Print this page..

బహుప్రయోజనాల వేసవి దుక్కులు

సాధారణంగా రైతు సోదరులందరు ఖరీఫ్ మరియు రబీ పంటలను తీస్కున్న తర్వాత మళ్ళీ ఖరీఫ్ ప్రారంబమై వర్షాలు మొదలయ్యే వరకు భూమిని దున్నకుండా ,అసలు పొలాన్ని పట్టించుకోకూండా వదిలేస్థారు.ఋతుపవనాల ఆరంభానికి ముందే భూమిని దున్ని ఉంచుకోవడం వలన తొలకరి వర్షాలు పడగానే పెళ్ళలు మెత్తబడి  నీరు త్వరగా భూమిలోకి ఇంకుతుంది.దీని వలన భూమిలోపలి పొరల్లో నీరు నిక్షిప్త సామర్ధ్యం పెరిగి ,విత్తన మొలక శాతం బాగుంటుంది.వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు.
తేమ నిల్వ శక్తి పెరుగుదల:

లోతైన వేసవి దుక్కులు చాలుకు అడ్డంగా ఛేయడం వలన వలన వర్షపు నీరు పారుదల కాకుండా భూమి లోతుకు చేరుతుంది.అంతేకాకుండా వేసవి దుక్కులు దున్నే ముందుగా భూమిలో పశువుల ఎరువు గానీ కంపోస్ట్ గానీ,చెరువు మట్టిని గానీ నేల సారవంతమవుతుంది..
సాధారణంగా వేసవి దుక్కులు చేయకపొతే భూమి పొరలు గట్టిపడి ,మొక్కల వేళ్ళు లోనికి చొచ్చుకొని పోకుండా .పోషక పధార్ధాలు,నీరు ,ఖనిజ లవణాలను పొందలేక మొక్కల దిగుబడి తగ్గుతుంది.
వేసవి దుక్కులు చేసినట్లైతే భూమి గుళ్ళబారి పొరలు ఏర్పడకుండా ,మెత్తగా తయారై నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది.తద్వారా వానపాముల సంతతి కూడా గణనీయంగా పెరిగి భూసారా అభివృద్దికి దోహదపడుతుంది.
కలుపు నివారణకు :

కలుపు మొక్కలు భూసారాన్ని గ్రహించడంతో పాటు పరోక్షంగా చీడ పీడలకు ఆశ్రయమిచ్చి పంట నష్టానికి దోహదపడపడతాయి.
వేసవి లోతు దుక్కులు చెయడంవల్ల కలుపు మొక్కలు,వాటి అవశేషాలు,విత్తనాలు నశింపబడతాయి.
అంతేకాకుండా మొండిజాతికి చెందిన తుంగ వంటి మొక్కలు వేళ్ళ వద్ద దుంపలలో అహారాన్ని నిల్వ చేసుకొని భూసారానికి విఘాతం కలిగిస్తాయి.అందువలన లోతు దుక్కి చేయడం వలన తుంగ దుంపలు బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురికావడం వలన చనిపోయే అవకాశం ఎక్కువ.
దుంపలలో అహారాన్ని నిల్వ చేసుకొని భూసారానికి విఘాతం కలిగిస్తాయి.అందువలన లోతు దుక్కి చేయడం వలన తుంగ దుంపలు బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురికావడం వలన చనిపోయే అవకాశం ఎక్కువ.
అంతేకకుండా ఇతర గడ్డి జాతి మొక్కలు ,ద్విదశ జాతి మొక్కల విత్తనాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురై నశించే అవకాశం ఉన్నది.
సస్య రక్షణ :
పంట సాగులో ఉన్నప్పుడు వివిధ రకాల పురుగులు ,తెగుళ్ళు ఆశిస్తాయి.అయితే పురుగుల జీవిత చక్రంలో లార్వాల నుంచి ప్యూపా దశకు(కోశస్త దశకు) చేరుకుంటాయి.ముఖ్యంగా వేసవి దుక్కి చెయడం వలన ఈ కోశస్త దసలు భూమి లోపలి ఉంచి బయటపడి సూర్యరశ్మికి చనిపోతాయి.
అంతేకాకుండా వేసవి దుక్కిలో బయటపడిన కోశస్త దశలు,గుడ్లను కొంగలు,కాకులు ఎతర పక్షులు తిని నాశనం చేస్తాయి.అందువలన వేసవి దుక్కులకు సమగ్ర సస్య రక్షణలో మొదటి ప్రాదాన్యత లభిస్తుంది.
పెంట ఎరువులు/చెరువు మట్టి వెసుకోవడం:
రైతులు వేసవిలో అలసత్వవం ప్రదర్శించకుండా కొద్దిపాటి యాజమాన్య చర్యలు చేపట్టడం వలన రాబోయే కాలంలో పంటల దిగుబడిని పెంచుకోవడానికి వీలుంటుంది.వేసవిలో చెరువుల మట్టిని పొలాల్లోకి వేసుకోవడం వల్ల సూక్ష్మపోషకాల స్తాయి పెరిగి,పంట దిగుబడులు పెరుగుతాయి.
రైతులు చెరువు పూడిక తీతలో ఎక్కువగా ఒండ్రు,బంక ఉండటం వలన పొలంలో నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యం కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా మట్టిలోని లవణాల శాతాన్ని ముందుగా దగ్గరలోని భూసార పరిక్ష కెంద్రంలో పరీక్షించిన తర్వాత మాత్రమే వేసుకోవాలి.ఎకరా పొలంలో కనీసం 30 ట్రాక్టర్ల మట్టిని వేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే సముద్ర తీరానికి దగ్గర్లో ఉన్న చెరువుల్లో లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది.కనుక ఆ పరిసర ప్రాంతాల్లో మట్టిని పంట పొలాలకు తరలించరాదు.
చెద పురుగుల నివారణ:
పంట పొలల గట్లపైన,పంట పొలాల చుట్టుపక్కల ఉండే చెద పురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి నాశనం చేయాలి.5 మి.లీ క్లోరిపైరిఫాస్ 50 ఇ.సి మందును లిటరు నీటికి కలిపి సుమారు 15-30 లీటర్ల మందు  ధ్రావణాన్ని చెదపుట్టలు తడిచేటట్లు పిచికారి చేయాలి.
ఈ వేసవి దుక్కుల వలన భూమి కోతను నివారించి అభివృద్ది పెంపొందించి.భూమిలో ఉండే సూక్ష్మ జీవుల సంతతిని పరిరక్షించి,భూమిలో తేమను కాపడుకోవడంతో పాటు కలుపు సమర్ధంగా నివారించి,చీడపీడల నిర్మూలనతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా అదుపులో ఉంచుకోగలం.కాబట్టి రైతు సోదరులంతా వేసవి లోతైన దుక్కులు దున్ని బహువిధానాలైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేసినట్లైతే భూసార వృద్దిని పెంపొందించుకుంటూ ,భూమిలో తేమ నిల్వ శక్తిని పెంచుకుంటూ,పూర్థి స్థాయి పంట దిగుబడులను పొందవచ్చును. 

రచయిత సమాచారం

ఎం.నవత(సేధ్య విభాగ శాస్త్రవేత్త)బి.మాధవి (సేధ్య విభాగ శాస్త్రవేత్త).డి.ఎ రజనీ దేవి(ఆర్ధిక శాస్త్రవేత్త)పి.మధుకర్ రావు(సేధ్య బిభాగ శాస్త్రవేత్త)పి.నిత్య(విస్తరణ విభాగం)ఎం గౌరి ప్రియ(ఎ.ఇ.ఒ)ఆర్.ఉమా రెడ్డి(సహ పరిశోధన సంచాలకులు) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం-పొలాస జగిత్యాల