు నెరవేరడం లేదు. మిరప సాగు యాజమాన్యం, కోత అనంతర యాజమాన్యాలను రైతుల వద్దకు ఆధునిక స్థాయిలో చేరవేసి, రసాయన అవశేష రహిత, ఎగుమతి ప్రాధాన్యం గల మిరప సాగుకు అవకాశం కలిగించేందుకు మిరప బోర్డును గుంటూరు లోను, పరిశోధనా కేంద్రాలను రాష్ట్రంలోని వివిధ చోట్ల స్థాపించాలి.

ప్రభుత్వ జోక్యంతో పోటీతత్వం పెరగాలి :

ఏ పంటకైనా మద్దతు ధర లేదా గిట్టుబాటు ధర లభించాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. గతంలో మిర్చి రైతుల కష్టాలను చూసి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రాతిపదికలపై పంటను కొనుగోలు చేసింది. దీనివల్ల పోటీతత్వం ఏర్పడడంతో రైతులకు అప్పట్లో కొంతైనా గిట్టుబాటు ధర లభించింది. కీలక సమయంలో ప్రభుత్వం సృజనాత్మకంగా వ్యవహరించడం వల్ల పరిస్థితులు చక్కబడతాయి. పొగాకు బోర్డు రైతులను ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయకుండా నియంత్రించినట్లే వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు ఆ సంవత్సరపు ఎగుమతి, స్వదేశీ కొనుగోలు అవకాశాలను అంచనావేసి రైతులను ప్రణాళికాబద్ధంగా పంట వేసుకునేందుకు ప్రోత్సహించాలి. అధిక విస్తీర్ణంలో సాగు వల్ల ఉత్పత్తి పెరిగిపోయి సహజంగా రేటు తగ్గిపోతుంది. గతంలో మిరప చరిత్రలోనే అత్యధికంగా క్విం. రూ 9 వేల ధర లభించింది. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుందనుకొని భ్రమపడి విస్తీర్ణాన్ని పెంచుకోరాదు. కోల్డుస్టోరేజీలు మిర్చి పంటను నిల్వ చేసుకునేందుకు ధరలు పెంచడం కూడా సహజమేనని, 10-12 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ధరలే నేటికీ అమలులో ఉండడం, కూలీల లభ్యత కరువవడం, అలానే వాణిజ్య విద్యుత్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం స్టోరేజ్‌ పరిశ్రమను కుంగదీస్తోంది.

నోవా ఉత్పాదనలు - రైతుల అనుభవాలు

నోవా ఉత్పాదనలు - రైతుల అనుభవాలు

ఒక వ్యవసాయ నిపుణుడు, సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, పంట సాగులో, ఉత్పాదకాల పెంపుదలలోను, ప్రజా జీవితంలోను ముందుకు వెళ్తున్న వ్యక్తి స్థాపించిన ఓనాటి చిరుదీపం నేడు 'ఇంతింతై... వటుడింతై'నట్లు సాగు రంగంలో సమస్యల పరిష్కారానికి చుక్కానిగా ఎదుగుతూ నేడు భారత దేశ వ్యాప్తంగా ఒక ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందుతున్నది నోవా అగ్రిటెక్‌ ప్రై. లిమిటెడ్‌. వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్యను పొంది, ప్రభుత్వ ఉద్యాన శాఖ అధికారిగా రైతు సమస్యలను, భూమికి సంబంధించిన సమాచారాన్ని నిశితంగా అధ్యయనం చేసి ప్రభుత్వాలు పరిష్కారం చేయలేని సమస్యలను, వ్యవసాయ రంగం మెరుగుదలకు కావలసిన ప్రావీణ్యంతో ఈ కంపెనీని ఏలూరి సాంబశివరావు స్థాపించారు. అనేక రకాలైన వినూత్న ఉత్పత్తులను రైతులకు అందించడంతోపాటు, వ్యవసాయ విస్తరణలో కూడా అనుభవం ఉన్న నమ్మకమైన నిపుణుల బృందంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ... రైతు క్షేమమే తమ ధ్యేయంగా భావించి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, విశ్వసనీయతతో ముందుకు వెళ్తుంది. పంట యాజమాన్యం, సస్యరక్షణ చర్యల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని సాగు ప్రపంచం మెచ్చే అత్యుత్తమ బ్రాండ్‌లకు ప్రతినిధిగా నోవా ముందుకు వెళ్తున్న సందర్భంలో రైతులు ఏమంటున్నారో వారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పచ్చి మిరపకు ''మిత్ర్‌'' ప్రసాదం :

మిరపలో స్వల్పకాలంలో ప్రతిరోజూ ఆదాయాన్నిచ్చే పంటగా పచ్చిమిర్చిని భావించవచ్చు. 9 నెలలపాటు జాగ్రతగా పంటను సాది, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చివరి క్షణంలో ప్రకృతి వైపరీత్యమో లేక పురుగులు, తెగుళ్ళ బెడదతోనో పంట నాశనమైపోయి, ఫలితం చేతికి రాదనే అనుమానంతో చాలా మంది రైతులు పచ్చి మిరపను (గ్రీన్‌ చిల్లీ) అమ్మి లాభాలు పొందుతున్నారు. ఇందుకొరకై మొక్కను శరవేగంతో పెంచగల నోవా బయో ఉత్పాదకాలను వినియోగిస్తూ ముందుకు వెళుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ సమీపంలోని రెడ్డిగూడెం గ్రామంలో పచ్చిమిరప సాగులో అందవేసిన రైతులుగా సుబ్బారావు, అతని సోదరుడు రోజు వారీ ఆదాయంతో ఎంతో ఆనందం పొందుతున్నారు. ఎక్కువ ఖర్చుతో సాగు చేసే మిరపలో స్వల్ప కాలంలోనే పంట చేతికి రావడం, పచ్చిమిరపకు ప్రతిరోజూ డిమాండ్‌ ఉండడం, కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్‌ నగరాలకు టన్నుల కొద్దీ సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో వారు ఈ రకమైన సాగుకు అలవాటు పడ్డారు. నోవా వారి ప్రతిష్టాత్మకమైన బ్రాండ్‌ 'మిత్ర్‌' వాడకం ద్వారా తాము సురక్షితంగా, అధికంగా పంటను దిగుబడి సాధించుకోగలుగుతున్నామని వెల్లడించారు. మిరపలో సాధారణంగా వచ్చే నల్లి, తామర పురుగులు, కింద ముడత, పై ముడత నివారణలో మిత్ర్‌ అదుల్భతమైన ఫలితాలను అందిస్తుందని వారు తెలిపారు.

- సుబ్బారావు, ఫోన్‌ : 9160662195

స్నైపర్‌తో చక్కని ఆదాయం :

వరంగల్‌ జిల్లా, లింగాల ఘనపూర్‌ మండలం, వడిచెర్ల గ్రామానికి చెందిన మల్లేష్‌ తన మిరప తోటలో విరివిగా స్నైపర్‌, పినాకిల్‌ మందులను వాడి సత్ఫలితాలు సాధించారు. అధికమైన, నాణ్యమైన దిగుబడుల కొరకు అందరూ నోవా వారి ఈ ప్రత్యేకమైన, ప్రతిష్టాకరమైన బ్రాండ్లను వినియోగించుకుని ఫలితాలు సాధించాలని ఆయన కోరుతున్నారు.

-

మల్లేష్‌, ఫోన్‌ : 8978698469

ధరంపురంలో రైతు సంచలనం :

ఇదే అనుభవం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా, ధరంపురం గ్రామంలో ప్రభాకర్‌ అనే అభ్యుదయ రైతు పొందుతున్నారు. గత సీజన్‌లో ఎకరాకు 169 క్వింటాళ్ళ పచ్చి మిరపను పొంది రికార్డు సృష్టించిన ప్రభాకర్‌ ఈ సంవత్సరం కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సెప్టెంబరు 23వ తేదీన ధరంపురం గ్రామంలో జరిగిన నోవా క్షేత్ర దినోత్సవంలో పాల్గొన్న రైతులు ప్రభాకర్‌ మిరప క్షేత్రాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన వందలాది మంది రైతులు ఈ క్షేత్రాన్ని చూసి అనేక విషయాలను, సాగు యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర ప్రదర్శన అనంతరం రైతులు ఇతర ప్రాంతాల నుండి తండోప తండాలుగా ప్రభాకర్‌ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. నిష్ణాతులైన నోవా కంపెనీ విస్తరణ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో యాజమాన్య కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ సస్యయాజమాన్యంలో తోడ్పడడంతో ప్రభాకర్‌ అత్యధిక ఉత్పత్తులతో రోజువారి ఆదాయాన్ని పొందుతున్నాడు. గత సంవత్సరం అనుభవంతో ఈ సంవత్సరం కూడా పచ్చి మిరప సాగు చేస్తున్న ప్రభాకర్‌ ఒక ఎకరంలో పంటను నాటారు. నోవా వారి స్నైపర్‌, మిత్ర్‌, కాస్మోప్లస్‌, టెర్మినేటర్‌, పంచామృత్‌, సంజీవని, తారక్‌ మరియు అన్ని సూక్ష్మపోషకాలను పంట సాగు కొరకు వినియోగిస్తున్నారు. డ్రిప్‌ సహాయంతో కూరగాయలు పండించే ఈ రైతు అరెకరంలో టమాటాను, మరో అరెకరంలో వంగ పంటను సాగు చేస్తున్నారు. దానితో పాటు బ్రహ్మరకం పత్తి సాగు కొనసాగుతుంది. వైవిధ్య పంటలతో మంచి దిగుబడులను పొంది ఆదాయాన్ని సాధిస్తున్న ప్రభార్‌ క్షేత్రాన్ని కౌట్ల-బి, మ్యాక్స్‌ సొసైటీ అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ జిల్లాలో సహకార వ్యవసాయ పితామహుడు రామిరెడ్డి, ఆయన సహచర సొసైటీ డైరెక్టర్లు క్షేత్ర దినోత్సవం రోజు సందర్శించి, ఉత్తమ సాగు చేపడుతున్న రైతును, నోవా అగ్రిటెక్‌ కంపెనీ యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశంసించారు. 6 అడుగుల ఎత్తుతో వంగ తోట కనువిందు చేస్తుండగా, అదే స్థాయిలో స్టేకింగ్‌ టమాటా, నిలువెత్తు పెరుగుదలతో పత్తి, పచ్చి మిరపతో పాటు నిండైన వ్యవసాయానికి చిహ్నాలుగా భాసిల్లుతున్నాయి.

- ప్రభాకర్‌, ఫోన్‌ : 9490098356

రికార్డుస్థాయి ఉత్పత్తులు :

రంగారెడ్డి జిల్లా, నవాబ్‌ పేట మండలం, కేశం పేటకు చెందిన జి. మణిపాల్‌ రెడ్డి గత సంవత్సరం ఒక ఎకరంలో మిరప పంటను సాగు చేసి 50 క్వింటాళ్ళ దిగుబడులను సాధించారు. నోవా కంపెనీ ఉత్పత్తులైన మిత్ర్‌, స్నైపర్‌, పినాకిల్‌ పంచామృత్‌లను దశల వారీగా పంటపై వినియోగించారు.

- జి. మణిపాల్‌ రెడ్డి, ఫోన్‌ : 986632237

నోవానే కొంగు బంగారం :

గుంటూరు జిల్లా, వట్టి చెరకూరు మండలం, చింతపల్లి పాడు గ్రామానికి చెందిన శ్రీహరి ప్రారంభం నుండి నోవా ఉత్పత్తులనే నమ్మకంగా వినియోగిస్తూ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, విశ్వసనీయత అన్న కంపెనీ హామీకి చిహ్నంగా నిలుస్తున్నారు. నోవా వారి ప్రతిష్టాత్మక బ్రాండ్లతో పాటు ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుతున్నా నాణ్యతా ప్రమాణాల్లో నోవాను మించినది లేదనేది శ్రీహరి నిశ్చిత అభిప్రాయం.

- శ్రీహరి, ఫోన్‌ : 9490754990

రసంపీల్చు పురుగుల పాలిట మహమ్మారి :

అనంతపురం జిల్లా, గుంతకల్‌ మండలం, మల్లెంపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ గత 5 ఏళ్ళుగా క్రమం తప్పకుండా నోవా ఉత్పాదనలైన మిత్ర్‌, స్నైపర్‌, కాండ్రియా, తారక్‌లను వాడి సత్ఫలితాను సాధిస్తూనే ఉన్నారు. ఈ మందులు వాడడం వల్ల రసంపీల్చు పురుగులను నివారించి పంట గుబురుగా మరియు బలరగా పెరిగి పంట నాణ్యతను పెంచడానికి దోహదపడతాయి.

- రమేష్‌, ఫోన్‌ : 9704494518

ప్రతిష్టాకర ఉత్పాదనలతో సత్ఫలితాలు :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, సులానగర్‌ గ్రామానికి చెందిన లక్‌పతి గత 6 ఏళ్ళుగా క్రమం తప్పకుండా నోవా ఉత్పాదనలైన మిత్ర్‌, స్నైపర్‌, సంజీవని, కాండ్రియాలను మిరప పంటలో వాడుతూ అద్భుతమైన దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు. నోవా వారి ఈ ప్రత్యేకమైన ప్రతిష్టాకరమైన బ్రాండ్లను వినియోగించి సత్ఫలితాలను పొందుతున్నారు. -

బానోతు లక్‌పతి, ఫోన్‌ : 9963819792

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో వివిధ పంటల్లో నోవా కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా మిత్ర్‌, స్నైపర్‌, పినాకిల్‌, ప్రోమిన్‌, వండర్‌ గుళికలు వంటి ఉత్పత్తులు రైతులకు పూర్తి స్థాయిలో విశ్వసనీయతను కల్పిస్తున్నాయి. రైతులను ఉత్పత్తిదారులుగాను, సాంకేతిక నిపుణులుగాను, అత్యంత విలువైన భూమిపుత్రులుగాను గౌరవించి, వ్యవసాయాన్ని పవిత్ర వృత్తిగా గుర్తించే సమాజం కొరకు పాటుపడుతున్న నోవా అగ్రిటెక్‌ ప్రై. లిమిటెడ్‌ భవిష్యత్‌లో మరిన్ని పంటలలో పరిశోధనలకు, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చేపడుతున్న చర్యలకు అందరూ మద్దతుగా నిలిచి మరో వ్యవసాయ విప్లవ సాధనలో ముందడుగు వేసేందుకు భుజం భుజం కలిపి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

- నోవా రైతు సేవా కేంద్రం, అగ్రిక్లినిక్‌ పరిశోధనా బృందం,

ఫోన్‌ :9908446789, 040 -27957081, 27957082