హైడ్రోపోనిక్స్‌ విధానంతో పంటల సాగునివారణ :

మట్టితో అవసరం లేకుండా కేవలం నీళ్ళలో మొక్కల్ని పెంచడాన్ని హైడ్రోపోనిక్స్‌ అంటారు. మామూలుగా వ్యవసాయం చేయడానికి నేల, నీరు కావాలి. వాతావరణం పంటకు అనుకూలంగా ఉండాలి. కాని హైడ్రోపోనిక్స్‌ ద్వారా నేల అవసరం లేకుండా వాతావరణం మీద పూర్తిగా ఆధారపడకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా పంటలను పండించవచ్చు.

హైడ్రోపోనిక్స్‌లో మొక్కలను పెంచే విధానం :

ప్రకృతి మీద ఆధారపడకుండా ఉన్న స్థలంలో మొక్కలకు కావలసిన పోషకాలు నీటి ద్వారా అందించడం కొరకు నిలువుగా-అడ్డంగా నీటి గొట్టాన్ని ఒక వరుసపైన మరొకటి అమరుస్తారు. వాటికి రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో పేపర్‌ టీ కప్పుల్లాంటి జాలి కప్పులను పెడతారు. అందులో మొక్కలను నాటే ముందు మొక్కలు స్థిరంగా ఉండడానికి బంక మట్టితో చేసిన చిన్న గుండ్రని బాల్స్‌ని వేస్తారు. మొక్కవేళ్ళు జాలిలో నుండి పైపులోనికి పోతాయి. ఆ పైపులో మొక్కకు అవసరమైన పోషకాలు కలిపిన నీరు నిరంతరంగా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు మొత్తం పైపంతా ప్రవహించి తిరిగి ట్యాంకులోకి చేరుతుంది. మరలా అదే నీరు పైపుల్లోకి వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం ద్వారా నీరు వృధాకాదు. ఈ విధానంలో మొక్కలను పెంచడం వల్ల భూములోకి చొచ్చుకొని పోయి నీటిని, పోషకాలను వెతుక్కోవలసిన పని ఉండదు కాబట్టి మట్టిలో పెరిగినుట్లుగా ఈ మొక్కల వేళ్ళు పెద్దగా పెరగవు. కాబట్టి పోషకాలు పూర్తిగా మొక్క పై భాగం పెరుగుదలకు ఉపయోగపడును.

పంట కాలాన్ని బట్టి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని అవసరమైతే ఎండ ఎక్కువ పడకుండా నీడను ఏర్పాటు చేస్తారు. ఎండ పడని ప్రదేశమైతే తగినంత వెలుతురు కోసం ఎల్‌ఇడి లైట్లను అమరుస్తారు.

హైడ్రోపోనిక్స్‌లో మొక్కలను పెంచడానికి కావలసిన ముఖ్యపరికరాలు :

ఇసి. మీటరు, పిహెచ్‌ మీటరు, లిట్మస్‌ పేపర్‌

పోషక ద్రావణం తయారీ :

సరైన పోషక ద్రావణాన్ని వాడాలి. అంటే తగిన మోతాదులో స్థూల మరియు సూక్ష్మపోషకాలను కలిగి ఉండాలి. సాధారణంగా పోషక ద్రావణం గాఢత 1000 నుండి 25000 పిపియం వరకు ఉండే విధంగా చూసుకోవాలి. పోషక పదార్థాల ద్రావణం పంటకు అనుగుణంగా తయారు చేసుకొని వాడుకోవాలి.

హైడ్రోపోనిక్స్‌ కెట్ల తయారీ సంస్థలు :

1. ఫ్యూచర్‌ ఫార్మా కంపెనీ

2. అర్బన్‌ కిసాన్‌

3. టేక్‌మాలి.

4. గ్రోనోపియా

5. బిట్‌యాంటిస్‌

6. గ్రీన్‌ టిక్‌ లైన్‌ మొదలగు కంపెనీలు హైడ్రోపోనిక్స్‌ కేట్లను తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు.

దిగుబడిలో తేడాలు, హైడ్రోపోనిక్స్‌ సాగు వల్ల దిగుబడిలో వ్యత్యాసం :

పంటలు నేలలో సాగు నీటిలో సాగు టమాటా 5-10 టన్నులు 60-300 టన్నులు బీన్స్‌ 5 టన్నులు 21 టన్నులు బఠాణి 1 టన్ను 9 టన్నులు బీట్‌ రూట్‌ 4 టన్నులు 12 టన్నులు ఆలు 8 టన్నులు 70 టన్నులు క్యాబేజీ 6 టన్నులు 9 టన్నులు

హైడ్రోపోనిక్స్‌ విధానంలో ఏ పంటలు పండించుకోవచ్చు :

స్ట్రాబెర్రీ :

ఈ విధానంలో ఇప్పటికే చాలా మంది రైతులు స్ట్రాబెర్రీ పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. నేలలో సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా స్ట్రాబెర్రీ సాగుచేయవచ్చు.

కాలే :

కాలే అనేది ఒక ఆకు కూర లాంటిది. దీన్ని శాస్త్రీయనామం బ్రాసికా బలరేసియా. దీని పెరుగుదలకు సూర్యరశ్మి అంత ఎక్కువగా అవసరం లేనందున ఈ జలసాగు విధానంలో పండించడం వల్ల అధిక పోషక విలువలు కలిగిన ఈ పంటను పండించి అధిక దిగుబడులు అదే విధంగా అధిక మార్కెట్‌ ధరను పొందవచ్చు.

పాలకూర :

పాలకూర అనేది మనందరికీ తెలిసిన, కావలసిన కూరగాయ పంట. దీన్ని హైడ్రోపోనిక్స్‌ విధానంలో సాగు చేయడం ద్వారా అనుకూల పరిస్థితుల్లో సుమారుగా 12 వారాల వరకు వరుసగా ఆకులను కోసి మార్కెట్‌కు పంపించుకోవచ్చు. ఈ పంటను హైడ్రోపోనిక్స్‌ వాడుకొని ఇంటి పైన ఖాళీ స్థలంలో కూడా పండించుకోవచ్చు.

టమాట :

మార్కెట్‌లో దొరికే టమాటాలు వివిధ రకాల రసాయనాలు, పురుగు మందులతో కలుషితమై ఆరోగ్యానికి హానికరంగా తయారవుతున్నాయి. హైడ్రోపోనిక్స్‌ విధానంలో కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు గల పరికరాలు వాడుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు.

దోస :

తీగజాతి కూరగాయలు కూడా హరిత గృహాలకు కావలసిన వాతావరణం కల్పించి హైడ్రోపోనిక్స్‌ విధానంలో పండించవచ్చు. ఇవే కాకుండా లెట్యూస్‌, పెప్పర్‌ వంటి ఇతర కూరగాయలు కూడా పండించవచ్చు.

జల సాగు విధానంలో వాతావరణ పరిస్ధితుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

ఉష్ణోగ్రత :

కొన్ని రకాల పంటలకు చలికాలంలో ఉష్ణం, ఎండాకాలంలో చల్లని వాతావరణాన్ని కల్పించడం వల్ల మంచి దిగుబడుల సాధింవచ్చు. అయినప్పటికీ సుమారుగా 65-750 ఫారన్‌హీట్‌ (65-750) ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు పాటించడం వల్ల మొక్క పెరుగుదల, ఆరోగ్యం బాగుంటుంది.

ఆర్థ్రత :

ఈ విధానంలో ఆర్థ్రత 40-80 శాతం ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఆర్‌హెచ్‌ ఉండడం వల్ల చీడపీడల బెడద ఎక్కువగా ఉండును. హైడ్రోమీటర్‌ అనే పరికరం ఉపయోగించి ఆర్థ్రతను సమతుల్యం చేయవచ్చు.

గాలి ప్రసరణ :

మొక్కల నుండి వెలువడే షశీ2 ను ఎక్జాస్ట్‌ ఫ్యాన్‌ అనే పరికరం వాడుకొని వేడి షశీ2 కలిగిన గాలిని బయటకు పంపి చల్లటిగాలిని లోపలికి పంపించాలి. దీని వల్ల మొక్కలకు కావాలసిన శీ2 అందించవచ్చు.

వెలుతురు :

పండించే స్థలంలో చీకటి స్థలం ఉన్నట్లయితే మార్కెట్‌లో దొరికే నణ శ్రీఱస్త్రష్ట్ర్‌ వాడుకొని వెలుతురును సమతుల్యం చేయాలి.

హైడ్రోపోనిక్స్‌ విధానం వల్ల కలిగే లాభాలు :

లాభాలలో మొదటిగా పంటకు కావలసిన నేలతో దీనికి సంబంధం ఉండదు.

తక్కువ స్థలంలో తక్కువ నీటిలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.

హరిత గృహాల్లోలాగా హైడ్రోపోనిక్స్‌ విధానంలో కూడా వాతావరణ పరిస్థితులను కావలసిన విధంగా మార్చుకోవచ్చు.

మనం సాంప్రదాయ పద్ధతిలో సాగుచేసుకునే నీటిలో 10 శాతం నీటిని వాడుకొని నీటి వృధాను తగ్గించుకోవచ్చు.

మొక్కలకు కావలసిన ఎరువులను, పోషకాలను ద్రావణ రూపంలో అందించడం వల్ల వాటి పోషక విలువ పెరిగి అధికంగా పెట్టే ఖర్చు తగ్గును.

సాధారణంగా నేలలో పెరిగే మొక్కలతో పోలిస్తే ఈ విధానంలో పెరిగే మొక్క పెరుగుదల రేటు ఎక్కువగా ఉండును. ఎందుకంటే నియంత్రిత వాతావరణం కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

కలుపు మొక్కలు మరియు చీడపీడలు, తెగుళ్ళ బెడద చాలా తక్కువగా ఉండును.

తక్కువ మోతాదులో పురుగు మందులు వాడడం వల్ల కలుషితం లేని సాగు చేయవచ్చు.

జూన లెవల్‌ నేల సాగులో కంటే నీటి సాగులో మనకు కావలసినంత సమతుల్యం చేసుకోవచ్చు. దీనితోపాటు కూలీల అవసరం కూడా తక్కువ.

హైడ్రోపోనిక్స్‌లో ఎదురయ్యే నష్టాలు :

సాంప్రదాయ సాగు విధానం కంటే ఈ పద్ధతిలో సాగుకు తగినంత అనుభవంగా శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి.

దీనిలో ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. కాబట్టి కొంచెం ఓపికతో చేయవలసి ఉంటుంది.

హైడ్రోపోనిక్స్‌లో సాగుచేసిన కూరగాయలు పండ్లు సేంద్రియమా? కాదా? అనే ప్రశ్న ఇంకా ప్రజల్లో కొనసాగుతుంది.

ఈ విధానంలో ఎలక్ట్రిసిటీ అవసరం ఎక్కువ ఉండడం వల్ల మధ్యలో కరెంటుతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి.

ఈ పద్ధతి పూర్తిగా సాంకేతిక పద్ధతి కావడం వల్ల దీన్ని అమర్చుకోవడానికి ముందుగా అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ.

దీనిలో చీడపీడల బెడద తక్కువ అయినప్పటికీ ఒకసారి ఏదైనా ఆశిస్తే వాటి వ్యాప్తి తొందరగా ఉండును.

కొన్ని సార్లు రైతు పెట్టిన ఖర్చుతో పోలిస్తే వచ్చే నిఖర ఆదాయం తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ నష్టాలతో పోలిస్తే లాభాలే ఎక్కువ ఉన్నందున సరైన అనుభవంతో సాగుచేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.

డా|| ఎ. నిర్మల, రజని, డా|| యమ్‌. వెంకటేశ్వర రెడ్డి, డా|| బి. నీరజ ప్రభాకర్‌, డా|| ఎ. మనోహర రావు, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 8330940330