తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబవుతుంది. ప్రపంచ వ్యవసాయ రంగంలోనే పెనుమార్పులు తీసుకువచ్చే అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఈ ఆతిధ్య రాజధాని సిద్ధమౌతుంది. జూన్‌ 26 నుండి జులై 3 వరకు 7 రోజుల పాటు అంతర్జాతీయ విత్తన సదస్సు నగరంలో జశీఅస్త్రతీవరర-2019 జరుగనున్నది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని ఇటీవల జర్మనీ దేశంలోని ప్రీసింగ్‌ నగరంలో ఇస్టా కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో తీసుకున్నారు. ఫిబ్రవరి 8-16 వరకు జరిగిన ఈ కార్యనిర్వాహక కమిటీ గవర్నింగ్‌ బోర్డులో సభ్యుడైన తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌ డా|| కేశవులు పాల్గొన్నారు.

ఈ కమిటీ సమావేశంలో తీసుకున్న ఈ క్రింది నిర్ణయాల మేరకు భవిష్యత్‌లో ప్రపంచ విత్తన రంగంలో, తద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్న నేపధ్యంలో అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడనున్నది. ఆసియా ఖండంలో తొలిసారిగా మన మేధోరాజధానిలో జరుగనున్న ఈ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఇస్టా కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా జూన్‌ 20 నుండి జులై 3 వరకు వరుసగా పలు సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రులను కలుసుకొని సదస్సును దిగ్విజయం చేయడానికి కావలసిన ఏర్పాట్లపై, ప్రపంచ వ్యాప్తంగా విత్తన రంగం, వ్యవసాయం తీరు తెన్నులను సమీక్షించనుండడం అతి విశేషమైనది. కమిటీ సమావేశాల్లో విత్తన పరీక్ష పద్ధతులు ప్రమాణాలపై చర్చించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలు అమలు కావాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయిలో విత్తన ఎగుమతులను ప్రోత్సహించడం ఈ కమిటీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చింది.

హైదరాబాద్‌లో జూన్‌లో జరుగబోయే అంతర్జాతీయ విత్తన సదస్సు కార్యక్రమాలను కార్యనిర్వాహక కమిటీ ఖరారు చేసింది. అంతర్జాతీయ విత్తన సదస్సు సందర్భంగా ఐక్యరాజ్య సమితికి చెందిన (ఖీూూ) ఆహార వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి విత్తన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విత్తన రంగంలో ఆసియా-ఆఫ్రికా దేశాల మధ్య, దక్షిణ-దక్షిణాది సహకారం ఎజెండాగా పరస్పర విత్తన సాంకేతిక పరిజ్ఞాన సహకారం, విత్తన ఎగుమతులు, దిగుమతుల కోసం మార్కెటింగ్‌ అనుసంధానం కోసం వర్క్‌షాపును నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇస్టా ప్రాముఖ్యత :

అంతర్జాతీయ విత్తన పరిశోధనా సంఘం (Iూుూ) అనేది అంతర్జాతీయ స్థాయిలో విత్తన నాణ్యతా ప్రమాణాలు, విత్తన పరిక్షా పద్ధతులు, ఏ విధంగా ఉండాలనే అంశాలపై 1924లో ఏర్పడిన సంస్థ. స్విట్జర్లాండ్‌ దేశంలోని ప్రముఖ నగరం జూరిచ్‌లో ఏర్పాటైన సంస్థ. వివిధ దేశాల నుండి ప్రతినిధులు పాల్గొని గవర్నింగ్‌ బాడీగా ఈ సంస్థ నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ఇష్టా ఏర్పడి 92 సం|| చరిత్రలో ఒక భారతీయుడు గవర్నింగ్‌ బాడీ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి. అది కూడా మన తెలుగు శాస్త్రవేత్త, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర వాసి డా|| కేశవులు ఎన్నికవ్వడం గర్వకారణం. ఆయన ఎంపికైన అనంతరం 2019 ఫిబ్రవరి 8 నుండి 16 వరకు జర్మనీలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం రావడం, హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఇస్టా కాంగ్రెస్‌ 2019 (విత్తన సదస్సు) నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం బహుగర్వకారణం.

జర్మనీలో జరిగిన ఇస్టా కార్యనిర్వాహకవర్గ కమిటీ సమావేశంలో 2019-2025 వరకు 5 సం|| పాటు ప్రపంచ వ్యాప్తంగా విత్తన ప్రణాళిక అమలుతోపాటు, దేశాల మధ్య విత్తన ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడం అన్ని దేశాలకు ఒకే విధంగా నాణ్యమైన విత్తన ప్రమాణాలను వర్తింపచేయడం ప్రధాన ఎజెండాగా నిర్ణయం చేయడం విశేషం. విత్తనాల భద్రత కొరకు బార్‌కోడెడ్‌ పద్ధతి ద్వారా లేబులింగ్‌ చేయడం వంటి కీలక అంశాలపై చర్చజరిగింది. ప్రపంచవ్యాప్తంగా రైతులను పీడిస్తున్న విత్తన కల్తీ నివారణకు, నియంత్రణకు చర్యలు తీసుకుంటూ రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు కమిటీ సిఫార్సులు చేస్తూ, ఆ నేపధ్యంలోనే హైదరాబాద్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సుకు నిర్ణయం తీసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్ళడం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు, రైతు హితులకు, శాస్త్రజ్ఞులకు స్ఫూర్తిని కలిగించనున్నది.

అదే విధంగా ఇప్పటి వరకు సరైన ఫలితాలు రావడానికి, నూతన విత్తన నమూనాల సేకరణ పద్ధతులు బహువార్షిక మొక్కల్లో కూడా విత్తన నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలనే అంశంపై కూడా కమిటీలో చర్చ జరిగింది. విత్తన శుద్ధి పద్ధతులు వాటి ప్రభావం విత్తన నాణ్యతపై ఏ విధంగా ఉంటుంది. వాటి విధి విధానాలను సమగ్రంగా చర్చించారు.

విత్తన ఆరోగ్యం (సీడ్‌ హెల్త్‌) పరిక్ష ద్వారా మనదేశం నుండి మరిన్ని దేశాలకు చీడపీడలు లేని విత్తన ఎగుమతులను ప్రోత్సహించే అవకాశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. దానితో పాటు కీలకమైన మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. వివిధ దేశాల్లో విత్తనోత్పత్తి దారులకు విత్తన అధికారులకు, నూతనంగా ఈ రంగంలోకి ప్రవేశించిన శాస్త్రవేత్తలకు, పరిశోధనా విద్యార్ధులకు అంతర్జాతీయ విత్తన ప్రమాణాలపై శిక్షణ / అవగాహన కర్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఇష్టా నిర్ణయం తీసుకుండి.

అంతర్జాతీయ విత్తన సదస్సు జశీఅస్త్రతీవరర-2019 :

జూన్‌ 26 నుండి జులై 3 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు కార్యక్రమాలు ఖరారయ్యాయి. ప్రపంచంలోని 30 దేశాల నుండి వచ్చేందుకు ప్రతినిధులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. వారం రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో అంశాల వారిగా 7 రోజుల పాటు విస్తృతంగా మేధోమధనం జరుగుతుంది. సదస్సులో పాల్గొని ప్రదర్శించే శాస్త్రవేత్తలు, ప్రముఖుల పేర్లు కూడా ఖరారయ్యాయి. ఈ సందర్భంగా 7 రోజులపాటు ప్రపంచస్థాయి విత్తన పరిశోధనా ఎగ్జిబిషన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. విత్తన సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు..

1. విత్తనం మొలకెత్తే శాతం-సామర్ధ్యం పరీక్ష

2. వచ్చే తరాల కోసం విత్తన నాణ్యత-నిర్థారణ

3. విత్తన ఆరోగ్య నిర్థారణ-చీడపీడల శాస్త్రంలో ఉండే చిక్కులు

4. మారుతున్న వాతవరణంలో విత్తనోత్పత్తి

5. విత్తన నాణ్యతను పరిక్షించడానికి నూతన అనుసంధాన పద్ధతులు

ఇప్పటికే ప్రపంచ మేధోరాజధానిగా, ఆతిధ్య రాజధానిగా, ఆరోగ్య రాజధానిగా, ముత్యాల నగరంగా ప్రపంచస్థాయిలో కీర్తింపబడుతున్న మన భాగ్యనగర శిగలో తురిమిన మరో కలికి తురాయిగా ఈ అంతర్జాతీయ విత్తన సదస్సు భాసిల్లనున్నది. మనదేశంలో మరో వ్యవసాయ విప్లవానికి, ప్రపంచ అగ్రభాగాన వెలుగొందడానికి దేశం సిద్ధమౌతున్న నేపద్యంలో ఈ కార్యక్రమం చరిత్రాత్మకంగా, స్పూర్తివంతంగా నిలిచిపోతుందనడంలో సందేహంలేదు. హరిత భారత నిర్మాణంలో పాలుపంచుకుంటున్న భారతీయులందరికీ స్ఫూర్తివంతమైన సందేశాన్నిచ్చే ఈ సదస్సు విజయవంతం కావాలని అగ్రిక్లినిక్‌ మాసపత్రిక ముందే ప్రపంచ ఆకుపచ్చ సైనికులందరికీ స్వాగతం పలుకుతుంది.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌