మేము నివశించే నగర శివారులోని కొంపల్లి ప్రాంతం. ఇంకా చెప్పాలంటే ఒకప్పటి ద్రాక్షతోటల నిలయం. నగరంలోని దిగ్గజాలు (సెలబ్రెటీలు) హాబీగా వందల ఎకరాలు కొని, ద్రాక్ష తోటలు పెంచి నగర పౌరులకే కాకుండా, పసందైన అనాబ్‌సాహీ ద్రాక్షను ప్రపంచం మొత్తానికి రుచి చూపించేవారు. కండగల భూమిలో పుష్కలమైన భూగర్భ జలాలు లభించే ఆ ప్రాంతం నేడు కాలుష్యానికి మారుపేరుగా జనారణ్యంగా మారిపోయింది. దశాబ్దకాలం క్రితం ఈ ప్రాంతంలో ఉదయ శోభలు ఎంతో ఆహ్లాదంగా ఉండేయి. ఉదయాన్నే నెమళ్ళు నృత్యాలు చేస్తూ కనిపించేవి. ఉషోదయ భానుణ్ని చూసి తనువు పులకరించేది. అందమైన, పొడుగైన, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచే నిలువెత్తు తాడిచెట్లు ప్రకృతి మాత ముందు తలెత్తుకొని ఎంతో ఆనందాన్ని కలిగించేవి. కానీ వాటి జాడ నేడు కనపడదు. నిన్న, మొన్నటి వరకు ఉన్న ఆకుపచ్చ ఛాయలు నేడు మృగ్యమౌతున్నాయి. రియాల్టర్ల పోటీ పరుగులు, నివాసదారుల వెతుకులాట మధ్య పచ్చని బృందావనం నేడు ఆనందవనంగా లేదు. పాకాల కుంట పరిసరాలు మొత్తం నివాసయోగ్యాలుగా మారిపోయి గుక్కెడు మంచి నీటికి ప్రజలు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. లెక్కకు మించి నివాసదారులు బోర్లు వేయించుకోవడంతో భూగర్బజలాలు అడుగంటిపోయాయి. కానీ మా నివాస సమీపంలో గల ఓ ఇంకుడు గుంత మా పాలిట వరమైంది. ఇదే నీటి వనరుల అవసరాన్ని తెలియచేస్తుంది. మా పరిసరాల సాక్షిగా ఈనాటి ఈ వ్యాసంలో రాసే అభిప్రాయాల, ఆవేదనలు స్వయంకృతమైనవి. సమాజ అవసరాలను తెలియచెప్పేవి ఒక పర్యావరణ ప్రేమికుడిగా సమస్త ప్రజలకు ఈ వ్యాసం అంకితం...

ప్రపంచంలో పేరెన్నికగన్న మహానగరాలన్నీ నదుల పక్కనే విరాజిల్లుతున్నాయి. దానికి కారణం జీవజలం లభ్యం కావడమే. ఒకరకంగా చెప్పాలంటే సృష్టికి నిలయమైంది, నాగరికత విలసిల్లింది జల సిరులతోనే. ప్రకృతి ప్రసాదించిన వరం నీరు. సమస్త జీవలోకం, చెట్లు, పశుపక్ష్యాదుల మనుగడ జలంతోనే. జలాన్ని కాపాడుకోవడం, పొదుపు చేసుకోవడం, ప్రకృతి ప్రసాదించే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి సాగు, తాగు నీరుగా వినియోగించుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

సమకాలీన సమాజంలో ఇప్పుడు జలాలకోసమే యుద్ధాలు కొనసాగుతున్నాయి. నగరాల్లో, పల్లెల్లో ఇరుగు, పొరుగు సఖ్యంగా ఉండే అమ్మలక్కల మధ్య నుండి దేశాల సరిహద్దుల వరకు నీటి కోసం యుద్దాలు కొనసాగే దుస్థితి ఏర్పడింది. కలసికట్టుగా ఉండే మహిళలు ఏకంగా నీటి కొరకు బస్తీల్లో సిగపట్లకు తలపడడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. నీటి పంపుల దగ్గర, ట్యాంకర్ల దగ్గర జరిగే ఈ రభస శాంతి భద్రతల సమస్యగా మారిపోతుంది. ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నప్పటికీ మైళ్ళ దూరం మండుటెండలో నడచి బిందెడు నీరు కోసం మహిళలు పడుతున్న అవస్థలు స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా నెలకొని ఉండడం తీవ్ర విచారకరం.

నీటి సంక్షోభంతో నెలకొన్న అనేక చేదు అనుభవాలను మనం చూస్తున్న నేపద్యంలో ఏప్రిల్‌ నెల ప్రారంభంలోనే భూతాపం అధికమై 46-480 సెం. నమోదు కావడం పరిణామాల తీవ్రతను వ్యక్తం చేస్తుంది. దీనికంతటికీ కారణం మనిషి ప్రకృతిని నిర్యక్ష్యం చేయడం తద్వారా తన మనుగడను తానే ప్రశ్నార్థకం చేసుకోవడం చెట్టుమీద నిలబడి తన కొమ్మను తానే నరుక్కున్నట్టుగా తయారైంది.

తీవ్రమౌతున్న జల సంక్షోభం...శాంతి భద్రతలకు పెనుముప్పు

ఇటీవల కాలంలో మనం పరిశీలిస్తే మంచి నీటి లభ్యత కొరకు ప్రజలు ఏ స్థితికైనా దిగజారి తమలో తాము కలహించుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మహారాష్ట్రలోని లాటూరు జిల్లా మొత్తంలో రెవెన్యూ అధికారుల నివేదిక మేరకు పోలీసులు 144వ సెక్షన్‌ జిల్లా మొత్తం ప్రవేశ పెట్టాల్సివచ్చింది. మంచి నీటి కొరకు బస్తీల్లో ప్రారంభమైన శిగపట్లు, వర్గాల వారిగా విడిపోయి దాడులు చేసుకునే వరకు పరిణామాలు తీవ్రం కావడంతో జిల్లా యంత్రాంగం తప్పనిసరి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు నడుంకట్టాల్సి వచ్చింది. ఒకవైపు రాజస్థాన్‌ ధార్‌ ఎడారిలో పూలు, కాయలు పండించి అక్కడి పర్యావరణ సేనలు దాన్ని సస్యశ్యామలం చేస్తుండగా, మరోవంక వివిధ రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వర్షాలు లేక నదులు, తటాకాలు, మంచి నీటి వనరులు ఎండిపోవడంతో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్‌ వ్యాధి కారకమైన కలుషిత జలాలు ప్రజాజీవనాన్ని అస్థవ్యస్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని నల్గొండ మరికొన్ని జిల్లాలు అతలాకుతలమై ఏళ్ళ తరబడి పరిష్కారంలేని దిశలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిని అందించే బృహత్తర పథకం విజయవంతం కానుంది. కానీ విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో మంచి నీటి కొరత ప్రమాదకర స్థాయికి చేరింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుండి, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు మంచినీరు లేక ప్రజలు అలమటిస్తున్నారు. కృష్ణా, గోదావరి, పెన్న, వంశధార, నాగావళి వంటి నదీ తీర ప్రాంతాల్లో కూడా మంచి నీటి వసతి లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

ఆంధ్రప్రదేశ్‌లోని మెట్ట ప్రాంతాలైన ప్రకాశం, శ్రీకాకుళం ఇతర వెనుకబడిన జిల్లాల్లో భూగర్భజలాల్లో ఇమిడి ఉన్న ఫ్లోరైడ్‌తో ప్రజలు కిడ్నీ వ్యాధులు, ఫ్లోరోసిస్‌ వ్యాధులతో బాధపడుతున్నారు, కాగా ఒక వంక బంగాళాఖాతం, మరో వంక జీవనదులు, పంట కాలువలు ప్రవహించే కోస్తా తీర ప్రాంతంలో మానవుడు తన విధ్వంస రచనను తానే చేసుకుంటున్నాడు. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించి పంట పొలాలను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చి ఆహార పంటలకు దూరమవుతూ, జల కాలుష్యానికి కారణభూతులవుతున్నారు. దీనితో ఎక్కడా చుక్క మంచి నీరు లభించడక పోగా, ఉప్పు, రసాయనాలతో కూడిన కలుషిత జలాలనే అమృతంగా స్వీకరించాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో కోస్తా జిల్లాల్లో లెక్కకు మించి నమోదవుతున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తుంది. ఒక దూరదృష్టి ఉన్న ప్రభుత్వాధినేతలు తప్పా, జనాకర్షక పథకాలతో కేవలం ఓట్లు కొల్లగొట్టే కపట రాజనీతి ఈ సమస్యక పరిష్కారం చూపలేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఈ రకంగా ఉండగా పూర్తిగా భారతదేశమే జల విలయం వైపు వేగంగా పరుగులు తీస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికల లోపంతో పాటు దేశంలో నీటిని వినియోగించుకునే తీరును ప్రశ్నించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. 2040 నాటికి దేశంలో గుక్కెడు మంచి నీరు దొరికే పరిస్థితి లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. లభిస్తున్న ప్రతి ఒక్క నీటి చుక్కను ఎలా పొదుపుగా వాడుకునే దిశగా ఒక ఉద్యమ రూపంలో కదిలేతే తప్ప భవిష్యత్‌లో మానవ మనుగడకు ఏర్పడే ప్రమాద ఘంటికలు గమనించలేము.

భయపెడుతున్న నీటి లెక్కలు :

భారతదేశ జనాభాతో పోల్చుకుంటే తలసరి సగటు నీటి లభ్యత ఎంత తక్కువగా ఉందో మనం గమనించవచ్చు. వివిధ వనరుల ద్వారా లభించే ఆ నీటి నాణ్యత కూడా అంత గొప్పది కాదు. ఒక ప్రణాళికా బద్ధమైన నీటి వినియోగ విధానం లేకపోవడంతో, నీటి సరఫరాలో ఇప్పటికీ క్రమబద్ధత ఏర్పడకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. మన దేశానికి 2000 సం||లో 63,400 కోట్ల ఘ.మీ. నీటి అవసరాన్ని కనుగొన్నారు. 2025 నాటికి ఈ నీటి అవసరం 1,9,300 కోట్ల ఘ.మీ. అంచనాకు చేరుకుంది. 2050 నాటికి 1, 44, 700 కోట్ల ఘ.మీ. చేరనుందని నిపుణుల అంచనా. ఇప్పుడు సంవత్సరానికి మనకు లభిస్తున్న తలసరి నీరు 1947 సం||లో 6,042 క్యూ. మీ., 1951 సం||లో 5.177 క్యూ. మీ., 2001లో 1.820 క్యూ.మీ., 2011లో 1.542 క్యూ.మీ. ఉండగా ఆ పరిమాణం 2025 నాటికి 1.216 క్యూ. మీ., 2050 నాటికి 1.140 క్యూ. మీ. పడిపోవడం ఖాయమని అదే నిపుణులు అంచనావేశారు.

కాలుష్య జలం.. కఠిన పరిస్థితులు :

తాగు, సాగు నీటి కొరత, లభ్యతపై సమగ్రమైన అంచనాలు, సమస్యల నివారణకు సరైన ప్రణాళికలు లేక, దశ-దిశ నిర్ధేశించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో ఒక సర్వే నిర్వహించారు. పట్టణాల్లో 42 శాతం కాలుష్యపు నీరు, పల్లెల్లో ఏకంగా 60 శాతం కుటుంబాలకు కలుషిత జలమే దిక్కవుతుందని ఆ సర్వేలో ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా మరో దుర్భర అమానుషత్వ ప్రక్రియ ఒకటి వెలుగులోకి వచ్చింది. పట్టణ నగర ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో మురుగునీరు మంచి నీటితో కలసిపోయి నేరుగా కొళాయిల్లో ప్రజలకు సరఫరా కావడం విషాదం. పట్టణాల్లో దీని ప్రభావం వల్ల వివిధ రకాలైన దీర్ఘవ్యాధులకు ప్రజలు గురికావడం జరుగుతుంది. యుకోలై అనే ప్రమాదకరమైన వ్యాధికారక క్రిమి ఈ నీటిలో నిక్షిప్తమై ఉండి ప్రజాజీవితాన్ని రోగగ్రస్తం చేస్తుంది. భారతదేశపు అత్యధిక పురపాలక సంఘాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉండడం రహస్యమేమీకాదు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం మహానగరాల్లో జల సంక్షోభం ముంచుకువస్తుంది. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సర్వేప్రకారం ముంబై, కలకత్తా, హైదరాబాద్‌, కాన్పూరు నగరాల్లో మొత్తం 50 లక్షల ఇళ్ళ వరకు రక్షిత నీటి సరఫరా లేకపోవడం విషాదాన్ని తెలియచేస్తుంది.

నీటి సంక్షోభానికి మనమే కారణం :

ఆధునిక జీవన విధానానికి అలవాటు పడి మనిషి ప్రకృతికి, సహజ వనరులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాడు. తరుముకొస్తున్న నీటి సంక్షోభం మన మానవుల స్వయంకృతాపరాధమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతివృష్టి, అనావృష్టి ఏర్పడి పర్యావరణం దెబ్బతిన్న నేపధ్యంలో, మరో వంక ఓజోన్‌ పొరకు చిల్లుపడి అసహజమైన, అతి దురదృష్టకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి సునామీలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు సంభవించి జన నష్టంతో పాటు విలువైన ఎన్నో శతాబ్దాల తరబడి పెంచుకున్న చెట్లను కూల్చివేసి, పచ్చని ప్రాంతాలను ఏడారులుగా మార్చివేస్తున్నాయి. అతి భయంకరమైన పర్యావరణ సమస్యలకు, మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసే స్ధితి నుండి మనం ఎలా బయటపడాలో, వినాశకర ఆలోచనలు, స్వార్ధంకోసం చేసే దుష్ట ప్రక్రియల వల్ల ఎటువంటి హానికలుగుతుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం...

ఒకప్పుడు పల్లెటూరు భాగ్యసీమరా..... పాడిపంటలకు లోటు లేదురా అని ఆనందంగా పాడుకున్నాము. పల్లెకు పోదాం... ప్రకృతిని చూద్దాం అని సంబరంతో పయనమై వెళ్ళేవాళ్ళం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. మారిన పరిస్థితుల్లో వ్యవసాయం దండగని, కొద్దో గొప్పో పిల్లలని చదివించుకొని, ప్రయోజకులను చేసి ఏదో బావుకుందామని పట్టణాలకు ఎగబడుతున్నాం. స్వంత లోగిలి, ఎద్దు వ్యవసాయం, చెరువులు, తటాకాలు, కుంటలు, అందమైన తాడిచెట్లు అన్నీ వదలి కాంక్రీటు జనారణ్యంలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నాం. కార్పోరేట్‌ సంస్కృతిలో నిండారా మునిగితేలి, సమీపంలోని చెట్లను, ప్రకృతి వనరులను ధ్వంసం చేసుకొని అదే జీవనమనుకొని భ్రమపడుతున్నాం. సెల్‌టవర్‌ల రేడియేషన్‌తో ప్రకృతి ప్రసాదించిన పక్షులన్నీ అంతరించిపోగా, పాములు, లేళ్ళు, దుప్పులు ఇతర జీవజాతులను తరిమివేసి వాటి స్థానంలో మనం నివాసముంటూ ప్రాకృతిక జీవనానికి అంకితమై అర్థరహిత జీవనాన్ని కొనసాగిస్తున్న నేపద్యంలో అప్పటి వరకు తేట తెల్లంగా ఉన్న మంచి నీటి చెరువులను ఏదో ఒక రకంగా ఆక్రమించుకొని అక్కడే ఇళ్ళుకట్టుకుంటున్నాం. ఈ స్వార్థ చింతనకు అంతే లేకపోవడంతో కాంక్రీటు జంగిల్‌లో మన జీవితాలు నీటికి దూరమై, బ్రతుకు భారమై అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి.

పచ్చని అరణ్యాల మధ్యలో సిమెంటు అడవులను పెంచుకొని, భవనాల నిర్మాణానికి, వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు అడ్డమొస్తున్నాయనే నెపంతో వందలాది చెట్లను కూల్చివేసి పాపానికి వడిగడుతున్నాం.

జన సమర్ధం పెరిగిపోయి, వ్యవసాయాన్ని వదలివేసి వచ్చిన వలస వాదులకు ఉద్యోగాలు ఇప్పించే నెపంతో పరిశ్రమలు స్థాపించి కాలుష్య కాసారాలను అభివృద్ధి చేస్తున్నాం. కాదేదీ కాలుష్యానికి అనర్హమంటూ జల, వాయు, శబ్ద కాలుష్యాలతో మనం అదోరకం మాయాబజారులో నివశిస్తున్నాం..

మేఘాలను ఆకర్షించే చెట్లు లేకపోవడంతో వర్షం పడక, అడుగడుగునా భూమాతను బోర్ల రూపంలో గాయపరుస్తూ అన్ని రకాల కాలుష్యాలకు కారణభూతమైన మనం ఈ పరిస్థితి నుండి బయటపడడానికి, రుతువులు క్రమం తప్పడానికి కారణమైన మానసిక స్థితి నుండి బయటపడాలి. ఒకప్పుడు పర్యాటకులకు, ఇక్కడ నివశించే ప్రజలకు ఎంతో హృద్యంగా, ఆహ్లాదంగా, ఆనందకరమైన ప్రదేశంగా ఉన్న మన భాగ్యనగరంలో నేడు 46-500 ఉష్ణోగ్రతలో, గతంలో లేని ఉక్కపోతకు నేడు గురౌతూ ఉన్న సంగతిని గమనించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి కోటి జనాభాకు తగినట్లుగా ఒక్కొక్కరూ ఒక్కో చెట్టును పెంచి నగర వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకునే బాధ్యత మనమే తీసుకోవాలి. ఇంటికొక ఇంకుడు గుంతను ఎంతో ఇంపుగా భావించాలి.

ఇక్కడి నుండే పచ్చదనం పరిమళించే ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి. నేడే ప్రతినబూనాలి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు...

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌

దేశమే జల విలయం వైపు వేగంగా పరుగులు తీస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికల లోపంతో పాటు దేశంలో నీటిని వినియోగించుకునే తీరును ప్రశ్నించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. 2040 నాటికి దేశంలో గుక్కెడు మంచి నీరు దొరికే పరిస్థితి లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. లభిస్తున్న ప్రతి ఒక్క నీటి చుక్కను ఎలా పొదుపుగా వాడుకునే దిశగా ఒక ఉద్యమ రూపంలో కదిలేతే తప్ప భవిష్యత్‌లో మానవ మనుగడకు ఏర్పడే ప్రమాద ఘంటికలు గమనించలేము.

వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌