పూలను సాధారణంగా అలంకరణకు, పుష్ప గుచ్చాలకు, పూల దండల తయారీ లేదా సుగంధ తైలాల తయారీ కొరకు ఉపయోగిస్తారు. వీటికి భిన్నంగా కొన్ని రకాల పూలను తినడానికి కూడా ఉపయోగిస్తారు. విషపూరితం కానీ మరియు ఎటువంటి ప్రతికూల ప్రభావాలు చూపని పూలను తినదగు పూలుగా భావించవచ్చు. పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఆది మానవులు గులాబీ పూలను తినేవారు. కొన్ని శతాబ్దాలనుండి పూల రేకలను టీ తయారికి గాను ఉపయోగించడం జరుగుతుంది. చైనీయులు ఇప్పటికి కూడా పూలను మరియు వాటి మొగ్గలను టీలు, సూపులు మరియు ఫ్రై పదార్ధాలుగా ఉపయోగిస్తున్నారు. రోమన్లు కూడా వీటిని వివిధ రకాల వంటకాల తయారీలలో ఉపయోగిస్తుండేవారు.
కొన్ని రకాల పూలలో పోషకాలు అదికంగా ఉంటాయి. ఉదాహరణకు గులాబిలలో (రోజ్ హిప్స్) విటమిన్ 'సి' అదికంగా ఉంటుంది. బంతి మరియు నస్తుర్టియం లలో విటమిన్ 'సి' అదికంగా ఉండును. దాన్డిలియోన్ పూలలో కూడా విటమిన్ 'ఎ' మరియు 'సి' కలిగి ఉంటాయి. చాలా పూలు తినుటకు అనువైనవి. కాని వాటిని ఎంచుకోనుటలో తగు జాగ్రత్తలు తీసుకోవలెను, ఎందుకనగా కొన్ని పూలు విషపూరితమైనవి. తినదగిన పూలు చూడడానికి అందంగా కనబడినా, అవి రుచికరంగా ఉండవలిసిన అవసరం లేదు. తినదగిన పూలను వివిధ పదార్ధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు సాస్లు, బేకింగ్, జెల్లీ, సిరప్, తేనే, టీ, వైన్, వెనిగర్ మరియు కాండీడ్ పూలు.
తినుటకు ముందు ఆ పూలను గుర్తించటం అవశ్యకం.
ఆస్థమా, అలర్జీ ఉన్న వ్యక్తులు ఈ పూలను తినకుండా ఉండుట శ్రేయస్కరం.
సేంద్రియ పద్ధతితో పండించిన పూలలో ఎటువంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉండవు. కనుక వాటిని స్వీకరించవచ్చు.
తినదగిన పూలను ఉదయం ఎండ చొరబడని సమయంలో సేకరించుట మంచిది.
పూర్తిగా విచ్చుకున్న పూలను సేకరించాలి. మొగ్గ దసలో ఉన్న లేదా వాడిపోయిన పూలను విడిచిపెట్టుట మంచిది.
కొత్తగా పూలను తినుట ప్రారంబించిన వ్యక్తులు ముందుగా పరీక్షించుటకు తక్కువ మోతాదులో పూలను స్వీకరించటం శ్రేయస్కరం.
పూల భాగాలలో అండకోశం, కేసరములు మరియు కాండం చేదుగా ఉంటాయి. కనుక పూల రేఖలను మాత్రమే తినవలెను.
రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల పూలను తినుట మంచిది కాదు.
కీటకాలు, రోగాలు లేని పూలను ఎన్నుకొని తినుట ఆరోగ్యానికి శ్రేయస్కరం.
కలేన్డ్యుల, చామంతి, కష్ణ బంతి, పాన్సి, పెటునియా, ముల్లంగి, జేరేనియం, సుర్యకాంత పుష్పం, స్నాప్ డ్రాగన్,
జిప్సోఫిలా, డే లిల్లీ, తులిప్, వైలెట్స్, హోలీ హాక్స్
ఆపిల్, ప్లం, గులాబీ
కొన్ని పుష్పాలను తినుట వలన తలనొప్పి, కడుపు ఉబ్బరం మరియు చర్మ సంబందిత వ్యాదులు వచ్చును. ఉదాహరణకు, డఫోడిల్, హైడ్రాంజియా, అజేలియా, గన్నేరు, ఆముదం పూలు మరియు రోడోడెన్డ్రోన్.
పూలను సేకరించుట
శుభ్రంగా నీటిలో కడుగుట
పూల రేఖలపై ఎండిన గుడ్డు సొన పొడిని నునుపైన బ్రష్‌తో అద్దుట
పంచదార పొడిని పూరేఖలపై జల్లుట
గాలి చొరబడని పాత్రలో
చల్లటి ప్రదేశంలో నిల్వ ఉంచుట
సి.హెచ్. సాయి రత్న శర్వాణి, ఎల్. గౌతమి, జి. దివ్య శ్రీ, డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయం,
అనంతరాజుపేట, కడప, ఫోన్ : 9603615054