తెలంగాణ రాష్ట్రంలో కె.సి.ఆర్‌. నాయకత్వంలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సేద్యానికి కొత్త భాష్యం ప్రారంభమైంది. ఇజ్రాయిల్‌ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని కూరగాయలు, పూలు, పండ్ల ఉత్పత్తికి విశేష కృషి ప్రారంభమైంది. దీనికి అవసరమైన మౌళిక సౌకర్యాలను ప్రధానమైన సూక్ష్మ సేద్యంపై దృష్టి సారించి పథకాలను రూపొందించారు. తొలుత హైదరాబాద్‌ నగరం పరిసర జిల్లాలైన మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రైతులే స్వయంగా ప్రారంభించిన హరిత గృహ స్థాపన, మిగిలిన అన్ని జిల్లాలకు వ్యాపింపచేయడం ద్వారా ఒక నూతన వ్యవసాయ విప్లవానికి నాంధి పలికారు.

దీనిలో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 50 శాతానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 25 శాతం కలిపి 75 శాతాన్ని సబ్సిడీగా ప్రకటించి రికార్డు సృష్టించారు. ఈ సాగులో అంతర్భాగమైన సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేస్తూ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా రైతు సాగు కలలను సాకారం చేస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు నూటికి నూరు శాతం, మిగిలిన వర్గాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం విశేషం కాగా అవి సకాలంలో హేతుబద్దంగా అమలయ్యే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో స్ఫూర్తి పొందిన రైతులు లక్షలాదిగా సూక్ష్మ సేద్య సబ్సిడీ కొరకు బారులు తీరగా, రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు సహకారంతో ఈ సౌకర్యాన్ని అడిగిన వారందరికీ కల్పించి, న్యాయం చేయాలన్న తపనతో పనిచేయడం విశేషం.

సూక్ష్మ నీటి పారుదల పథకం :

బిందు సేద్యం ద్వారా అన్ని రకాల పండ్ల తోటలు, కూరగాయల పంటలు, సుగంధ ద్రవ్యాలు మరియు పూల తోటలకు సమర్ధవంతంగా నీరు మరియు ఎరువుల వినియోగం, తద్వారా నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు.

రైతుల యొక్క ఆర్ధిక స్థితి సంబంధం లేకుండా పొలంలో నీటి లభ్యత ఆధారంగా ఈ కింది విధంగా 5 హె.ల వరకు రాయితీ అందచేయబడును.

షెడ్యూల్డ్‌ కులాలు / షెడ్యూల్డ్‌ తెగల రైతులకు 100 శాతం రాయితీ

బి.సి రైతులకు, సన్న, చిన్న కారు రైతులకు 90 శాతం రాయితీ, ఇతర రైతులకు 80 శాతం రాయితీ.

అన్ని కేటగిరీలకు చెందిన రైతులకు పోర్టబుల్‌ స్ప్రింక్లర్‌ పరికరాలపై 75 శాతం రాయితీ గరిష్టంగా 1 హె. వరకు

రైతులకు జి.ఎస్‌.టి మీద 5 శాతం లేదా గరిష్టంగా రూ. 5 వేల వరకు ఇన్సెంటివ్‌.

మీ సేవ ద్వారా రైతులే నేరుగా దరఖాస్తు చేసుకునే విధానం :

ఆధార్‌ కార్డుతో అనుసంధానం బయోమెట్రిక్‌ విధానాలకు చెక్‌.

భూమి యాజమాన్యపు హక్కు పత్రము ప్రతి (తహసీల్దారు / డిప్యూటీ తహసీల్దారుచే దృవీకరించబడిన) లేదా 1 (బి) రిజిష్టరు ప్రతి.

ఆధార్‌ కార్డు

షెడ్యూల్డ్‌ కులాలు / షెడ్యూల్డ్‌ తరగతుల రైతులు కుల ధృవీకరణపత్రము సమర్పించవలెను.

పంట వారీగా రాయితీ వివరాలు :

పంట మొత్తం ఖర్చు (రూ.లక్షలో) ఇతరులకు 75% రాయితీ (రూ.లక్షలో) SC & ST రైతులకు 95% సబ్సిడీ (రూ.లక్షలో)
కూరగాయలు ₹ 140 చ.మీ.కు 5.60 4.20 1.40
గులాబీ ₹ 157.50 చ.మీ.కు 6.30 4.73 1.58
జెర్బెర ₹ 270 చ.మీ. కు 10.80 8.10 2.70
కార్ణేషన్‌ & ఆర్కిడ్స్‌ ₹ 632 చ.మీ.కు 25.30 18.97 6.33
చామంతి ₹ 372.50 చ.మీ.కు 14.90 11.17 3.73

నెట్‌ హౌస్‌ పధకం :

షెడ్యూల్డ్‌ కులాలు మరియు షెడ్యూలు తెగుల రైతులను ప్రోత్సహించుట కొరకు 95 శాతం సబ్సిడీతో మరియు ఇతరులకు 75 శాతం రాయితీతో రైతుకు ఒక ఎకరానికి మించకుండా నెట్‌హౌస్‌ నిర్మించుకొనుటకు 70 ఎకరాలకు మంజూరు ఇవ్వబడినవి.

పధకం శ్లాబ్‌ యూనిట్‌ ధర (రూ.) మొత్తం ఖర్చు (రూ.లక్షలో) ఇతరులకు 75% రాయితీ (రూ.లక్షలో) SC & ST రైతులకు 95% సబ్సిడీ (రూ.లక్షలో)
నెట్‌హౌస్‌ 2025 538 10.89 8.17 10.35
3965 488 19.35 14.51 18.38

డ్రాగన్‌ ఫ్రూట్‌ :

ఇది ఒక ఎడారి జాతి మొక్క. దీని పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్‌ మరియు డయాబెటిక్‌ వ్యాదులను నివారిస్తుంది.

అతి తక్కువ నీటితో సాగు చేయవచ్చు.

మొదటి సంవత్సరం నుండి దిగుబడి పొందవచ్చును మరియు 30 సం|| వరకు దిగుబడి ఇస్తుంది.

ఒక ఎకరాకు సుమారు 500 సిమెంట్‌ లేదా రాతి పోలు ఏర్పాటు చేసి ఒక పోల్‌కు 4 మొక్కలు చొప్పున ఎకరాకు సుమారు 2000 మొక్కలను పెట్టవచ్చు.

చీడ పీడల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది.

మొదటి సంవత్సరంలో ఏకరాకు ఒక టన్ను, 2వ సంవత్సరంలో 2 టన్నులు, 3-4వ సంవత్సరంలో 4-6 టన్నులు మరియు 5వ సంవత్సరం తరువాత ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు.

డ్రాగన్‌ఫ్రూట్‌ పంట సాగుకు ఒక ఎకరాకు ఒక యూనిట్‌ చొప్పున రైతు పొలంలో ప్రదర్శనాక్షేత్రాల ఏర్పాటు ఒక యూనిట్‌కు రూ. 3.56 లక్షల రాయితీతో ఉద్యానశాఖ ప్రోత్సహిస్తుంది.

ఆయిల్‌ పామ్‌ తోటల పెంపకానికి రాయితీ :

వివరాలు (హె.) ఖర్చు (హె.) రాయితీ (హె.) రైతు వాటా (హె.)
మొక్కల నిమిత్తం రాయితీ 13013 12000 1013
సమగ్ర యాజమాన్యం నిమిత్తం రాయితీ
మొదటి సం|| 10,000 5,000 5,000
రెండవ సం|| 10,000 5,000 5,000
మూడవ సం|| 10,000 5,000 5,000
నాలుగవ సం|| 10,000 5,000 5,000
మొత్తం రాయితీ 53,013 32,000 21,013

వెనుకబడిన తరగతులకు చెందిన పెద్ద రైతులు కూడా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిది, ఫోన్‌ : 9949285691