వ్యవసాయ అనుబంధ రంగంలో ప్రధాన భూమికపోషాస్తున్న పశువైద్య, పశు సంవర్థక శాఖ ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రతిష్టాత్మంగా చేపట్టిని గొర్రెల పంపిణీని తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3.65 లక్షల గొర్రెల యూనిట్లను లబ్దిదారులకు అందించి పశు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుంది. ఇటువంటి సంస్థకు గత కొంత కాలంగా సంచాలకులను నియమించకపోవడం వల్ల ఆశించిన ఫలితాలను పొందలేకపోవడం ప్రత్యేక సదుపాయాలను నిర్వహంచడంలో కొంత వెనుకబడిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో నూతన సంచాలకులుగా డా|| వి. లక్ష్మారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్‌ డా|| వి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా పశుగణాభివృద్ధిని పెంపొందించేందుకు కృషి జరుగుతుందని అన్నారు. అంతరించిపోతున్న పశువులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం పయనిస్తుందని పశుసంతతిని పెంపొందిస్తూ పశు ఆరోగ్య పరిరక్షణ కోసం నూతనంగా పశువైద్య విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే పశువులకు అతిచేరువలో వైద్య సౌకర్యం జరుగుతుందని మొట్టమొదటిసారిగా పశు అంబులెన్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రమాదవాశాత్తు పశువు నడవలేని స్థితి ఉంటే నేరుగా పశువు వద్దకే చేరి అంబులెన్సు ద్వారా మెరుగైన ఆధునిక వైద్యాన్ని పశువులకు అందచేస్తుందని తెలిపారు. పశువులకు సోకుతున్న వ్యాధులను త్వరితగతిన గుర్తించి తగు చర్యలు, సూచనలు చేపట్టేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. 

లక్ష్మారెడ్డి ప్రస్తానం : 

మొట్టమొదటి సారిగా 1987లో నిజామాబాద్‌ జిల్లా జక్కంపల్లిలో పశుసంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా మొదలైన ఉద్యోగ ప్రస్తానం అంచలంచలుగా ఎదుగతూ వచ్చారు. అసిస్టెంట్‌ సర్జన్‌గా 1993 రంగారెడ్డి జిల్లా కొడంగల్‌లో తన విధులను నిర్వహిస్తున్న సమయంలోనే పబ్లిక్‌ సర్వీసు కమీషనర్‌ ద్వారా నేరుగా సహాయ సంచాలకులుగా 1993లో నియమితులయ్యారు. 1993-2003 వరకు ఇండోస్విస్‌ ప్రాజెక్టు మరియు ఆప్కాబ్‌లో పనిచేస్తున్న సమయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది 2006 బహుళార్ధక పశు వర్ధక శాఖ వైద్యశాల మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న సమయంలోనే జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది వరంగల్‌  ఉమ్మడి జిల్లాలో 2010 వరకు పనిచేశారు. అక్కడి నుండి ఉమ్మడి మెదక్‌ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రెండు పర్యాయాలు ఉత్తమ జిల్లా అధికారిగా అవార్డులను అందుకున్నారు. 2016లో రాష్ట్ర అదనపు సంచాలకులుగా పదోన్నతులు పొంది 2017 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2017లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి పెడరేషన్‌ మేనేజర్‌ డైరెక్టర్‌గా నేటి వరకు బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణారావు ఎండోమెంట్‌ ట్రస్టు అవార్డుతో లక్ష్మారెడ్డిని సత్కరించారు. 2016లో రాష్ట్ర ఉత్తమ సంచాలకులుగా నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 

-అగ్రిక్లినిక్‌ డెస్క్‌