నేలవేము ఏకవార్షిక మొక్క. దీని ఆకులు వేపకన్నా చేదుగా ఉంటాయి. అందుకే దీన్ని చేదుకు రాజుగా అభివర్ణిస్తారు. మొక్కలోని అన్ని భాగాల్లో ''ఆండ్రో గ్రాఫోలైడ్‌'' అనే రసాయనం ఉంటుంది. ఆకులు లేదా కొమ్మలు కాలేయ ఉదర వ్యాధులు మరియు అనేక రకాల రోగాల నివారణకు ఉపయోగిస్తారు.

నేలలు :

అన్ని రకాల నేలలు అనుకూలం. ఇసుక, గరప నేలలు అంత బాగా పనిచేస్తాయి.

వాతవరణం :

ఇది 40-450 సెల్సియస్‌ ఉష్ణోగ్రతని తట్టుకుంటుంది. అన్ని రకాల వాతావరణంలో పెరుగుతుంది. నీడలో కూడా పెంచుకోవచ్చు.

ప్రవర్థనం :

విత్తనాలు ఎకరానికి 150-200 గ్రా.

నాటే దూరం :

నారుమడి ద్వారా సాగు చేయదలచినచో మే-జూన్‌లో ఎత్తైన మడుల్లో విత్తాలి. 8-10 సెం.మీ. ఎత్తు, 40-45 రోజుల వయసు కలిగిన నారు ప్రధాన పొలంలో 30I20 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

ఎరువులు :

నత్రజని 20 కిలోలు, భాస్వరం 30 కిలోలు, పొటాష్‌ 20 కిలోలు దుక్కిలో వేసుకోవాలి. మరో దఫా నత్రజని 10 కిలోలు నాటిన 30 రోజుల తరువాత వేయాలి.

అంతరకృషి :

నాటిన తరువాత 3-4 రోజులకు ఒకసారి తరువాత 10-15 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. కలుపు లేకుండా చూసుకోవాలి.

కోత :

నాటిన 90-120 రోజుల తరువాత పుష్పిస్తుంది. ఈ దశలో నాణ్యత బాగా ఉంటుంది. కోత తరువాత తిరిగి 40-60 కిలోల నత్రజని వేసి నీరు పెడితే 60 రోజుల్లో తిరిగి కోతకు వస్తుంది. సంవత్సరానికి 2-3 కోతలు తీసుకోవచ్చు. కోసిన తరువాత 3-4 రోజులు నీడలో ఆరబెట్టాలి.

దిగుబడి, ఆదాయం :

దిగుబడి ఎకరానికి కోతకు 800-1,000 కిలోలు, గరిష్ట ఆదాయం ఎకరానికి కోతకు రూ. 16,000-20,000. ఖర్చు ఎకరానికి రూ. 8,000/- నికర ఆదాయం ఎకరానికి కోతకు రూ. 8,000/- 12,000/- ప్రతి 3-4 నెలలకొకసారి 18 నెలల వరకు కోత తీసుకోవచ్చు.

యస్‌. నాగరాజు, యస్‌. వేణుగోపాల్‌, ఫోన్‌ : 6305871036