శ్రీకాకుళం జిల్లాలో అధికశాతం సాగయ్యే పంట వరి. వంశధార, నాగావళి నదుల ద్వారా మరియు ఇతర చెరువులు, బావుల కింద సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది. నేరుగా వెదజల్లేపద్దతిలో, దమ్ము చేసే విధానంలో, నాట్లు వేసే విధానంలో ఇలా రకరకాల పద్ధతుల్లో వరి పంట పండిస్తారు. విత్తనం వేసింది మొదలుకొని రైతును బాధించే మొదటి సమస్య కలుపు. సకాలంలో కలుపు యాజమాన్య చర్యలు చేపట్టక పోవడం వల్ల యేటా సుమారు 25-30 శాతం పంట నష్టం వాటిల్లే అవకాసం ఉంది. వ్యవసాయ కూలీల కొరత తీవ్రతరమైన ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు నివారణ రైతుకు భారంగా మారిందని, సకాలంలో కలుపు నిర్మూలిస్తే గెలుపు సాధించవచ్చని ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు.

కలుపు వల్ల పంటకు కలిగే నష్టాలు :

పంట దిగుబడి తగ్గుదల

నాణ్యతలో తరుగు

పోషక పదార్ధాల నష్టం

మెట్ట పంటలలో నీటి కోసం పోటి.

వ్యవసాయ ఖర్చు పెరుగుదల

పంటల్లో కలుపు ఉధృతికి కారణాలు :

వేసవి లోతు దుక్కులు చేయకపోవడం

పైరు, కలుపు ఒకేసారి మొలకెత్తుట

పంట కన్నా కలుపు పెరుగుదల వేగంగా ఉండటం

తేమ శాతం ఎక్కువ ఉండటం

సరైన ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం

నేరుగా విత్తే వరిలో కలుపు యాజమన్యం :

విత్తనాలు మొలవక ముందు (విత్తిన 2 లేదా 3 రోజుల లోపు):

పెండిమిథాలిన్‌ 30 శాతం ద్రావణం (స్టాంప్‌, పెండి స్టార్‌, గదర్‌, ధనుటాప్‌, పెండమిల్‌) లీటరు నీటికి 5 మీ.లి.(ఎకరానికి ఒక లీటరు మందు) లేదా ప్రేటిలాక్లోర్‌ 50 శాతం ద్రావకం (ఎరైస్‌, సోఫిట్‌, రేఫిట్‌, లారేట్‌) లీటరు నీటికి 2 మీ.లీ.(ఎకరాకు (400 మీ.లి.) లేదా పైరజో సల్ఫురాన్‌ ఈథైల్‌ 10 శాతం (సాథి) 0.4 గ్రా. మందు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కలుపు మందు పిచికారి సమయంలో తప్పనిసరిగా నేల పదునుగా ఉండాలి.

విత్తిన 15-20 రోజుల మధ్య :

పొలంలో ఊదా మొదలగు గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు, నీటిని తీసి విత్తిన 15-20 రోజుల మధ్య ఎకరాకు 400 మీ.లీ. సైహలోఫాప్‌ బ్యుటైల్‌ 10 శాతం ద్రావకం (క్లించిర్‌) 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

గడ్డి జాతి, వెడల్పాటి మొక్కలు సమానంగా ఉన్నపుడు ఎకరానికి 100 -120 మీ.లి. బిస్‌ పైరిబాక్‌ సోడియం 10 శాతం ద్రావకం (నామిని గోల్డ్‌, ఆడార, తారక్‌) మరియు క్లోరిమ్యురాన్‌ ఇథైల్‌ ం మెట్‌ సల్ఫురాన్‌ మిథైల్‌ (ఆల్మిక్స్‌) 8 గ్రా. మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

విత్తిన నెల రోజుల తరువాత :

పొలంలో వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 400 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్‌ 80 శాతం (ఫెర్నక్సోన్‌, వీడ్‌ మార్‌, సాలిక్స్‌) పొడి మందు 200 లి. నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందు పిచికారి చేసినపుడు పొలంలో నీరు తక్కువగా ఉంచవలెను. పొలం ఎర్రబారితే పై పాటుగా నత్రజని ఎరువును అందించాలి. లేదా విత్తిన 30 రోజులకు ఎకరానికి 50 గ్రా. ఇథాక్సి సల్ఫూరాన్‌ పొడి (సన్‌ రైస్‌)మందు 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే పొలంలో ఉన్న వెడల్పాటి కలుపు మొక్కలను నిర్మూలించవచ్చు. సన్నజాతి గడ్డి (ఊదా, చిప్పెర, ఆరిక, నక్కతోక వంటి గడ్డి జాతి) నిర్మూలనకు ఫెనాక్సి ప్రాప్‌-పి- ఇథైల్‌ 6.9 శాతం (రైస్‌స్టార్‌)మందు ఎకరాకు 250 మీ.లి. చొప్పున 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

దమ్ము చేసి నేరుగా విత్తిన వరిలో..

విత్తిన 2 లేదా 3 రోజుల లోపు పొలంలో నీరు పలుచగా ఉంచి ఎకరానికి 35-50 గ్రా. అక్సాడయార్జిల్‌ 80 శాతం (టాప్‌ స్టార్‌) పొడి మందు లేదా పైరజో సల్ఫురాన్‌ ఈథైల్‌ 10 శాతం (సాథి) 0.4 గ్రా. మందు 200 లీ. నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

విత్తిన 15-20 రోజులకు ఊదా మొదలగు గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 మి.లీ. సైహలోఫాప్‌ బ్యుటైల్‌ 10 శాతం ద్రావకం (క్లించార్‌) ద్రావకం 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

గడ్డి జాతి, వెడల్పాటి మొక్కలు సమానంగా ఉన్నప్పుడు ఎకరానికి 100 -120 మి.లీ. బిస్‌ పైరిబాక్‌ సోడియం 10 శాతం ద్రావకం (నామిని గోల్డ్‌, ఆడార, తారక్‌) మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

విత్తిన నెల రోజుల తరువాత..

పొలంలో వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 400 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్‌ 80 శాతం (ఫెర్నక్సోన్‌, వీడ్‌ మార్‌, సాలిక్స్‌) పొడి మందు 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందు పిచికారి చేసినప్పుడు పొలంలో నీరు తక్కువగా ఉంచవలెను. పొలం ఎర్రబారితే పై పాటుగా నత్రజని ఎరువును అందించాలి. లేదా విత్తిన 30 రోజులకు ఎకరానికి 50 గ్రా. ఇథాక్సి సల్ఫురాన్‌ పొడి (సన్‌ రైస్‌) మందు 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే పొలంలో ఉన్న వెడల్పాటి కలుపు మొక్కలను నిర్మూలించవచ్చు. సన్నజాతి గడ్డి (ఊదా, చిప్పెర, ఆరిక, నక్కతోక వంటి గడ్డి జాతి) నిర్మూలనకు ఫెనాక్సి ప్రాప్‌- పి- ఇథైల్‌ 6.9 శాతం (రైస్‌ స్టార్‌) మందు ఎకరాకు 250 మి.లీ. చొప్పున 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

నాట్లు వేసిన వరి పంటలో :

వరి నాటిన వెంటనే (3 - 5 రోజుల్లో)

ప్రెటిలాక్లోర్‌ 400 మి.లీ. లేదా బ్యుటాక్లోర్‌ 1-1.5 మి.లీ. ఏదో ఒక మందును 200 లీటరు నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారి చేయాలి.

నాటిన 20 రోజుల తరువాత :

ఊదా మొదలగు గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 మి.లీ. సైహలోఫాప్‌ బ్యుటైల్‌ 10 శాతం ద్రావకం (క్లించర్‌) ద్రావకం 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

గడ్డి జాతి, వెడల్పాటి మొక్కలు సమానంగా ఉన్నప్పుడు ఎకరానికి 100 -120 మి.లీ. బిస్‌ పైరిబాక్‌ సోడియం 10 శాతం ద్రావకం (నామిని గోల్డ్‌, ఆడార, తారక్‌) మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

నాటిన నెల రోజుల తరువాత :

పొలంలో వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 400 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్‌ 80 శాతం (ఫెర్నక్సోన్‌, వీడ్‌ మార్‌, సాలిక్స్‌) పొడి మందు 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందు పిచికారి చేసినప్పుడు పొలంలో నీరు తక్కువగా ఉంచవలెను. పొలం ఎర్రబారితే పై పాటుగా నత్రజని ఎరువును అందించాలి. లేదా విత్తిన 30 రోజులకు ఎకరానికి 50 గ్రా. ఇథాక్సి సల్ఫురాన్‌ పొడి (సన్‌ రైస్‌)మందు 200లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పొలంలో ఉన్న వెడల్పాటి కలుపు మొక్కలను నిర్ములించవచ్చు. సన్నజాతి గడ్డి (ఊదా, చిప్పెర, ఆరిక, నక్కతోక వంటి గడ్డి జాతి) నిర్మూలనకు ఫెనాక్సి ప్రాప్‌- పి- ఇథైల్‌ 6.9 శాతం (రైస్‌ స్టార్‌)మందు ఎకరాకు 250 మి.లీ. చొప్పున 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

వేరుశనగ :

విత్తిన రెండు రోజుల లోపు పెండిమిథాలిన్‌ ఎకరానికి 1 లి. చొప్పున 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. పంట 25-30 రోజులలో అంతర కృషి చేయాలి. అంతర కృషి వీలు కాని పక్షంలో ఇమాజితపెర్‌ 250 మి.లీ. ఎకరానికి 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న :

పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజుల లోపు అట్రాజిన్‌ కలుపు మందు తేలిక నేలలో ఎకరానికి 800 గ్రా, బరువు నేలలో అయితే ఎకరానికి 1200 గ్రా. మందు 200 లీ. నీటికి కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. విత్తిన 20 రోజులకు కలుపు నివారణ కొరకు, టెమ్బోట్రయాన్‌ 115 మి.లీ. 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు పొలంలో వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉన్నపుడు ఎకరానికి 500 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్‌ పొడి మందు 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

పత్తి :

పత్తి పంటను విత్తిన వెంటనే రెండు రోజులలోపు పెండిమిథాలిన్‌ 1.25-1.5 మి.లీ. మందు 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పంట 25-30 రోజుల్లో అంతర కృషి చేయాలి. అంతర కృషి వీలు కానీ పక్షంలో గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే 400 మి.లీ. క్విజలోపాఫ్‌ ఇథైల్‌ (టర్గా సూపర్‌), వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటె పైరిథయోబాక్‌ సోడియం (హిట్‌ వీడ్‌, థీమ్‌) 250 మి.లీ. మందును 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పొలంలో సన్నజాతి, వెడల్పాకు కలుపు సమానంగా ఉంటే 400 మి.లీ. క్విజలోపాప్‌ ఇథైల్‌ + పౖౖెరిథయోబాక్‌ సోడియం 250 మి.లీ. మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

అపరాలు :

పంటను విత్తిన వెంటనే రెండు రోజులలోపు పెండిమిధాలిన్‌ 1.25-1.5 మి.లీ. మందు 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. విత్తిన 25-30 రోజుల్లో ఉదా గడ్డి నిర్మూలనకు ఫెనాక్సప్రాప్‌ ఈథైల్‌ 250 మి.లీ. మందు 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఊదాతో పాటు చిప్పెర, గరిక లాంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉం 400 మి.లీ. క్విజలోపాప్‌ ఈథైల్‌ లేదా వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఇమాజితాఫెర్‌ 250 మి.లీ. ఎకరానికి 200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

డా. జి. చిట్టిబాబు, శాస్త్రవేత్త, డా. చిన్నం నాయుడు, సీనియర్‌ శాస్త్రవేత్త, డా. పి. వెంకట్రావు, శాస్త్రవేత్త,

ఏరువాక కేంద్రం, ఆముదాలవలస, ఫోన్‌ : 9849035068