మన భారత దేశంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఆక్వాసాగు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది మరియు అనుబంధ రంగాల్లో ఆక్వాపరిశ్రమల రైతుల ఆదాయాన్ని  రెండింతలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. దేశంలో మత్స్య రైతులు వివిధ రకాల చేపల ఉత్పత్తిలో 80 శాతం పైగా కార్ప్‌ జాతి చేపల పెంపకం విస్తత, పాక్షిక సాంద్ర మరియు సాంద్ర పద్ధతుల్లో చేపడుతున్నారు. 

కార్ప్‌ చేపల పెంపకంలో ముఖ్యమైన అవరోధాలు :

  • తక్కువ సమయంలో  లైంగిక పరిపక్వత (6 నెలల కంటే తక్కువ వయసులో) రావటం మరియు ఇన్బ్రీడింగ్‌ దుష్ప్రభావాలు 
  • విక్రయించదగిన బరువును (100 గ్రా. బరువుతో) చేరే ముందే ఫలదీకరణ గుడ్ల విడుదల
  • ఒకే సంవత్సరంలో ఎక్కువ సార్లు ఫలదీకరణ గుడ్ల విడుదల
  • చేప బరువు కంటే గోనాడో సోమాటిక్‌ ఇండెక్స్‌ (జిఎస్‌ఐ) 20 శాతం మించగలదు.
  • సాంప్రదాయ పదతులు అయిన అటువంటి ట్యాంకులలో అధిక సంఖ్యలో వేయటం వల్ల అధిక  పెరుగుదల మరియు దిగుబడిపై ప్రభావితం చేస్తుంది.

అముర్‌ కామన్‌ కార్ప్‌ యొక్క ప్రముఖ లక్షణాలు :

  • అముర్‌ కామన్‌ కార్ప్‌ శరీర వద్ధి సామర్ధ్యం వేగంగా ఉంటుంది (సాధారణ కార్ఫ్‌ కంటే 27 శాతం వేగంగా)
  • లైంగిక పరిపక్వత ఆలస్యంగా అనగా 6 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది (మొదటి సంవత్సరం చివరిలో ఫలదీకరణ గుడ్ల విడుదల జరుగుతుంది)
  • కృత్రిమ మేతను అంగీకరిస్తుంది.
  • శరీరం సన్నగా ఉంటుంది మరియు సాధారణ కార్ప్‌ కంటే పొట్ట చిన్నది.

కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరామన్న గూడెం పాత్ర :

పైన పేర్కొన్న అవరోధాలను అధిగమించాలనే ఉద్దేశంతో సాంప్రదాయ చెరువుల్లో అముర్‌ కామన్‌ కార్ప్‌ యొక్క వద్ధి పనితీరును ప్రదర్శించడానికి జాతీయ మత్స్య అభివద్ధి సంస్థ, హైదరాబాద్‌ వారి సౌజన్యంతో 6  మంచి నీటి చేప చెరువుల్లో (వి.ఆర్‌.గుడెం, తెలికిచెర్లా, పాండుగూడెం, రెడ్డి గనపవరం, ఈస్ట్‌ రేకులకుంట, తూర్పు రేకులకుంట) ప్రదర్శనలు నిర్వహించటం జరిగింది. ఒక్కొక్క యూనిట్‌కు అముర్‌ కామన్‌ కార్ప్‌ చేప పిల్లలు ఎకరానికి 800 సంఖ్యతో పాటుగా ఇతర తెల్ల జాతి చేప పిల్లలను నిల్వ చేస్తారు. చేప పిల్లలతో పాటుగా మేతను కూడా అందించటం జరిగింది. 

ఫలితం :

  • వ్యవధి 6 నెలల్లోపు సగటు బరువు 845 గ్రాములు
  • గరిష్ట పరిమాణం 2250 గ్రాములు
  • కనిష్ట పరిమాణం 720 గ్రాములు
  • శీతాకాలంలో మంచి వద్ధిని గమనించారు
  • సాగు కాలం తగ్గింది. 
  • స్థానిక స్థితిలో అనుగుణంగా ఉంటుంది.

రచయిత సమాచారం

డా|| దేవి వరప్రసాద రెడ్డి, డా|| టి. విజయనిర్మల, డా|| ఇ. కరుణశ్రీ, కృషీ విజ్ఞాన కేంద్రం,  ఉద్యానపరిశోధనా స్థానం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా,  ఫోన్‌ : 8121136184